బట్టలు సరిచేసే వాడే "బాయ్ ప్రెండ్ " అంటున్న ఈ దిక్కు మాలిన సందేశం చూడండి !
ఆదర్శం వేరు ! వాస్తవం వేరు! ఆదర్శం మనం ఎలా ఉండాలో చెపుతుంది .వాస్తవం మనం ఎలా ఉన్నామో తెలియ చేస్తుంది . వాస్తవ పరిస్తితిని గమనించకుండా ,కేవలం ఆదర్శం ఆదారంగా అడుగులు వేస్తే తప్పకుండా నష్ట పోవడం ఖాయం .ప్రస్తుతమ్ మన దేశం లో "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ " సంస్క్రుతి విషయం లో జరుగుతున్నది అదే . ఇండియాలో నే కాదు ,ప్రపంచం లో ఎక్కడైనా సరే స్త్రీ పురుషుల మద్య లైంగిక ఆకర్షణ అనేది సహజం . ఇద్దరు పరాయి పురుషులు కలసి ఏకాంతంగా ఉండే పరిస్తితులు , ఇద్దరు పరాయి స్త్రీ పురుషులు కలసి ఉండే పరిస్తితులు ఒకే లాగ ఉంటాయి అని అంటె అది ప్రక్రుతి సూత్రాలకు విరుద్దమైన మాట. అందుకె ఈడు వచ్చిన ఆడపిల్లలు ని కుటుంభ సబ్యులు అయినా సరే , మగవాళ్ళతో కలసి ఒకే మంచం మీద పడుకోనివ్వరు అంటే ,ప్రక్రుతి ధర్మం తెలియటం వలననే . మరి బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ ఏకాంతంగా మందు కొట్టి, ఒళ్ళు తెలియ...