చీపురు కట్ట చేతిలో ఉంది కదా అని అనుమతి లేకుండా ఇల్లు ఊడుద్దామనుకుంటే , చివరకు ఉద్యోగమే ఊడి పోయేటట్టుంది !

                                                        

నేను ఇంతకు ముందు టపాలో "  పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?"
    అనే దానిలో " ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P   పార్టీ  ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధినాయకుడు కి పాలనా పగ్గాలు చేపట్టడానికి ఎవరి సహాయం తీసుకోవాలి అన్న విషయం లో సరి అయిన నిర్ణయం తీసుకోలెదు అని పిస్తుంది. తమ పార్టీ ప్రాదాన అజెండ అవినీతి నిర్మూలన అయినప్పుడు , పోయి పోయి, దేశం లోని అవినీతికి మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ వారి సహాయం తీసుకోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే!తమకు కాంగ్రెస్ మరియు B.J.P పార్టీలు రెండు శత్రువులే అని ప్రకటించిన పెద్ద మనిషికి, అవినీతి విషయం లో ఎవరు ప్రదాన శత్రువు, ఎవరు ద్వితీయ శత్రువు అని ఆలోచించే ఇంగిత జ్నానం లేక పొయింది . కమ్మ్యునిస్ట్ సిద్దాంతం ప్రకారం బడా బూర్జువాలను ఎదుర్కోవాలంటే , అంత కంటే తక్కువ బూర్జువాలతో కలసి పని చేయాలి. ఈ సూత్రమే కేజ్రీ వాల్ గారి డిల్లీ పాలన విషయం లో అనుసరిస్తే బాగుండేది. అవినీతి విషయం లో  కాంగ్రెస్ కంటే మెరుగయిన B.J.P వారి సహాయంతో పాలనా పగ్గాలు చేపడితే సత్పలితాలు పొంది ఉండే వారు." అని స్పష్టంగా కెజ్రివాల్ గారి పాలనా విదానం మిద నా అభిప్రాయం చెప్పాను . నా అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు కరెక్టే అని ఈ రోజు డిల్లి అసెంబ్లీలో జరిగిన ఉదంతం తెలియ చేస్తుంది .
        ఈ రోజు కెజ్రివాల్ వాల్ గారు తన ఎన్నికల వాగ్దానమైన "జనలొక్ పాల్ " బిల్ ను డిల్లి అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని చూసారు . ఇది గనుక పాసయితే అవినీతి ప్రత్యర్దుల పిలక అయన చేతికి చిక్కుతుందని అయన ఆశ . అయితే నిబందనల ప్రకారం బిల్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలంటే లెప్తినెమ్త్ గవర్నర్ అనుమతి కావాలి . దానిని త్రోసిరాజని ,కాంగ్రెస్ B.J.P  సబ్యులువద్దని చెపుతున్నా వినకుండా బలవంతంగా బిల్ ను ప్రవేశ పెట్టాలని చూసి బంగపాటుకు గురయ్యారు కెజ్రివాల్ . అనుకూలంగా 27 ఓట్లు , వ్యతిరేకంగా 42 ఓట్లు వస్తే స్పీకర్ దానిని సబలొ ప్రవేశ పెట్టలేక పొయారు. తగిన బలం లేదని తెలిసి మూర్కంగా ప్రవేశ పెట్టిన దానికి పలితంగా ఇప్పుడు ముక్య మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టి కార్యకర్తలని పిలిచి మరి అదుగుతున్నారట కెజ్రివాల్ . జ్ఞానం ఉన్నా ఇంగిత జ్ఞానం లేని మేధావులు చేసే పనులు ఇలాగె ఉంటాయి .

   చేతిలో చీపురు ఉంది కదా అని ఇల్లు ఊడ్చేస్తాను అని బయలు దేరితే తక్కిన వారు ఒప్పుకోవద్దు . ఆ ఊడ్పు వలన తము పోగేసిన చెత్త ఎంత ఉందొ లోకానికి తెలుసుద్ది కాబట్టి సహజంగానే వారు అనుమతించరు . పూర్తిగా ఇంటి మిద యాజమాన్య హకులు రాకుండా ఏదో ఊడ్చేదాం  అనుకుంటే , ఉన్న ఉద్యోగమే ఊడిపోయే పరిస్తితి శ్రీ శ్రీ శ్రీ కేజ్రి వాల్ గారికి . ఒక వేల రానున్న ఎన్నికల్లో అదిక సీట్లు పొందటానికి ఒక పదకం ప్రకారం రాజీనామాకు ముందు ఇలాంటి ఎత్తు వేసి ఉంటె , అది ఎంతవరకు సత్పలితాలు ఇస్తుందో చూడాలి . ఏది ఏమైనా కేంద్రం సపోర్ట్ లేకుండా డిల్లీ రాష్ట్రం అవినీతి ని దునుమాడుదామంటే కష్టమే మరి !
 నేను ఇంతకూ ముందు ఇదే విషయమై ప్రచురించిన టపా ని క్రింది లింక్ లో చూడండిhttp://ssmanavu.blogspot.in/2014/01/blog-post_17.html

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )