మదర్సాలను ప్రోత్సాహించేవారు మానవ హక్కుల కార్యకర్తలా !?
నిన్న ఆంద్రజ్యోతి ఆన్లైన్ ఎడిషన్ లో మానవ హక్కుల కార్య కర్తలుగా ప్రకటించుకున్న వారు ఇద్దరు రాసిన ఒక ఆర్టికిల్ చూశాను. దాని పేరు" హీరా వివాదం లో వాస్తవాలు". విషయం ఏమిటంటే , తిరుపతి దగ్గర తొండవాడ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న "హీరా ఇస్లామిక్ యూనివర్సిటి " ని హిందూ సంస్తలు అబ్యంతరం పెట్టడం బెదిరింపులు తో కూడిన చరిత్ర వక్రీకరణ అని , దానిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రగతి శీల వాదులందరూ ఏకం కావాలని పిలుపు ను ఇచ్చారు , సదరు స్వయం ప్రకటిత మానవ హక్కుల కార్య కర్తలు . సరే క్లుప్తంగా విషయం ఏమిటంటే అప్రకటిత హిందూ హోలీ సిటీ తిరుపతి కి దగ్గరలో తొండవాడ గ్రామంలో , తిమ్మప్ప దేవాలయం వద్ద కొంత మంది అన్యమతస్తులు 'హీరా ముస్లిం యూనివర్సిటి పేరుతో అక్రమంగా ఒక భవంతిని నిర్మించి అందులో వారికి సంబందించిన మత బోదనలు చేస్తున్నారు. ఈ మద్య పుత్తూరులో పట్టుబడిన ఉగ్ర...