చివరకు సిమాంద్ర రాజదానికి "ఉంపుడు గత్తె " హోదాయేనా !?

                                                     


తెలంగాణా రాష్ట్రం ! అనివార్యం .! ఆ రాష్ట్ర ఏర్పాటుకు ఏ రాజకీయ పార్టి అడ్డుచేప్పటం లెదు అని అన్ని రాజకీయ పార్టీలు పైకి చెపుతున్నాయి . కాని ఏదో వంకతో రాష్ట్రవిభజన ఆగితే బాగుండు అని సిమాంద్ర లోని అన్ని రాజకీయ పార్టీల వారు మనసులో అనుకుంటున్నారు . దిని కోసం "విభజించడానికి మాకు అబ్యంతరం లేదు , కేవలం విభజన తిరు మీదే మా అబ్యంతరం " అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . ప్రజల మనసులో ఏముందో దానిని కూడా సరిగా అవసరమైన వేళ , అవసరమైన వేదికల మిద చెప్పడం చేతకాని రాజకీయ నాయకులు ఉండటం సిమాంద్ర ప్రజల దురదృష్టం . కారాలు మిరియాలు నూరి బీరాలు పలికిన వారంతా ఇప్పుడు మీడియా సాక్షిగా బోరున ఏడుస్తుంటే , అవకాశాలు ఉన్నా సరిగా అటాడలేక,  ఓడిపోయి ఏడుస్తున్న ఆటగాళ్ళు గుర్తుకు వస్తున్నారు . ఇక ఉద్యోగుల నాయకులైతే మరీను ! మన డ్యూటి మనం చేసాం ! ఇక ఒక్క రోజు పని ఎగ్గొట్టినా ఇక ప్రబుత్వాలు జీతాలు ఇవ్వవు కాబట్టి , వెంటనే విదుల్లొ చేరాలని అత్ర పడుతున్నారు . అంటే వెనుకటి సమ్మెలు అన్నీ, ప్రభుత్వ ముందస్తు లోపాయకారి అంగీకారం తోనే చేసారు అన్న మాట ! ఇటువంటి రాజకీయ నాయకులు , ఉద్యోగులను నమ్మా సిమాంద్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశ పడింది ? విరి నిర్వాకం వలన చివరకు ఆంద్ర ప్రదెస్ ఉరప్ సిమాంద్ర తాత్కాలిక రాజదానికి ఒక చట్ట పరమైన గుర్తింపు లేకుండా ఉండే పరిస్తిటి ఏర్పడింది .

  ఉమ్మడి రాజదాని ! ఒక గవర్నర్ ఇద్దరు ముఖ్య మంత్రులు ! అందరు ఉండేది హైదరాబాద్ లోనే అట ! 10 సంవత్సరాల పాటు ఇదే తంతు అట ! మరి చట్ట ప్రకారం హైదరాబాద్ రాజదాని ఎవరిదీ అంటే తెలంగాణా వారిదే . ! మరి సిమాంద్ర వారి పరిస్తితి ఏమిటంటే గవర్నర్ గారి అంటే కేంద్రం దయ . తెలంగాణా వారికి కూడా 10 ఏండ్లు చేసేదేమీ లేదు , కేంద్రం కాళ్ళు పిసకడం తప్పా! ఇది ఎలా ఉంటుందంటే , ఒక మొగుడు ఇద్దరు పెళ్ళాలు పరిస్తితి . సవతి మిద అధిపత్యం చెలాయించాలంటే  మొగుడుని మంచి చేసుకోవాలి ! ఒక అవగాహనకు రాకుండా , చట్ట పరమైన ఏర్పాట్లు చేయకుండా ఇద్దరు పెళ్ళాలతో ఒకే ఇంట్లో కాపురం చెయ్యడం లాంటిదే ఇది. ఒక వేల అసలు పెళ్ళాం కోర్టుకు వెళితే , రెండో పెళ్ళాం బయటకు వెళ్ళక తప్పదు. అంటే చట్ట ప్రకారం "ఉంపుడు గత్తె " పరిస్తితే . అందుకనే రెండో బార్యలుగా వచ్చె వారు జాగర్తపడీ కొంత ఆస్తిని తమ పేరున పెట్టించుకున్నాకే  ఉమ్మడి సంసారానికి O.K  అంటారు . ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా పోయింది . ఉమ్మడి రాజదాని విషయంలో తెలంగాణా వారు ఎవరైనా సరే ఖచితమ్గా కోర్టుకు వెళ్లి తీరుతారు . ఇప్పటికే అసదుదుద్దిన్ ఒవైసీ గారు "చలో సుప్రీం కోర్టు అంటున్నారు . అప్పుడైనా సిమాoద్ర వారికి తిప్పలు తప్పవు. కాబట్టి ఇప్పటికైనా ఉమ్మడి రాజదాని లో ఉండే బదులు పిచ్చిదో , ఎచ్సిదో ఎవరి రాజదానిలో వారు ఉండటమే మంచిది . ఇద్దరు కలసి మీ జుట్లను గవర్నర్ రూపంలో ఉన్న కేంద్రానికి అందించటం వివేకమైన పని కాదు .

   రాజ్యాంగాన్ని ఉల్లంగిoచటం లో రెండు జాతీయ పార్టీలు పోటి పడ్డాయి అనే చెప్పవచ్చు . వారు చేసిన తప్పేమిటో వారు తెలుసుకోవాలంటే రెండు పార్తిలను , రెండు తెలుగు రాష్ట్రాలలో నుండి వెళ్ళ గొట్టడమే . అందుకు తగిన కార్యాచరణ రూపొందించడమే ప్రస్తుతం రెండు ప్రాంతాలలో ఉన్న మేధావులు చేయాల్సిన పని .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన