ఇంత జరిగాక ఇప్పుడు సుప్రీం కోర్టు ను ఆశ్రయించి రాష్ట్ర విభజన ఆపడం వలన తెలుగు ప్రజలకు లాభమా ?నష్టమా ?

                                                     
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే అయన చేతిలో ఇంకా లాస్ట్ బాల్  ఉండనే బలంగా నమ్ముతున్నట్లు కనపడుతుంది . అలాగే K.C.R  గారు కూడా T.R.S  పార్టిని ఇంకా కాంగ్రెస్ లో విలీనం చేయకుండా మీనమేషాలు లెక్కించడం , పార్టి వర్గాలు చేత కాంగ్రెస్ తో విలినమే కాదు పొత్తు కూడా వద్దని చెప్పించడం చూస్తుంటే ఆ పార్టి వారికి కూడా రాష్ట్ర విభజన చెల్లుబాటు  మిద కొన్ని అనుమానాలు ఉన్నాయి  అనిపిస్తుంది  . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తేదిని ప్రకటించకుండానే నిన్న K.C.R గారు, అంతకు ముందు చేసిన వాగ్దానం  "నేను తిరిగి అడుగంటూ పెడితే తెలంగాణా రాష్ట్రం లోనే" అన్నదానికి విరుద్దంగా హైదరాబాద్లో అడుగుపెట్టి , గుర్రాలు , లొట్టి పిట్టల సహిత స్వాగత సత్కారాలు స్వికరిoచడం కూడా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపడానికే నన్నది అర్ధమవుతుంది .

   రాష్ట్ర విభజన అనేది రాజ్యంగ బద్దంగా జరగలేదని భారత పార్లమెంటేరియన్లకు అందరికి తెలుసు . విభజన బిల్ చట్టం గా మారాక సుప్రింకోర్టు  వారు తప్పకుండా జ్యోక్యం  చేసుకుంటారని కేంద్రం లోని అధికార పక్షానికి , ప్రతి పక్షానికి కూడా తెలుసు అన్నది , రాజ్య సభలో చర్చల సందర్భంగా వారు మాట్లాడిన మాటలు బట్టి తెలుస్తుంది . ఉమ్మడి రాజధాని , ఆర్టికిల్ 371 D విషయంలో రాజ్యంగా సవరణలు తప్పని సరి అని భారతీయ జనతా పార్టి తరపున అరుణ్ జైట్లీ గారు అభ్యంతరం లేవనెత్తుతూ , ఇప్పటికైనా కాంగ్రెస్ వారు రాజ్యంగ సవరణకు ప్రతిపాదిస్తే తాము సహకరించడానికి సిద్దంగా ఉన్నాం అని చెప్పినా కాంగ్రెస్ వినిపించుకోలేదు .దానికి కాంగ్రెస్ న్యాయ పండితులు ఒక పక్క రాజ్యంగ సవరణ అవసరం లేదంటూనే , ఒక వేళ  సుప్రీం కోర్టు అబ్యంతరం పెడితే అప్పుడు చేద్దాంలే అని చెప్పడం చూస్తుంటే , కాంగ్రెస్ వారికి కూడా విభజన  బిల్ రాజ్యంగ బద్దత మిద అనుమానాలు ఉన్నాయి అనిపిస్తుంది . అయితే రాబోయే ప్రబుత్వం తమదో , B.J.P దో  అవుతుంది కాబట్టి , తాము ఇద్దరూ రాష్ట్ర విభజనకు అనుకూలమే కాబట్టి , అవసరాన్ని బట్టి రాజ్యంగ  సవరణ వచ్చె పార్లమెంటులో చేసుకొవచ్చులె అన్నది కాంగ్రెస్ ఆలోచన . రాష్ట్ర విభజన చట్టం మిద సుప్రీం కోర్టు వారు ఓ.కే.  అనే దాక రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెస్ లేదు . అందుకే ఉమ్మడి రాష్ట్రం లోనే ఎన్నికలు జరుగుతాయి అని సంకేతాలు ఇస్తుంది .

