"నాగుపాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు
శ్రీ మద్దిగుంట తిరుపతయ్య మరియు శ్రీమతి మద్దిగుంట సరస్వతి గారలు. ఈ రోజు నాగ చతుర్దీ. మనవు తెలుగు బ్లాగు మిత్రులకు, వీక్షకులకు , అగ్గ్రిగ్రేటర్లకు నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియ చేస్తూ, నాగేంద్రుని మహిమలు గురించి మా తల్లి తండ్రుల ద్వారా విన్న వారి ప్రత్యక్ష అనుభవాలు చెపుతాను . నాగు పాములకు మహిమలు ఉంటాయని మనం పురాణాలలో చదివాము.ఎన్నో సినిమాలు ఈ నేపద్యంలో తీసారు.హిందూ దేవుళ్లలో నాగ దేవతకు ప్రత్యేక స్తానం ఉంది.మన జాతి చరిత్ర ప్రకారం మనం "నాగ వంశం" నకు చెందిన వారమని చెపుతారు.ముఖ్యంగా దీపావళి పందుగ తర్వాత వచ్చే చవితి ని "నాగుల చవితి" గా మనం పందుగా చేస్తాం. ఆ రోజు పుట్టలో పాలు పోసి,స్త్రీలు పాటలు పాడి, భక్తితో నాగేంద్రుని కొలుస్తారు.సరే అన్నిటి వలే ఈ నాగ దేవతవిషయమ్ లో కూడ సైన్స్ చెప్పేది వేరుగా ఉంటుంది.ఎవరో చెప్పటం