తన పిల్లల దన విజ్ఞానానికి బలై పోయిన "జన విజ్ఞాన వేదిక " నాయకుడు !
మన సమాజం లో కొంతమంది నిస్వార్దంగా జనం కోసం అహర్నిశలు పని చేస్తూ , తాము నమ్మిన సిద్దాంతం కోసం తన సర్వసాన్ని చివరకు తన ఆస్తి పాస్తులను సైతం సమర్పించేసి " మహాత్ములు " మహా పురుషులు అనిపించుకుంటారు . వీరి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనే విషయం లో ఎలాంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. కాని వీరి అంతులేని ఉదార స్వబావం వలన బాదితులుగా మారేది సదరు మహాత్ముల "కుటుంబ సబ్యులు". అందుకే జనానికి "గాడ్ పాదర్" అయిన వారు కూడా , ఇంట్లో పిల్లలకి "గుడ్ పాధర్ " కాలేరు. ఇంట గెలిచి రచ్చ గెలవడమనేది విజ్ఞుల లక్షణం . కాదు సమాజమే నా దేవాలయం . ప్రజలే నా దేవుళ్ళు అనుకున్నప్పుడు ముందు కుటుంబ బాద్యతలు నెరవేర్చి , ఇంట్లో ని సబ్యులందరిని సమావేశపరచి , తన ఆస్తి పాస్తులును ఎవరి వాటా వారికి ఇచ్చివేసి , తనకు వచ్చిన వాటాని , ఇక బవిష్యత్ లో తానూ సంపాదించే దానిని పూర్తిగా తానూ నమ్మిన సిద్దాంతం కోసమో , ప్రజల కోసమో వెచ్సిస్తాను అని స్పష్టంగా చెప్పివేస్తే , అది ధర్మబద్దంగాను, న్యాయబద్దంగాను ఉంటుంది. పిల్లల మనస్సు