శ్రీజ విషయంలో "అజయ్ దేవగన్" అనుమానమే నిజమయింది !

                                                            

శ్రీజ ! ఒక ప్రముఖ తెలుగు సిని హిరో కుమార్తె ! సినిమా హిరో గారు అనేక సినిమాలలో హిరోయిన్లను వారి తల్లితండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రేమించి లేపుకు పోయిన సన్నివేశాలు చూసి పిచ్చెత్తి పోయి అయనకు  అభిమానులు గా మారిన యువత ఉండవచ్చు . కన్నవారి ముందే ప్రేమించిన ప్రియురాలును ముద్దేట్టుకుంటూ , అమ్మాయి తండ్రిని వేదవగా చూస్తూ ఆ హిరో చెప్పిన డైలాగులు ఆ యా సినిమా నిర్మాతలకు కోట్లాది రూపాయల లాబాల పంట పండిoచాయి . కాని సినిమా వేరు , నిజ జీవితం వేరు అని ఆ మెగా స్టార్ గారికి అయన కూతురే ఒక గోప్ప జీవన సత్యం బోదించింది . వందల సినిమాల్లో చెప్పిన వీర ప్రేమ డైలాగులు , నిజ జీవితంలో నీరు  కారి పోయాయి . సినిమా నటులలో సైతం ప్రేమించి పెండ్లి చేసుకున్న వారు ఉన్నారు . అందులోనూ సపలమైన వారు , విపలమైన వారు ఉన్నారు . పరిపక్వత చెందిన మనసుతో , సమాజం పట్ల ఉన్న నిబద్దతో అలొచిoచే వారు సంసారం అంటే సర్దుకు పోవడమే అని గ్రహించి సపలమవుతారు . సర్దుకు పోయే గుణం లేని వారు ఎక్కడున్నా కష్టమే !

  శ్రీజ విషయానికి వస్తే అ అమ్మాయికి 15 సంవత్సరాలు వచ్చే  సరికి ప్రేమలో పడ్డది . చట్టం ఒప్పుకోలేదు కాబట్టి పద్దెనిమిదేళ్ళు ఎప్పుడూ నిండుతాయా అని ఎదురు చూసింది . మైనార్టి తీరిన మరునాడే తను 4 ఏండ్ల నుండి ప్రేమిస్తున్న భరద్వాజ్ ను పెండ్లి చేసుకుంది . తన తండ్రి వందల సినిమాలు లో నటించి తెచ్చుకున్న గుర్తింపును శ్రిజ తన పెండ్లి ఎపిసోడ్ తోనే జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్సుకుందంటే దానికి కారణం తన పెండ్లి విషయంలో ఆ అమ్మాయి చూపిన తెగింపు . హంగామా . పెండ్లి సందర్బంగా ఎన్నో విర డైలాగులు కొట్టింది . భరద్వాజ్ కోసమే తాను , తన కోసమే భరద్వాజ పుట్టాడు అంది .చూడగానే అతనే తనవాడు అని ఆమెకు 15 ఏండ్లకే అనిపించిందట . అ అమ్మాయికి వీరి విర ప్రేమకు డిల్లీలో ఒక లేడి న్యాయవాది సపోర్ట్ పలికి సుప్రీం కోర్టు ద్వారా రక్షణ కలిగేలా సహాయం చేసింది . లేచిపోయి వచ్చినోళ్ళు అందరికి పెండ్లిలు  చేసి పుణ్యం కట్టుకునే హైదరాబాద్ లోని ఆర్య సమాజం వారు వీరిద్దరికీ పెండ్లి చేసారు . పాపం ఆ సమయంలో ఆ మహనటుణ్ణి చూసిన వారికి జాలి కలిగిన చట్టం ప్రకారం ఎవరేమి చేయలేరు కనుక మౌనంగానే ఉండీ పోయారు .

  అలా నాలుగేళ్ళు వీర ప్రేమ ప్రేమించిన ఆ అమ్మాయి పట్టుమని నాలుగేండ్లు కూడా కాపురం చేయలేక పోయింది . ఆమెకు ఒక పిల్ల పుట్టగానే సంసారం అంటే చప్పగా అనిపించింది కాబోలు మొగుడు పెళ్ళాలు మద్య గొడవలు మొదలై చివరకు పోలిస్ కేసులు దాక వెళ్ళింది . వీర ప్రేమికురాలిని కట్టుకున్న నేరానికి బరద్వాజ్ జైలు పాలయ్యాడు . అతని తమ్ముణ్ణి పోలీసులు మెత్తగా తన్నారని స్వయంగా అతని తమ్ముడే మీడియా ముందు చెప్పి బావురు మన్నాడు . భరద్వాజ్ తల్లితండ్రులని పోలీసులు బండ బూతులు తిట్టారట . చివరకు సినిమా కష్టాలు కంటే ఘోరమైన కష్టాలు పడిన భరద్వాజ్ కుటుంబానికి మొన్ననే విముక్తి లభించింది . వారి కుటుంబానికి శ్రిజకు కోర్టు వారు విముక్తిని ప్రసాదిస్తూ విడాకులు మంజూరు చేసారు !

