పేస్ బుక్ లో పులి ! అసలు పని చెయ్యాల్సి వస్తే ఒంట్లో చలి !?
ఈ రోజు ఈనాడు పత్రికలో ఒక ఆర్టికిల్ వచ్చింది . పేస్ బుక్ లో వీరాది వీరుల్లా చెలరేగి గంటలు గంటలు చాటింగ్ చేసే కుర్ర కారు , కూరగాయల మార్కెట్ కు వెళ్లి వెళ్లి బేరం ఆడడానికి తెగ కంగారు పడి పోతున్నారట . ఇటువంటి పరిస్తితిని అదిగమించాలంటే, తల్లి తండ్రులు అప్పుడప్పుడు పిల్లలను వెంట పెట్టుకుని మార్కెట్ కు తీసుకు వెళ్లి బేరమాడే విదానం నేర్పడమే బెస్ట్ అని మానసిక నిపుణులు సెలవిస్తున్నారట !.
కూరగాయలు బెరమాడడానికే తెగ కంగారు పడిపోతున్న కుర్రకారు , తమ పెస్బుక్ మిత్రులతో గంటలు గంటలు ఎలా చాటింగ్ చేయగలుగుతున్నారు అంటే ఒకటే కారణం కావచ్చు. పేస్ బుక్ మిత్రులుకు సమాదానమివ్వడానికి కావలసినoత టైం ఉంటుంది . ఎందుకంటే పేస్ బుక్ లో ఒకే సమయంలో నలుగురైగురితో చాటింగ్ చెయ్యడానికి విలు ఉంటుంది కాబట్టి , ఇవతలి వారు సమాదానమివ్వడానికి లేట్ చేసినా అవతలి వారు అసహనం చూపరు . కాని కూరాగాయల బేర గాడు అoత సమయం ఇవ్వడు కదా ! "ఏంటయ్యా ! కొంటె కొను .లేకుoటే లేదు . నా బేరం చెడగొట్టకు " అంటాడు . దానితో కంగారు . చివరకు బేరం ఆడలేక, వాళ్ళు చెప్పిన రేటుకు , వాళ్ళు ఇచ్చినవి పట్టుకు వచ్చి ఇంట్లో వాళ్ళ ముఖాన వేస్తారు . "ఇదేమిట్రా ఇలాంటి కూరగాయలు, ఇంత రేటు పెట్టి తెచ్చావు" అని తల్లి అంటే ఆమె మీదకు ఇంతెత్తున లేస్తాడు . ఎందుకంటే తన చేతకాని తనం మిద తనకు ఏర్పడిన కోపం ప్రదర్సించడానికి తగిన స్వేచ్చ ఇంట్లో తప్పా , వీదిలొ ఉండదు కదా !
కాని బజారు కెళ్లి కూరగాయలు బేరమాడి తేలేని వారు విచిత్రంగా తమకు కాబోయే జీవిత బాగాస్వామిని మాత్రం ఆన్లైన్ లోనే ఎంచుకోగలరు . వారితో గంటలు గంటలు చాటింగ్ చేస్తూ , విరే తమ కోసం పుట్టిన పూర్వ జన్మ "మగ దిరుడు " అని డిసైడ్ చేసేయ్యగలరు . గంటలు గంటలు ఆన్లైన్ లో కార్చే సోల్లులో నిజమెంతో , అబద్దమెంతో తెలియకుండానే తమ మనసులను ఎక్చేంజ్ చేసుకోగలరు . కాని తీరా పేస్ బుక్ లోనుంచి బయటకు వచ్చి , కొన్నాళ్ళు వారితో ఉంటె గాని అసలు విషయం అవగతం కాదు . ఆ పాటికే జరగాల్సిన నష్టాలు జరిగి "మమ్మీ , డాడీ " అంటూ బోరు మంటారు . ఇవ్వన్నీ జరగడానికి కారణం ఏమిటంటే దియరి వేరు, ప్రాక్తికిల్ వేరు అని నేటి యువత గ్రహించక పోవడమే .
పేస్ బుక్ లో పేస్ మాత్రమె కనపడుద్ది కాని మనసు కనపడదు . దాన్ని గురించి తెలుసుకోవాలంటే నిజ జీవితం లోకి తొంగి చూడవలసిందే . అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు చూడక పోయినా ప్రస్తుత కుటుంబ నేపద్యం చూడవలసిందే . దాని వలన వారు పెరిగిన పరిసరాలు ,వారి మిద కుటుంబ ప్రబావం అన్ని అవగత మవుతాయి . అందుకే కూరగాయలు కొనడానికి పెద్దల తర్పిడు ఎలా అవసరమో , జీవిత బాగస్వామి నెం చుకోవడం లో కూడా వారి సహాయం అవసరం అని పిల్లలు గుర్తిస్తే , పెస్బుక్ పరిచయాలు ప్రళ యాలు కాకుండా ఉంటాయి . అంతే కాదు , నిరంతరం చాటింగ్లు , లై కింగ్లు కోసం సోషల్ మీడియాకి అలవాటు పడిన
వారు నిజమైన జీవిత ఆనందాన్ని కోల్పోక తప్పదు అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు . "అతి సర్వత్రా వర్జ్యయెత్ " అనే పెద్దల మాట పేస్ బుక్ లేక సోషల్ మీడియా వినియోగానికి వర్తిస్తుందని పిల్లలు , వారి అభివృద్దిని కాంక్షించే పెద్దలు గ్రహిస్తే మంచిది . .
Comments
Post a Comment