కాళహస్తిలొ T.V 9 వారి "సంచలన సామూహిక అత్యాచార యత్నం"
కందకు లేని దురద కత్తి పీట కు ఎందుకు అనేది మీడియా వారికి అస్సలు నచ్చని మాట . కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి చానల్ పెట్టింది ఖాలిగా కూర్చోవటానికా ? అని T.V చానల్స్ వారి ప్రశ్న . అందుకే రంద్రాలు ఉన్నా లేక పోయినా రంద్రాన్వేషణ తప్పదు .
హిందూ మతo అంటే సరిపడని T.V 9 వారికి ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళ హస్తిలొ ఏదో గాంగ్ రేప్ అటెంప్ట్ జరిగిందని ఉప్పు అందింది అట ! దానితో వారు నానా హైరానా పడుతూ గొట్టాలు , కెమెరాలు తీసుకుని స్పాట్ కెళితే అక్కడ ఏమి కన్పించలేదు . అయినా మూల శంక తీరక పోలిస్ స్టేషన్ కి వెళితే అక్కడ అటువంటి పిర్యాదు చేయలేదన్నారు . దానితో లాభం లేదని వారే ఉన్నతాదికారులకు తమకు అందిన కూజాడ అందించి , దానికి కొంత మసాలా దట్టించి "సంచలన న్యూస్ " గా చానల్ లో"ఇంతా చేస్తే ఏమి జరగలేదే" అన్న తమ అందోళన ను ను ఘటన మిద ప్రజల ఆందోళన గా చెపుతూ ప్రసారం చేసారు .అది చూస్తుంటే కాళ హస్తిలొని T.V 9 విలేకరికి , స్తానికంగా ఉండే వారికి సరిపడక సృష్టించిన కద అనిపిస్తుంది . ఒక వేళా అది నిజమే అయినా దాని వెనుక అసలు కద వేరే అయి ఉండాలి . ఖచ్చితంగా ఆదారాలు ఉంటె అమ్మాయే కేసు పెట్టకపోయినా చానల్ ప్రతినిధులు కేసు పెట్టి ఉండే వారు . మరి ఆ పని చెయ్యకుండా , సంచలనాలు అంటూ జరగని ఘోరాలను జరిగినట్లు చెపుతూ , పుణ్య క్షేత్రాలు పట్ల ప్రజలలో అనుమానాలు , అభద్రతా బావాలు రేకెత్తించే వార్తలు ప్రసారం చెయ్యడం ఎంతవరకు కరెక్టు ? అదిT.V 9 చానల్ పరిస్తితి . అసలు కదేమో కాని T.V. 9 వారి కహాని మాత్రం క్రింది విడియోలో చూడండి .
Comments
Post a Comment