రమణమ్మ కుమారుడు కుక్కల దాడిలో చనిపోవడానికి , అక్కినేని అమల గారికి ఏమిటి సంబందం !?.
ఫేస్ బుక్ లో లైక్ ల కోసం , షేర్ ల కోసం కొంత మంది యువత పడే తాపత్రయం చూస్తుంటె , ఒకవేళ ఫేస్ బుక్ కనుక మూతబడితే పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచిస్తుంటే బయం వేస్తుంది. ముక్యంగా యువత చాలా మంది , "కల్తీ కల్లు " దొరకని వారి లాగా ఉన్మాదానికి గురి అవుతారేమో అని పిస్తుంది. అసలు ఫేస్ బుక్ షేర్ ల వల న ఏమైనా ఆర్దిక లాబం ఉందా? ఫేస్ బుక్ షేర్ లు ఏమైనా వ్యాపార కంపెనీల షేర్ లు లాంటివా? ఎన్ని ఎక్కువ షేర్ లు పొందినా ఆర్దిక పరంగా కాని, అవార్డుల పరంగా కాని ఏమి ఉపయోగం లేనప్పుడు వాటి కోసం అంత తహ తహ ఎందుకు? వాటి కోసం పోస్టులను ను షేర్ చెయ్యండి...