పదమూడేళ్ళ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన 76,65, యేండ్ల వ్రుద్ద మ్రుగాళ్ళున్న సమాజంలో "నిర్భయ" సరిపోతుందా?
ఆడదైతే చాలు! దానికి వయసుతో పనిలేదు. మనసుతో పనిలేదు.ఒంటరిగా ఉన్నా, అనాధగా మిగిలినా పాశవికంగా అనుభవించి తీరాల్శిందే. అలా చేస్తేనే వారి ద్రుష్టిలో మగాడు కింద లెఖ్ఖ.పదేళ్ళ వాడి దగ్గర్ణుంచి, ఎనబై యేండ్ల వాడి వరకు ఇదే మృగాల్ల అభిప్రాయం. కరీంనగర్ జిల్లా , కోహెడ మండలం, శ్రీ రాముల పల్లిలో మానసిక వికలాంగురాలైన, పదమూడేళ్ళ బాలిక పై, అదే గ్రామానికి చెందిన సి.రాం రెడ్డి(76),జి. రాజయ్య(65), అనే వ్రుద్ద మ్రుగాళ్ళు అత్యాచారం చేసారట!. ఒకరు ఒక రోజు, మరొకరు మరొక రోజు అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. వీరు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి, ఒకరి తర్వాత ఒకరు పాడు చేసినట్లు ఆ అమ్మాయి తల్లి, ఇచ్చిన పోలిస్ రీపోర్టు ప్రకారం తెలుస్తుంది. అసలు ఇలాంటి ముసలి మ్రుగాళ్...