Posts

Showing posts from September, 2014

తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ "బతుకమ్మ " ఆడుతుందా?

                                                                                                    తెలంగాణా లోని మెజార్టీ  స్త్రీలు ఎంతో వైబవంగా ,సాంప్రదాయ బద్దoగా, ఆడంబరాలకు ,బెషజాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ . ఇది ప్రత్యేకంగా  తెలంగాణా ప్రాంతానికే చెందినది కావడం వలన తెలంగాణా సర్కార్ ఈ పండుగ దినాలను  "సర్కార్ పండుగ " గా  ప్రకటించడం నూటికి నూరు పాళ్ళు సమర్దనియం . ఈ సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి గారు "బతుకమ్మ పండుగ ఏ కులానికో మతానికో సంబందించిది కాదు , ఇది యావత్ తెలంగాణా ప్రజల పండగ . అందుకే దీనిని స్టేట్ పెస్టివల్ గా డిక్లెర్ చేస్తున్నాం ". అని చెప్పడం మహదానందం కలిగించే మాట. దీనికి యావత్ తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం .     అయితే నాకొక చిన్న అనుమానం ఉంది . మరి ఇంత గొప్ప పండుగ అయిన మన సంప్రాదాయ  "బతుకమ్మ " పాటలను మన రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గారు అయిన "సానియా మిర్జా " గారు పాడుతూ అడగలరా ? మన బతుకమ్మ పండుగ విశిష్టతను విదేశాల వారికి అర్ధమయ్యేలా వివరించగలరా ? ఎంతో మంది భారతీయ మహిళా మణులు పా

చీర లోని గొప్పతనం సంగతేమో కాని , ఉపయోగాన్ని మాత్రం కనుకున్న మధ్యప్రదేశ్ మగ M.L.A

Image
                                                                                 కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వాటి గురించి వింటున్న భారత దేశం లో ప్రజా ప్రతినిధులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అశ్చ్యర్యం తో పాటూ అసహ్యం వేస్తుంది. మద్య ప్రదేస్ లో జరిగిన సంఘటన ఇది . ఒక కార్యక్రమo లో మాజీ మహిళా M.P ఒకరు మరియు ప్రస్తుత మగ M.L.A  పాల్గోన్నారట .  జ్యోతి ప్రజ్వలనం తర్వాత తన చేతికి అంటిన నూనెను తుడుచుకోవటానికి నాప్ కిన్ దొరకక సదరు మహిళా మాజీ M.P గారి చీరకు తుడుచుకున్నాడు అ మగ M.L.A . దీనిని ఆ M.P గారు గమనించలేదు కాని విడియో కెమెరాలు మాత్రం కనిపెట్టాయి . దీనికి అ ప్రబుద్దుడు ఏమని సంజాయిషీ ఇచ్చాడో క్రింది వీడియోను చూసి తెలుసుకోండి .                  పై సంఘటన చూసాక స్త్రీలు ధరించే "చీర " గురించి దాని గొప్ప తనం గురించి ఒక సినిమా కవి ఏమన్నాడో గుర్తుకు వచ్చింది .  కాని ఆ మధ్యప్రదేశ్ మగ M.L.A    కి స్త్రీలను మాత్రమె కాదు వారు కట్టుకున్న చీరలు కూడా ఎలా ఉపయోగించవచ్చో బాగా తెలుసు కాబట్టే ఇలా పబ్లిక్ గా ఫాల్తూ పని చేసాడు అనిపించింది . సినిమా కవి చెప్పిన చిర గొప్పతనం ఏమిటో క్రింది

వైజాగ్ లో పార్కులకు వెళ్లేవారికి "బ్లూ పిలిమ్స్ " ప్రదర్సనలు "ప్రీ " అంట!

                                                                            ఈ నాటి యువత లో కొంత మంది ప్రవర్తిస్తున్న తిరు చూస్తుంటే వారికే మాత్రం సామాజిక బాద్యత లు గురించి పట్టింపు లేనట్లు కనిపిస్తుంది . సాదారణం గా నగరాల్లో నివసించే మద్య తరగతి ప్రజలకు సేద దీర్చే కేంద్రాలు పార్కులు . తమ పిల్లలతో కొంత సేపు సాయం వేళలో పార్కుల్లో గడుపుదామని వచ్చె తల్లి తండ్రులకు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూసి "చీ ఛీ" ఇలాంటి ప్రాంతానికి వచ్చామేమిటిరా అని బాద పడాల్సి వస్తుందట! కారణం , సిగ్గూ శరం లేని కొంత మంది  యువకులు ప్రేమ పేరుతో అక్కడ సాగిస్తున్న "ప్రణయ కాండ" . అది చూసిన తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక పెద్దలు తెగ  ఇబ్బంది పడిపోతున్నారట !                           ఇదే విషయం గురించి వైజాగ్ పార్కుల్లో జరుగుతున్నా బూతు తంతు మీద T.V 9 వారు ఒక కార్యక్రమం ప్రసారం చేసారు . క్రింది విడియోను క్లిక్ చేసి చూడగలరు . వైజాగ్ కార్పోరేషన్ వారు స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది .లేదూ,   ఒక వేళ అటువంటి ప్రేమికులు  పార్కులను వారి ప్రేమ కలాపాలకు వినియోగించుకునే హక్కు ఉంద

సీమాంద్రా రాజదానిని రెండు నరసింహ క్షేత్రాలైన అగిరి పల్లి, మంగళ గిరి మద్య నిర్మింఛి "నర సింగపూర్" అని పేరు పెడితే బాగుంటుంది !

Image
                                                                            అగిరిపల్లి దేవాలయ మెట్ల మార్గం           సీమాంద్ర నూతన రాజదాని ని విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే నిర్మిస్తామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ప్రకటించడం   దైవ సంకల్పం లో బాగంగానే  అనిపిస్తుంది . మొన్నటి దాక వివిధ ప్రాంతాలు పేర్లు చెప్పుకోచ్సినప్పటికి రాజదానిగా ముక్యంగా గుంటూర్ , తెనాలి, మంగళగిరి , విజయవాడ మద్య ప్రాంతమే  బహుళ ప్రచారం లో ఉండటం వలన ఆ ప్రాంతాలులోని బూములకు బూమ్ వచ్చింది . అయితే అనూహ్యంగా తేరా మీదకు అగిరిపల్లి పరిసర ప్రాంతాలు రాజదానిగా చేయనున్నారని వార్తలు రావడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విజయవాడ పరిసరాలలోనే రాజదాని ఉంటుందని ప్రకటించడం తో "అగిరి పల్లి" పరిసర అటవీ ప్రాంతానికి మహర్దశ  పట్టినట్లే .   అగిరి పల్లి ఒక పుణ్య క్షేత్రమ్ . దేవదేవుడైన ఆ నరసింహ స్వామీ ఇక్కడ శోభనాచల వ్యాఘ్రా లక్ష్మీ నరసింహ స్వామిగా శోభానా చలం పై వేంచేసి ఉన్నారు . ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకోవాలంటే  క్రింది వీడియోను చూడవచ్చు .అగిరిపల్లి చుట్టూ అటవి ప్రాంతం వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వలన ఇక్కడ రాజదాని న