"చటుక్కున పడితే లటుక్కున లాగ్ -ఇన్ అయింది " అన్న రేపిస్ట్ వాదన నమ్మి " రేప్ కేసు కొట్టేసిన కోర్టు !!
"పుటుక్కు జర జరా డుబ్బుక్కు మే " అనే కధ ఒకటి మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలలో ఉంది. టూకీగా కదా సారాంశం ఏమిటంటె ఎక్కడో ఇంటిపైన తీగకి ఉన్న బూడిద గుమ్మడి కాయ చూరు క్రింద ఉన్న మేక నొక దానిని గాయపరచింది . అదెలా అంటే పైనున్న గుమ్మడి కాయ తొడిమ ని ఎలుక ఒకటి పుటుక్కున కొరికితే సదరు గుమ్మడి కాయ జరా జరా ఇంటి మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి , ఇంటి చూరు క్రింద సేద దీరుతున్న ఒక మేక మీద డుబ్బుక్కు మంటూ పడితే మేక బాదతో "మే .." అని అరచిందంట . అదీ కధ . మరి ఈ కద గురింఛి సౌది మిలియనీర్ అయిన ఇషాన్ అబ్దుల్ అజీజ్ గారికి తెలుసో తెలియదో కాని ఇలాంటి కహాని ఒకటీ జడ్జ్ గారికి వినిపించి తనమీద మోపబడిన అత్యాచార కేసు నుండి విముక్తుడు కాగలిగాడు . మరి అబ్దుల్ అజీజ్ గారి రేప్ కహానీ ఏమిటో చూదామా ? అజీజ్ గారు ఉండేది లండన్ లో . చేసే వ్యాపారం రియల్ ఎస్తేట్.