కిరణ్ కుమార్ రెడ్డి &కో ని దారుణంగా అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్ !

                                                    

అయన గారి పేరు దిగ్విజయ్ సింగ్ ! మద్య బారతంలో ఉన్న మద్య ప్రదేశ్ కి అయన ఒకప్పుడు ముఖ్యమంత్రి . ఇప్పుడు అ  రాష్ట్రంలో అయన పరిస్తితి ఏమిటంటే మొన్ని మద్య ఆ రాష్ట్ర కాంగ్రెస్ వారు సమావేశాలు నిర్వహించుకుంటుంటే  ఈయన గారు కూడా ఆ సమావేశంలో పాల్గొoదామని ఎగేసుకు వెళ్ళాడట . కాని ఈయన గారి రాకను గమనించిన అక్కడి కాంగ్రెసియులు ఈయనగారు లోపలకు అడుగు పెట్టకుండా ముఖం మీదే తలుపులు మూసేసారట  !దానితో అయన గారు బిక్క ముఖం వేసుకుని డిల్లి దారి పట్టాడట !. ఆది  మద్య ప్రదేశ్ లో అయన పరిస్తితి!

  ఒక ఊరికి కరణం ఇంకో ఊరికి వెట్టి అట ! అందుకే మధ్యప్రదేశ్ లో ఎందుకు పనికి రాని ఆయన్ని ఆంద్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించారు . అయన గారి చెతులుమిదగనె తెలంగాణా వచ్చిందన్న సంబరంతో మొన్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చాలా మంది అయన ఇంటికి వెళ్లి , పూలు పండ్లు ఇవ్వడమే కాక పన్నీరు చల్లి మరి క్రుతజ్ఞతలు  తెలియ చేసారట! దానితో అయన జన్మంటూ ఉంటె "తెలంగాణా గడ్డ " మీదే పుడతాను అని గట్టిగా తిర్మానిమ్చుకున్నాడట !

  మరి అటువంటి తెలంగాణాకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఆయనను అనుసరించే సిమాంద్ర నాయకులను ఎలాగైనా అవమానించి తన కసి తీర్చుకోవాలి అనుకున్నాడట ! అందుకే నిన్న పనిమాలి  ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కిరణ్ కుమార్ రెడ్డి &కో మిద బోల్దంతా సానుబూతి ఒలకబోసి , తెలుగువారిలో వారి పట్ల ఒక తేలిక బావం ఏర్పడేలా మాట్లాడాడు . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కాకుండా , అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసినందుకు కేంద్రం మిద నిరసనగా , ముఖ్య మంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడమే కాక కొత్త పార్టీ ఒకటి పెట్టె తలంపులో ఉన్నారు . రాజీనామా చేసి వారం రోజులు కూడా కాలేదు . అటువంటి పరిస్తితిలో కిరణ్ రెడ్డి గారు కాని , అయన ను అనుసరిస్తున్న బహిష్కృత M.P లు కాని తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తాం అంటే సానుభూతి తో పరిసిలిస్తాం అన్నాడట ! ఇంతకంటే ఘోర అవమానం అ నాయకులకు ఇo కేమైనా ఉందా ?

    దిగ్విజయ్ గారి దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి &కో పనికి రాని  అసమర్దులు . ప్రజలు కాంగ్రెస్ పార్టికి పట్టం కట్టారు తప్పా కిరణ్ &కో ముఖాలు చూసి కాదు అని అయన నమ్మక్కం . ప్రతిపక్షాలే తమకు వత్తాసు పలుకుతుంటే అప్త్రాల్ కిరణ్ కుమార్ రెడ్డి &కో ఎంత? తెలంగాణా ఇచ్చారు కాబట్టి , K.C.R పార్టిని తమలో విలీనం చేసుకుని ఆ స్టేట్ ను హస్తగతం చేసుకుంటారు . ఇక సిమాంద్ర లో కూడా కాపు వర్గానికి , మైనార్తిలకు రిజర్వేషన్లు కు ఆర్డినెన్స్ లు తెస్తే సిమాంద్ర లో కూడా సింహ బాగం సీట్లు  తమకే . మరి ఇటువంటి వ్యూహ , ప్రతి వ్యూహాలతో  రాజకీయాలను తిమ్మిని బమ్మి చేయగల తమను, కొత్త పార్టీతో ఎదురుకునే శక్తి కిరణ్ కుమార్ రెడ్డి &కో కి ఎక్కడిది ? ఒక పక్క సిమాంద్ర నాయకులు అంతా  తమ చుట్టూ పదవుల కోసం తిరుగుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి &కో కి ఎంత అహంకారం ఉంటె తమతో తల పడతారు? . తెలుగువారి అభిమాన నటుడు చిరంజీవి గారే తమ గుమ్మాల దగ్గర పడిగాపులు పది తమ పిలుపు కోసం ఎదురు చూస్తుంటే అప్త్రాల్ కిరణ్ కుమార్ రెడ్డి &కో ఎంత? ఇది దిగ్విజయ్ సింగ్ గారి ఆలోచన . అందుకే ఆ అవమానపు మాటలు!.

  ఇందులో దిగ్విజయ్ సింగ్ గారి ఆలోచన తప్పు అనటానికి విలు లేని విదంగా సిమాంద్ర కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన ఉంది . కాంగ్రెస్ ని భూ స్తాపితమ్ చేస్తాం అని హుంకరించిన కoఠాలు ఇప్పుడు మూగబోయి అమ్మ కాళ్ళ మిద పడే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంది . ఇటువంటి నాయకులను నమ్మా సిమాంద్ర ప్రజలు నిమ్మకు నిరెత్తినత్లు ఉంది ? ఆంధ్రులు ఆరంభ శూరులు అని మరొక మారు అనిపించుకొవదానికె తప్పా  సిమాంద్ర ఉద్యమం దేనికి  ఉపయోగపడదేమో  !?

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.