"భర్త జైలులో ఉన్నా , భార్యా పిల్లల్ని కనవచ్చు" అన్న పంజాబ్ హర్యానా హైకోర్టు !!
మొన్న పంజాబ్ హర్యానా హైకోర్టు వారు ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించారు . "జైలులో ఉన్నవారు వివాహితులు అయి ఉండి ,పిల్లలు కావాలని కొరుకుంటూంటె ,అట్టి వారికి తమ వైవాహిక బాగాస్వాములతో సెక్స్ వల్ గా కలవడానికి జైలు అధికారులు తగిన ఎర్పాటులు చెయ్యాలి . తమ వారసత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది పౌరులకు ఉన్న ప్రాదమిక హక్కు . అట్టి హక్కు అమలుకు జైలులో ఉన్న ఖైదీలు కూడా అర్హులే ".. ఇదీ హైకోర్టువారి తీర్పు ! హోషియా పూర్ కు చెందిన భార్యా భర్తలు జస్వీర్ సింగ్, సోనియా .ఒక ధనిక కుటుంభాన్ని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలన్న దురాశతో ,వారి 16 ఏండ్ల కుర్రవాడిని కిడ్నాప్ చేయడమే కాక ,హత్య చేసిన కేసులో ట్రయిల్ కోర్టు వారికి మరణ శిక్ష విదించింది . వారు పంజాబ్ హర్యానా హై ...