    కాంగ్రెస్ వారి ప్లాన్ ప్రకారం తెలంగాణలో T.R.S సాదించే సీట్లు తమకు ఉపయోగపడేవే . తాము చెప్పిన విదంగా తెలంగాణా రాష్ట్రం ఇచ్చాం కాబట్టి తమకు తెలంగాణాలో డోకా లేదు . ఇక సిమాంద్ర లో అయితే ప్రస్తుత పరిస్తితి తమకు వ్యతిరేకంగా ఉన్నా , కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది . రేపు సుప్రీం కోర్టులో కిరణ్ కుమార్ రెడ్డి వేయబోయే పెటిషన్ కు స్పందించి కోర్టు వారు చట్ట అమలును ఆపితే దానితో కిరణ్ రెడ్డి గారి పార్టి సిమాంద్ర ను స్విప్ చేస్తుంది . తెలుగు దేశం అట్టర్ ప్లాప్ అవుతుంది . కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతిలో ఉన్న సీట్లు కూడా ఏదో రకంగా అంతిమంగా తమకు ఉపయోగ పడేవే తప్పా , B.J.P  కి మాత్రం కాదు . ఈ విదంగా సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకుంటే రెండు ప్రాంతాలలో , కలుగ చేసుకోకపోతే తెలంగాణలో పాయిదా పొందే విదంగా ప్లాన్ చేసి అ విదంగా ముందుకు పోతుంది . అంటే విభజన ప్రక్రియకు పార్లమెంటు ఆమోదమే కాదు సుప్రీం కోర్టు వారి ఆమోదం కావాలి అని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చె తడనుగుంగా తమ గెమ్ ప్లాన్ అమలు చేస్తున్నాయి .

   కాని అంతా వారనుకున్నట్లు జరిగితే ఆ  భగవంతుడు ఎందుకు? రేపు థర్డ్ ప్రంట్ కి పార్లమెంటులో అత్యదిక సీట్లు వస్తే రాజ్యంగ సవరణకు విఘాతం కాదా ? అట్టి పరిస్తుతుల్లో మరో  5 సంవత్సరాలు ఆగాల్సి వస్తే ?అప్పుడు పరిస్తితి  ఏమిటి ? తెలంగాణా రాలేదనే 1300 మంది అమర వీరులు  అయిన తెలంగాణలో , వచ్చి కోర్టులు వలన ఆగిందంటే ఇంకెంత మంది ఆత్మార్పణ చేసుకుంటారో ?. ఇది తెలుగువారి మద్య ఇది ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుంది ? దిని గురించి సమైక్య వాదులు ఆలోచించాలి . రాష్ట్రం కలసి ఉన్నా విడిపోయినా అంతిమంగా అది ఉభయ ప్రాంతాలకు లాభించెదిగా ఉండాలి . అలా కొరుకొవలసిన బాద్యత విభజన వాదులు కంటే సమైక్య వాదులు మీదే ఎక్కువుగా ఉంది . కాబట్టి నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెపుతున్నట్లు రాష్ట్ర విభజన వలన సిమాంద్ర కంటే తెలంగాణాకే ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకుంటే , అది ఎలాగో విస్తృత ప్రచారం ద్వారా తెలంగాణా ప్రజలకు లేకపోతె తెలంగాన మేధావులకు చెప్పి ఒప్పించిన తర్వాతే సుప్రీం కోర్టుకు వెళ్ళితే బాగుంటుంది .లేదూ కేవలం  సిమాంద్ర కె నష్టం అనుకుంటే కోర్టులకు వెళ్ళే బదులు  రాజకీయంగా గానే కాంగ్రెస్ , B.J.P వారు హామీ ఇచ్చారు కాబట్టి ,నష్ట నివారణ కోసం ఏమి చేయాలో  ఆలోచిస్తే మంచిది .
             
            అలాగే తెలంగాణా ప్రజలు కూడా సుప్రీం కోర్టువారు ఏమంటారో విన్న తర్వాతే "సంబురాలు" చేసుకుంటే బాగుంటుంది .అప్ కోర్స్ మార్చ్ లో గొప్ప సభ నిర్వహిస్తాం అని K.T.R గారు చెప్పడం లో అంతర్యం అదే కాబోలు . విడిపోవడానికి అయినా , కలిసి ఉండడానికి అయినా  ప్రజల సంకల్పంతో పాటు భగవంతుని సంకల్పం కూడా ఉండాలని ప్రజలు అనుకుంటే ప్రశాంతం గా ఉంటారు . లేకుంటే అల్ల కల్లోలమే .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!