ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !
అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , లేదు . జరిగేది ఇంగ్లిష్ కల్చర్ ఈవెంట్ కాబట్టి , ఇంగ్లీసు డ్రెస్ మాదిరి కురచ దుస్తులులోనే వెళ్లారు . 1600 మంది పోలీసులు ఉంటె మనకింకేమి భయం లే అనుకున్నట్లు ఉంది . అందరితో కలసిపోయి ఎగరడం మొదలుపెట్టినట్లు ఉంది . ఇక వాళ్ళని చూసి పోకిరి గాళ్ళకి ఎలా ఉంటుంది?
అసలే కోతి ! ఆ పై కల్లు తాగింది , అన్న చందాన సదరు ఆకతాయిల దృష్టిలో పడ్డారు కురచదుస్తుల్లో ఉన్న ఒంటరి యువతులు . ఇంకేముంది ! వెకిలి చేష్టలు చేస్తూ వారి వెంటపడి లైంగిక వేధింపులకు గురి చేస్తే , పాపం దిక్కు తోచని స్థితిలో, తమ మాన రక్షణకు పరుగులు తీసారట. ఇలా పరుగులు తీయడానికి కూడా సహకరించని తమ హై హిల్డ్ చెప్పులను చేతులో పట్టుకుని మరి పరుగులు తీశారు అట . చివరకు మహిళా పోలీసులు కనపడితే వారిని పట్టుకుని బావురుమని ఏడ్చారు అట . అంటే కానీ ఎవరి మీదా పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేక పోయారు అట. అలా ఇవ్వడానికి , అలా తమ వెంటపడిన వారి గురించి వీరికి తెలిస్తే కదా? చివరకు గస్తీకి నియమించిన పోలీసులు ఎందుకు పనికొచ్చారయ్యా అంటే , వారిని పట్టుకుని బావురు మని ఏడవడానికి అన్నమాట .
ఈ సంఘటన మిదా స్పందించిన కర్ణాటక హోమ్ మినిష్టర్ "ఈ ఏడ్పులు ప్రతియేడు ఉండేవే . కొంతమంది ఆడపిల్లలకు కురచదుస్తులు వేసుకుని ఈవెంట్ లలో పాల్గొనే అలవాటు ఉంటె , వారిని వేధించి ఏడిపించడం మరి కొంతమంది మగపిల్లలకు అలవాటు . కురచ దుస్తులు వేసుకోకుండా కన్నడ దుస్తులు వేసుకోమనే అధికారం మాకు లేదు ,అలాగే కంప్లైంట్ లు లేకుండా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో కూడా మాకు తెలియదు" అన్నారు . దానికి తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గారు , స్త్రీల దుస్తులు గురించి కామెంట్ చేసినందుకు కర్ణాటక హోమ్ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని , ఎవరూ కంప్లైంట్ ఇవ్వకున్నా పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్ లు ఆదారంగా పొలిసు కేసులు పెట్టి విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.
అది మన దేశం లో ఉన్న దౌర్బాగ్యం. జాగ్రత్తగా ఉండండి అమ్మా అని ఆడపిల్లలకు కు చెప్పే పరిస్థితి కానీ, ఖబర్దార్ వెధవల్లారా అని కంప్లైంట్ లేకపోయినా కంత్రీగాళ్లని హెచ్చరించే పరిస్థితి కానీ లేవు . ఈ సంఘటనలో గమనించవలసిన విషయం ఏమిటంటే , లైంగిక వేధింపులకు గురి అయినా ఆడపిల్లలు అందరిలో కొన్ని విషయాలు కామన్ గా ఉన్నాయి . అవి
(1). వారంతా ఒంటరిగా హ్యాపీ న్యూ ఇయర్ లో పాల్గొన్నవారు . వారి వెంట వారి సంబందీకులు ఎవరూ లేరు .
(2) వారు ప్రాశ్చ్యాత పద్ధతిలో కురచ దుస్తులు వేసుకుని ఈవెంట్ లో పాల్గొన్నారు .
(3).పారెన్ పద్దతిలో దుస్తులు వేసుకున్నా , ఆకతాయిలు వెంటపడినప్పుడు , ఇండియా పద్దతిలో పరిగెత్తి కానిస్టేబుళ్లను పట్టుకుని బావురుమన్నారు తప్పా , కేసులు మాత్రం పెట్టలేక పోయారు.
కాబట్టి కర్ణాటక మంత్రి గారి మాటలు కొంతవరకు బాధ్యతా రాహిత్యమైనప్పటికీ , అందులోను చాలావరకు వాస్తవం ఉంది అని మహిళలు గుర్తించి ఆడపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పగలిగితే ఇలా చెప్పులు చేత్తో పట్టుకుని, భయం తో బజార్లో పరిగెత్తాల్సిన దుస్థితి వారికుండదు కదా !.
ఇక జరిగింది ఒకటైతే , దానికి తమ వక్రీకరణలు జోడించి , మీడియా చానళ్లు ఎలా ప్రసారం చేస్తున్నాయో చక్కగా తెలియ చేస్తున్న క్రింది వీడియోను చూడండి .