   ప్రేమ అంటే అంటే ఏ బాద్యతలు లేక బలాదూర్ దూర్ గా తిరుగుతూ ఒకరి మిద ఒకరు కార్చుకునె చొంగ లాంటిది కాదని , నిజమైన ప్రేమ పెండ్లి అయ్యాకే మొదలవుతుందని హింది సిని హిరో అజయ్ దేవగన్ శ్రిజకు చెప్పిన మాటల్లో అర్దమయింది . శ్రిజ సెన్సేషనల్ పెండ్లి జాతియా మీడియాను ఆకర్శించింది . వారి జంటను ప్రముఖ హింది నట దంపతులు అజయ్ దేవగన్ , కాజల్ తో కలిపి ఇంటర్వ్యూ నిర్వహించిన సందర్బంలో ఎందుకో అజయ్ దేవగన్ గారికి ఈ  అమ్మాయి ప్రేమ మిద అంత నమ్మక్కమ్ కలినట్లు  లేదు . అందుకే తమ దంపతుల మద్య ప్రేమకు , శ్రిజ దంపతుల మద్య ప్రేమకు సారూప్యం లేదని నిజమైన ప్రేమ పెండ్లి తర్వాతే మొదలవుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది .శ్రిజ పెండ్లి విషయంలో ఆమె కరెక్టా ? ఆమె తల్లితండ్రులు కరెక్టా అనేది కాలం నిర్ణయిస్తుంది అని అజయ్ దేవగన్ గారు స్పష్టంగా అ నాడే చెప్పడం జరిగింది .  అయన గారి అనుమానం నిజం చేస్తూ  శ్రిజ ప్రేమ పెండ్లి పెటాకులు అయింది . పెండ్లికి ముందు ప్రెమించుకున్నo  త కాలం కూడా కలిసి ఉండలేక పోయారు సో కాల్డ్ ఆ వీర ప్రేమికులు . ఇటువంటి ఉదంతాలు చూసాక నేను ఇంతకూ ముందు టపాలో
      "యవ్వన్నం లో మనిషి బుద్ది చపలంగా ఉంటుంది . ఆ దశ లో అతను లెక ఆమే కుటుంభం కంటె తమ లోని కామ ప్రాకోపాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. దానికి ప్రేమ అనో మరేది అనో ఒక అందమైన పేరు తగిలించుకుని ముందు వెనుక కానక కలిసిపొఈ జీవీతాలు నాశనం చేసుకుంటారు. ఇండియన్ కాంట్రాక్ట్ ఏక్ట్ ప్రకారం కూడ ఏదైనా ఉన్మాద స్తితిలో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. కాని కేవలం కామ ఉన్మాదంలో చేసుకుంటున్న ఇటువంటి పెళ్ళిలను కేవలం వయసు ప్రాతిపదికగా అనుమతించడం  ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రతి వివాహానికి తల్లితంద్రుల అనుమతి తప్పనిసరి చేయాలి. ఒకవేళ వివాహం విషయమ్లో తల్లి తండ్రుల నిర్ణయం కుటుంబ అబివ్రుద్దికి గాక స్వార్ద పూరితమైందని పిల్లలు బావిస్తే దానిని కుటుంబ న్యాయ స్తానాల రుజువు చేసి అట్టి కోర్టుల అనుమతితోనే వివాహం చేసుకునేతట్లు చట్ట సవరణ తెస్తే మంచిదని మా అభిప్రాయం’ " అని చెప్పినది నూటికి నూరు పాళ్ళు కరెక్టే అనిపిస్తుంది . ఆ టపా కోసం ఈ క్రింది లింక్ మిద క్లిక్ చెయ్యండి

(తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలనhttp://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html).


 అజయ్ దేవగన్ దంపతులతో శ్రిజ బరద్వాజ్ పాల్గొన్న కార్యక్రమం కోసం క్రింది విడియో లింక్ ను చూడండి .


                   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!