ముగ్గురూ అమ్మాయిలనే ఎందుకు చంపాడు ? ఆ పై తను ఎందుకు మాయం అయ్యాడు ?
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వింటున్నా నిజంగా వేలాది సంవత్సరాల మానవ ప్రస్తానం ఎటువైపు వెళుతుంది ? మానవత్వం వైపా ? దానవత్వం వైపా అనిపిస్తుంది . నిన్న నిజామాబాద్ నగర శివారులలొ జరిగిన ఈ ఘోరం చూస్తుంటే మనుషుల్లో దానవత్వం ఎంతగా ప్రభలి పోయిందో అర్ధమవుతుంది . అమాయకమైన , ముగ్ద మోహనంగా ఉండే ఆ చిన్నారులను , కర్కశంగా పెట్రోల్ పోసి కాల్చి చంపింది ఒక మనిషి అంటే నమ్మ బుద్ది కావటం లేదు . నిందితుడు ఆ పిల్లల్ని ఎప్పుడూ ఆడించే వాళ్ళ బాబాయ్ అంటే అసలు నమ్మబుద్ది కావటం లేదు . కాని జరిగిన ఘోరం వెనుక ఉన్న కారణాలు పరిసిలిస్తుoటే మీడియాలో వస్తున్న కధనాలు కూడా అనుమానం రేకెత్తిoచేవిగా ఉన్నాయి . అవేమిటో చూదాం .
నిజామాబాద్ జిల్లా , రెంజల్ మండలం , భూపల్లి లోని రఘుపతి రెడ్డి గారికి 3 గురు కుమారులు. వారితో పాటు తన వదిన కుమారుడును తనే పెంచి పెద్ద చేసాడు . అతని పేరు నరేందర్ రెడ్డి . నరేందర్ రెడ్డి కి ప్రస్తుతం 35 యేండ్లు . అంత వయసు వచ్చినా అతనికి పెండ్లి కాలేదట . అతనికి ఆర్దిక పరమైనా , ఇతరత్రా సమస్యలేమీ లేకున్నా పెండ్లి కాక పోవటం , దాని కోసం తనకు పెండ్లి చెయ్యమని రఘుపతి రెడ్డి గారి ముగ్గురు కుమారులను అడుగుతూ గొడవ పెట్టుకోవడం కొంచం ఆశ్చర్యం అనిపించే అంశాలు . రఘుపతి రెడ్డి గారి 3 గురు కుమారులు పెండ్లిళ్ళు చేసుకుని పిల్లలు కలిగి ఉన్నారు . అందులో మూడవ కుమారునికి ఒక కొడుకు , కూతురు కాగా తక్కిన ఇరువురకు ఆడపిల్లలే . రెడ్డి గారి మనవరాళ్ళు కుందనపు బొమ్మలే .
నరేందర్ రెడ్డికి పిల్లలు అంటే చాలా ఇష్టమట . ఎప్పుడూ చాక్లెట్లు అవి కొనిస్తూ ఉంటాడట . మరి అటువంటివాడు కేవలం తనకు పెండ్లి చేయటం లేదని , బాబాయి కొడుకులు మిద కసి పెంచున్నాడట . వారి మిద కసి తీర్చుకోవడం కోసం ముక్కు పచ్చలారని ఆ ఆడ పిల్లల్ని మాత్రమె బందువులు ఇంట దిగబెడతాను అని చెప్పి , తన మూడవ అన్న దగ్గర కారు తీసుకుని , అతని కుమారుడిని తిసుకెళ్ళకుండా , కేవలం 3 ఆడపిల్లలనే తీసుకు వెళ్లి , నిజామాబాద్ దగ్గర తన రియల్ ఎస్టేట్ వెంచర్ లో ని సైట్లో సజీవ దహనం చేసాడని మీడియా కధనాలు . పకడ్బందిగా నరేందర్ రెడ్డే అ ఘోరానికి ఒడిగట్టినట్లు అడుగు అడుగు కి అనుమానం వచ్చేలా ఉన్నాయి దొరుకుతున్న సాక్ష్యాలు .అ ఆదారాలు వాస్తవాలా , కావా అనేవి పోలీసులు తేల్చాలి . పిల్ల హత్యలు అతడే చేసాడని అందరు అంటున్నారు . కాని అతని ఆచూకి లేదు .పిల్లల్ని సజీవ దహనం చేసాక , ఒక యేరు దగ్గరకు వెళ్లి ,అక్కడ కారు , వాచీ , చెప్పులు వదిలేసి నీళ్ళలో దూకి ఆత్మ హత్య చేసుకోవడమో , లేక పోలీసులను పక్క దారి పట్టించి ఎటైనా పారిపోయాడేమో అని అనుమానం కలిగేలా ఆదారాలు ఉన్నాయట .
అయితే ఇక్కడ అబ్యంతర కర విషయం ఏమిటంటే , నిందితుడి ఆచూకి దొరకకుండా , కేవలం పెండ్లి చేయడం లేదనే మోటివ్ తో పిల్లల్ని హత్య చేసాడని మీడియా లోకం డిసైడ్ చేసెయ్యడం . పోలిసుల వారికి ఏమైనా అనుమానాలు ఉండొచ్చు కాని , ప్రింట్ మీడియాకి , ఎలక్త్రానిక్ మీడియాకి ఏ మాత్రం అనుమానం లేదు . అందుకే నరేందర్ రెడ్డి మీదే మొత్తం ఫోకస్ చేసి, వేరే కారణాలు ఇంకేవి లేవన్నట్లు చెసెసారు. ఇక నరేందర్ రెడ్డి దొరికె దాక నిజా నిజాలు తెలిసే అవకాశం లేదు . ఒక వేళ ఆతను దొరకక పొతే మీడియా వారికి సంబందికులు చెప్పిందే నిజం అని సమాజం నమ్మాలి . నాకు తెలిసి ఇటువంటి దురాగతాలు ఆర్దిక పరమైన లబ్ది కోసమో , లేక వేరే బలమైన కారణం ఉంటుంది తప్పా , పెండ్లి చేయటం లేదని గొడవ చేసే 35 యేండ్ల మూర్కుడు ,ఈర్ష్యా , అసూయలతో ఇలాంటి దారుణానికి ఒదిగట్టడమే కాకుండా , తను ఆత్మ హత్య చేసుకోవడమో , తన అస్తులుని వదిలి పారిపోవడమో చేసాడు అంటే నమ్మడం కష్టం .ఈ కేసును పోలీసులు కంటే ఉన్నత దర్యాప్తు సంస్తలకు అప్పచెపితే త్వరగా నిజా నిజాలు వెల్లడి అయ్యే అవకాసం ఉంది . ఆ పాపల తల్లి తండ్రుల దుఃఖం ఎవరూ పంచుకోలేనిది . దోషులను పట్టుకుని కఠినo గా శిక్షించడమే పాపలకు నివాళి .
మరిన్ని వివరాల కోసం క్రింది విడియోని చూడండి .
Comments
Post a Comment