బాయ్ ప్రెండ్ రమ్మనాడని రూం కెళితే,'బ్రతుకు బ్లూ పిలిం అయిందట ' !!!
"రెండేళ్ళుగా ప్రేమ వంచన " అనే టైటిల్ పేపర్లో చూసి ,ఏమిటీ విషయం అని పేపర్ లోని విషయం ఆసాంతం చదవటం జరిగింది .కధ మామూలే .'బాయ్ ప్రెండ్,గర్ల్ ప్రెండ్ ' సంస్కృతికి బలి అయిన ఒక అబాగిని వాస్తవ జీవితం అది . ఈ డర్టీ బాయ్ ప్రెండ్ సంస్కృతి వద్దమ్మా ,అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోని "నవీన" ఆడపిల్లలకు ఈ ఉదంతం ఒక కను విప్పు కావాలి . బాయ్ ప్రెండ్ లు పిలిచారని ఎక్కడికి పడితే అక్కడికి ఎగేసుకు పోయె ఆడపిల్లల గురించి ,సదరు బాయ్ ప్రెండ్ కు ,ఆ ప్రెండ్ ప్రెండ్ లకు ఎటువంటి అభిప్రాయం ఉంటుందో ,ఈ ఉదంతం చక్కగా తెలియ చెస్తుంది . విదేశాల సంగతి ఏమో కాని ,ఈ దేశం లో మాత్రం ,బాయ్ ప్రెండ్ ఉన్న అమ్మాయిలు "ఆ బాపతే "అని చాలా మంది బాయ్ ప్రెండ్ లకు వీర నమ్మక్కం .ఒక్క సారి బాయిప్రెండ్ కాని ,అతని స్నేహితుల రూం కి కాని వెళితే ,ఇక ఆ పిల్ల బ్రతుకు "వేటగాళ్ళకు ...