కొంపదీసి అసదుద్దీన్ గారి గాడ్ పాదర్ "ఆడమ్ " PK అమీర్ ఖానా ?
మొన్నశనివారం రాత్రి MIM అదినేత జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ గారు, మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్బంగా హైదరాబాద్ లో, భారత్ 'ఇస్లాం ప్రకారం ' తమ "గాడ్ పాదర్ గడ్డ" అని స్పీచ్ ఇచ్చారు . ఆ స్పీచ్ లో ఆయన చెప్పిన అంశాలు ఇండియాని ఇస్లామిక్ స్టేట్ గా మారుద్దాం అనుకునే వారికి చాలా అనుకూలంగా ,ప్రోత్సాహ కరంగా ఉన్నాయి . అవేమిటొ చూద్దామా? (1). ప్రపంచం లో ప్రతి వ్యక్తీ ముస్లిం గానే జన్మిస్తున్నాడు . కాని వారి తల్లితండ్రులు బలవంతంగా వేరే మతం లోకి మారుస్తున్నారు . అలా ఇతర మతస్తులు గా మారిన వారు తిరిగి ఇస్లాం ని ఆలింగనం చేసుకోవడం ద్వారా "స్వంత ఇంటి"కి చేరినట్లవుతూంది . అదే నిజమైన "ఘర్ వాపసి ". ...