కంచర పాలెం అమ్మాయి స్కూల్ కు వెళ్ళక పొతే, లెక్కల మాస్టర్ ఒళ్ళు పగలాల్సిందేనా ?

                                                         
                                                                                     

ఈ  మద్య తెలుగు ప్రజలు బాగా చైతన్య వంతులై పోయారు . ఎంత చైతన్యo అంటే ఆడపిల్లలు ఒక మాట తమ పంతుళ్ళు గురించి చెపితే చాలు ఇక వారె అన్ని అధికారాలను తమ చేతులలోకి తీసుకుని నిందితులను విచారణ చేయకుండానే శిక్షించే స్తాయికి ఎదిగి పోయారు . చివరకు పోలీసులు కూడా అలా ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తిసుకోవడాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు తప్పా వారినేమి అనలేక పోతున్నారు . చివరకు ఈ అరాచక దండన విదానం ఎక్క డికి దారి తీస్తుందో అర్ధం కావడం లెదు.

   నక్సైలైట్లు నిర్వహించే "ప్రజా కోర్టులు " కానీ, హర్యానాలో జరిగే "ఖాప్ పంచాయతీలు " కాని ,వారి పద్దతిలో విచారణ అంటూ జరిపాకే శిక్షలు విదించడం జరుగుతుంది . ఇవి చట్ట విరుద్దమయిన న్యాయ విదానాలు అయినప్పటికీ నిo దితులు కు తమ పై ఆరోపించబడిన ఆరోపణలకు సమాదానం చెప్పుకునే వీలు ఉంటుంది . ఇది పంచాయతి విచారణ యొక్క మౌలిక లక్షణం . కాని ఏదో తమ అమ్మాయి చెప్పిoదనే ఒకే ఒక సాకుతో పంతుళ్ళను ఇష్టం వచినట్లు , పదిమంది కలిసి పబ్లిక్ గా గొడ్డును బాదినట్లు , బాదుకుంటూ తీసుకువెళ్ళి పొలిసులుకు తీసుకు వెళ్లి అప్ప చెప్పిన తర్వాత ఇక పోలీసులు , కోర్టులు ఎందుకు? అసలు ఆ  దెబ్బలు  తిన్న   వారు బ్రతకడం ఎందుకు? ఎక్క డో జరిగే ఖాప్ పంచాయతీలు గురించి గగ్గోలు పెట్టేవారు మన రాష్ట్రం లో జరుగుతున్నా ఈ  పైశాచిక గణాలు చేస్తున్న పనులు మిద నోరు మెదపరే !?

   మొన్ని మద్య విశాఖ పట్టణం కి దగ్గరలో ఒక ప్రభుత్వ స్కూల్ ఉపాద్యాయుడు 5 వ తరగతి చదివే అమ్మాయిని లైంగికంగా వెదిస్తూ , రెడ్ హండేడ్ గా దొరికిపోయి మహిళల చేతిలో తన్నులు తిన్నాడు అంటే దానిలో కొంత అర్ధముంది . అతను రెడ్ హందెద్ గా పట్టుబడటం వలన వారికి కోపం ఆపుకోలేక అలా ప్రవర్తించి ఉంటారు అని అనుకోవచ్చు. కాని దానిని సాకుగా తిసుకుని ప్రతి నిందితుడిని  పబ్లిక్ గా ఒళ్ళు పగల కొడుతుంటే , చూస్తూ ఊరుకోవడం ప్రభుత్వ వైపల్యానికి తార్కాణం . ఇదే విశాఖ పట్టణం లోని కంచర పాలెం లో ఒక ప్రైవేట్ స్కూల్లొని లెఖ్ఖల మాస్టర్ అయిన భాస్కర రావు , అదే స్కూల్లొ చదువుతున్న 9  వ తరగతి అమ్మాయి గూర్చి మిగతా విద్యార్దులకు ఎదో చెప్పాడట. దానికి ఆ అమ్మాయి రెండు రోజులు స్కూల్ కి వెళ్ళలేదట . విషయం తెలుసుకున్న అమ్మాయి బందువులు అపర రుద్రావతారులై ఆ పంతులుని పబ్లిక్ గా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటూ తీసుకు వెళ్లారో క్రింది వీడియోలో చూడవచ్చు. తనకు ఏ పాపం తెలియదని చెపుతున్న పంతులు మాటలు నమ్మాలా ? అమ్మాయి మాటలు నమ్మాలా? ఒక వేళ రేపు కోర్టు విచారణలో పంతులు నిర్దోషి అని తేలినా లాబమేముంది? దానిని ఏ మీడియావారు ప్రజలకు చూపిస్తారు .? ఆ దెబ్బలు కొట్టిన వారిని ఎవరు శిక్షిస్తారు?

  చేత కాని పాలకులు ఏలుతున్న రాష్ట్రం కాబట్టి ఇకడ ఇంత అరాచకం రాజ్యమేలుతుంది? నిందితులు ను విచారణ లేకుండా ఏక పక్షంగా శిక్షిస్తుంటే ఏమనలేని పోలిసు వారికి నక్శలైట్లు నిర్వహించే ప్రజా కోర్టులును తప్పు పట్టె నైతిక అర్హత ఉందా? అలాగే ఒక వ్యక్తిని పబ్లిక్ గా ఏదో ఒక సాకుతో కుక్క ను కొట్టినట్లు కొడుతుంటే,సినిమా  చూసినట్లు చూసే ప్రజలకు   "ఖాప్ పంచాయతీలు " గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఎవరికి వారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది .

   ఈ విదానం ఇలాగే కొనసాగితే తప్పకుండా అది సమాజంలో అరాచకానికి దారి తీస్తుంది. ఒక అమ్మాయి , ఒక మీడియా చానల్, పదిమందిని మేనేజ్ చేస్తే చాలు తమ ప్రత్యర్దులను ఎంతటి వారి నయినా  పబ్లిక్ గా  శిక్షించి తమ కసి తీర్చుకోవచ్చు. అరాచకానికి గురి అయిన వాడు బలహీనుడైతే ఆత్మహత్య చేసుకుంటాడు, బలవంతుడైతే, పగ పెంచుకుని  తిరిగి ఏదో విదంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఏతావాతా జరిగేదేమీటంటే రాష్ట్రం లో అరాచకీయం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. కాబట్టి ఇటవంటి అరాచకాలను మొక్క దశలోనే త్రుంచి వేయాలి . అందుకు సమర్దులైన వారు పాలకులుగా రావాలి.     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!