ఆకాశంలో సగం , అవినీతిలో ఆసాంతం అన్నందుకే ఆ 3 మహిళా సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారా?!!
ఈ రోజు ఈ నాడు డైలీ ఖమ్మం జిల్లా ఎడిషన్ లోని ఒక వార్త ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే అవినీతి కి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమైనందుకు గాను ఖమ్మం జిల్లాలోని 3 సర్పంచుల చెక్ పవర్ లను జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావుగారు రద్దు చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే సదరు ముగ్గురు సర్పంచ్ లు మహిళలే కావడం. పురుషులతో పాటు స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కావాలి అని అభిలషిస్తున్న మనం అభివృద్ధిలో ఏమో కానీ , అవినీతిలో మాత్రం పురుషులను మించిపోయారు స్త్రీలు అని తెలిపే అనేక ఉదంతాలలో ఈ మహిళా సర్పంచ్ ల చెక్ పవర్లూ రద్దు ఉదంతం కూడా ఒకటి కాబోలు. ఇంతకీ వారు చేసిన అవినీతి ఏమిటంటే (1). భద్రాచలం డివిజన్ లోని చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా జ్యోతిర్మయి గారు 44 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారట. అందుకు బాద్యుడు అయిన పంచాయతీ కార్యదర్శి పేరు దేవరాజ్ . (2). వాజేడు మండలం చెరుకూరు గ్రామ సర్పంచి అరుణ గారు 10. 30 లక్షల నిధులు దుర్వినియోగం చేశారట . దానికి బాద్యుడి...