కామ పిశాచులు ని " నిర్భయ" చట్టం నిరోదించలేదని తెలియచేస్తున్న "గార్ల కిరణ్మయి " ఉదంతం
చట్టాలు నేరస్తులను శిక్షించ గలవు! కానీ వారిని నేరాలు చెయ్యకుండా ఆపగలవా? ఇది ఇప్పుడు సమాజంలోని ప్రతి ఒక్క మేదావి ఆలోచించవలసిన అంశం . "కామా తురాణం నభయం, న లజ్జ " అంటారు. కామంతో కళ్ళు మూసుకు పోయి ప్రవర్తించే వాడికి, ఒళ్లంతా కామ పిశాచం ఆవహించి ఉన్న వేళ , వాడికి "నిర్భయ " చట్టం గుర్తుకు వస్తుందా? చచ్చినా రాదు. పైగా పాప కార్యం అయి పోయాకా , అప్పుడు చట్టం గుర్తుకు వచ్చి, సాక్ష్యాలు దొరకకుండా ఏమి చెయ్యాలని చూస్తాడు. చివరకు బాదితురాలిని చంపడానికి కూడా వెనుకాడడు. మరి ఇటువంటి కామ పిశాచుల నుండి అమాయకపు ఆడపిల్లలను రక్షించడానికి సమాజంలో కేవలం కఠిన చట్టాలు ఉన్నంత...