Posts

Showing posts with the label T.V 9 వారి అత్యాచార యత్నం

కాళహస్తిలొ T.V 9 వారి "సంచలన సామూహిక అత్యాచార యత్నం"

                                                               కందకు లేని దురద కత్తి పీట కు ఎందుకు అనేది మీడియా వారికి అస్సలు నచ్చని  మాట . కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి చానల్ పెట్టింది ఖాలిగా కూర్చోవటానికా ? అని T.V చానల్స్ వారి ప్రశ్న . అందుకే రంద్రాలు ఉన్నా లేక పోయినా రంద్రాన్వేషణ తప్పదు .               హిందూ మతo అంటే సరిపడని T.V 9 వారికి ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళ హస్తిలొ ఏదో గాంగ్ రేప్ అటెంప్ట్ జరిగిందని ఉప్పు అందింది అట ! దానితో వారు నానా హైరానా పడుతూ గొట్టాలు , కెమెరాలు తీసుకుని స్పాట్ కెళితే అక్కడ ఏమి కన్పించలేదు . అయినా మూల శంక తీరక పోలిస్ స్టేషన్ కి వెళితే అక్కడ అటువంటి పిర్యాదు చేయలేదన్నారు . దానితో లాభం ...