ఇక జరిగింది ఒకటైతే , దానికి తమ వక్రీకరణలు జోడించి , మీడియా చానళ్లు ఎలా ప్రసారం చేస్తున్నాయో చక్కగా తెలియ చేస్తున్న క్రింది వీడియోను చూడండి .
Narasimha Rao Garu
ReplyDeleteRecently a New Game introduced known as 'Taharrush' Arabic Gang-Rape phenomenon which sees women start surround by groups of men in crowds and sexually assault.
The rules of the game are:
Find a girl the shorter the dress the better the chances for the girl to be caught by the gang of men.
Just catch the hold on the girl.
The whole gang catches her and start Molesting.
Rape, Half Rape, Molestation depends upon the mood.
Last year (2016 new year celebrations) the above 'Taharrush' happened in Germany and now repeated in India (2017 new year celebrations).
1) Germany shocked by Cologne New Year gang assaults on women. The mayor of Cologne has summoned police for crisis talks after about 80 women reported sexual assaults and muggings by men on New Year's Eve.
The scale of the attacks on women at the city's central railway station has shocked Germany. About 1,000 drunk and aggressive young men were involved. = http://www.bbc.com/news/world-europe-35231046
2) http://www.dailymail.co.uk/news/article-3395390/The-Arabic-gang-rape-Taharrush-phenomenon-sees-women-surrounded-groups-men-crowds-sexually-assaulted-spread-Europe.html
3) http://internethindu.org/2017/01/03/taharrush-a-game-of-rape-is-played-in-bangaluru-is-it-a-pre-planned-one/
వెంకట్రామ్ గారు మీరు ఇచ్చిన రెఫెరెన్స్ లింక్ లు లోని సమాచారం పరిశీలించినప్పుడు ,'Taharrush' Arabic Gang-Rape తరహా లైంగిక దాడులకు పాల్పడి తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మహిళలను ఇబ్బంది పెట్టడం ద్వారా వారిలో ఒక రకమైన భయోత్పాతం కలిగించి తద్వారా తమలోని మతపరమైన మగ అహంకారం ని తృప్తి పరచుకునే అవకాశం ని కాదనలేము. కడివెడు పాలలో ఒక్క విషం బొట్టు కలిసినా పాలన్నీ విషయం అయినట్లు , స్త్రీలను దేవతలు లాగా పూజించాలని సాంప్రదాయ భారతీయ సమాజం లోస్త్రీలను కనీసం తోటి మనుషులు లాగా కూడా కనీసం గుర్తించదానికి ఇష్టపడని మత ఛాందసులు వలన దేశం లోని మగ జాతి యావత్తు నిందలు పాలు కావాల్సి వస్తుంది . ఈ దేశంలో ఒకప్పుడు , అటువంటి మత ఛాందసులు దాడులు నుండి తమ పెండ్లి కానీ ఆడపిల్లలను కాపాడుకోవడానికి " బాల్య వివాహాలు " చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అనేది చరిత్ర ద్వారా మనకు తెలిసిన సత్యం . ఇప్పుడు జరుగుతున్న ఈ తరహా దుర్మార్గాల నుండి ఆడపిల్లను కాపాడుకోవాలి అంటే , బాధితులు కేసులు పెట్టినా పెట్టకపోయినా , పోలీసులు కేసులు నమోదు చేసి తగిన విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చడం తో పాటు రాక్షస మూకల ను శిక్షింప చేయాలి. అలాగే ఆడపిల్లల భద్రతా కోసం కొన్ని నిబంధనలు కూడా అవసరం. అందులో "రాత్రివేళ తోడు లేకుండా బయటకు వెళ్ళరాదు " అనే దాని తో పాటు వస్త్రధారణ విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవడమనేది కూడా ఉండాలి .
DeleteNarasimha Rao Garu
DeleteThank you for your reply.
As some Political parties based on religious sentiments and appeasment of minorities if they take strict action of the above molestitation case (No need to tell that above ruling state strongly favours minorities) it is OK. Other wise I affraid it may slowly spread to other parts of our country.
For example: Last year Malda incident in WB (Around one lakh people attack a village and beat all include police). They did not take any action so the same incidents spread in WB and even some parts of UP.
Any how our CM (Telangana) although not want to lose minority votes but co operated Central Govt. reagrding Terririst problem (some arrests done).
yes
ReplyDeleteThank you for your response Vamshi Krishna Garu .
