భద్రాచలం రాములు వారి ఆభరణాలు స్మగ్లర్ ల కి అమ్ముకున్నారా?!!!

అవును ! సరిగ్గా ఇదే అనుమానం కలుగుతుంది ఈ రోజు ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన వార్తను చూస్తుంటే . పురాతన విగ్రహాలు , ఆభరణాలకు విదేశీ మార్కెట్లో బోల్డంత గిరాకీ ఉంది. మనకు మాములుగా అనిపించే వందల ఏండ్ల నాటి వస్తువులు, కోట్ల విలువ చేస్తాయి. అందుకే ఆరి తేరిన స్మగ్లర్లు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలలో ఉన్న పురాతన విగ్రహాలు ఆభరణాలు చోరీ చేయించి అయినా తమ హస్తగతం చేసుకుని విదేశీ స్మగ్లర్లకు అమ్మి కోట్లు గడిస్తున్నారు అని రికార్డులు చెపుతున్నాయి. అలాంటి స్మగ్లర్ల ప్రేరణ తోనే ఎన్నో ఏండ్లుగా పూజలు అందుకుంటున్న భద్రాచల సీతారాములు వారి ఆభరణాలు చోరీకి గురి అయ్యాయా అనే అనుమానం నా లాంటి భక్తులకు కలుగుతుంది. ...