DeleteSad state of affairs 😠
ReplyDeleteThank you for your response Vinnakota Narasimha Rao Garu
DeleteDear sir it's not only women who are alone are attacked even if with escorts had been attacked and by the way if short clothes is the reason to molest the women as you say which i don't agree .But what you do if this group of people start attacking women who are fully dressed, blame the women as they are different from males in their anatomy.Sir this is a problem of our thinking and the it will be there till the mind set of men doesn't change
ReplyDeleteనారాయణ గారు , స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులకు కొంతమంది కొంత మంది మగవాళ్ళల్లో అనాదిగా వస్తున్న"మగబుద్ధి " అనే బలహీనత కారణమని , దానిని సంస్కరించవలసిన అవసరం ఉందని, కానీ ఎన్నో ఏండ్లుగా వారిలో జీర్ణించుకు పోయిన సదరు మగబుద్ధి ని తెలుగు సినిమాలలో మాదిరి డైలాగులు తోనో , నిర్భయ లాంటి కఠిన శిక్షల తోనో అప్పటి కప్పుడు మార్చడం కుదరదని, దానికి నిరంతర సంస్కరణ అటు కుటుంబ పరంగా , ఇటు సమాజ పరంగా ఇవ్వాల్సి ఉంటుందని , అలా సమాజం లోని మగబుద్ధి గల మగాళ్లు అందరు మారే వరకు , స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవలసిందేనని , నేను ఇదే బ్లాగులో అనేక పోస్టులలో సవివరణలతో ఉదాహరించాను . "మగబుద్ధి " అనే లేబుల్ క్రింద సదరు పోస్టులు ప్రచురించడం జరిగింది.
Deleteస్త్రీల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉండడానికి వారి వస్త్ర ధారణే "ఏకైక కారణం " కానప్పటికీ , ప్రధాన కారణాల్లో అది కూడా ఒకటి అని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అందులో ఒకటి ఈ "బెంగళూరు సంఘటన ". ఈ సంఘటనలో ముష్కరులు టార్గెట్ చేసింది ఒంటరి ఆడపిల్లలను మరియు కురచ దుస్తులు వేసుకున్న వారిని. ఈ రోజు టీవీ 9 వారు మరొక సంఘటనను ప్రసారం చేస్తున్నారు. ఇదే బెంగళూరులో అదే రాత్రి ఒంటరిగా ఒక అమ్మాయి ఆటో దిగి తన ఇంటికి వెళుతుంటే , మధ్యలో ఇద్దరు కామాంధులు ఆమెను అపి , ఆమె పట్ల అసబ్యన్గా ప్రవతించడమే కాక టూ వీలర్ మీద కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి , వల్లకాక , ఆ యువతిని రోడ్డు మీదకు తోసి వేసి వెళ్లిపోయారు. ఇది cc కెమెరాల్లో రికార్డు అవటం వలన , ఆ అమ్మాయి కేసు పెట్టకపోయినా , పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు . కాబట్టి "ఒంటి మీద బంగారం ఉన్న స్త్రీలు కు జాగ్రత్తలు తీసుకోమని చెప్పినంత మాత్రానా , జాగ్రత పడని స్త్రీలను దోచుకోమని దొంగలకు సపోర్ట్ ఇచ్చినట్లు కాదు . దొంగలను శిక్షించాల్సిందే , స్త్రీలకు జాగ్రత్తలు చెప్పాల్సిందే . అదే సమాజ ధర్మం .
మనువు గారు,
ReplyDeleteవేల మంది జన సమూహం లో ముక్కుమొహం తెలియనివాడు ఎదైనా చేస్తే, వాడి వివరాలు ఎమీ తెలియకుండా పోలిసులకు వాడి గురించి ఎలా ఫిర్యాదు చేస్తారు? తప్పు చేసినవాడు పోలిసులకు ఫిర్యాదు చేస్తూంటే అక్కడే ఉంటారా? వాళ్లకు చిక్కాలను కొంటారా?
ఇవి అనవసరంగా తెచ్చుకొనే కష్టాలు. దారిన పోయే శనేశ్వరాన్ని నెత్తికి చుట్టుకోవటం. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. అలా జగ్రత్త తీసుకోలేని వాళ్లు అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని నిందిస్తే వాళ్లకి సమాజం మీద అవగాహన లేదని తెలుస్తుంది.
మీ కామెంట్ కి సమాధానం త్వరలో ఇస్తాను శ్రీ రామ్ గారు .
Deleteఒక స్థల దురాక్రమణ కేసు విషయం లో ముప్పైఏళ్లుగా కోర్ట్ లో పోరాటం చేసి, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళి గెలిచాము. కోర్ట్ ఆర్డర్ అమలు జరగటానికి సుమారు రెండేళ్లు పైగా పట్టింది. ఈకాలం లో కోర్ట్ చుట్టూరు చొప్పులరిగేలా తిరిగాను. ఇంతలో కేసు వేసిన మా నాన్న గారు కూడా చనిపోయారు. మధ్య మధ్య లో ఉత్తరువు అమలుకొరకు పోలిస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చింది.అలాగే తహశిల్దార్ ఆఫీసు, మునిసిపల్ కార్పోరేషన్ కుడా తిరిగాను ఈ తిరగటంలో ఆ విభాగాలు ఎలా పనిచేస్తాయో రావిశాస్రి కథలకన్నా ఎక్కువ అవగాహన అయ్యింది.
Deleteఅనవసరంగా ఇటువంటి వాటిలో పాల్గొని, ఎదైనా జరిగిన తరువాత, ప్రభుత్వం రక్షణ కల్పించలేదు అని ఆరోపణలు చేసేవారిని చూసి జాలిపడటం తప్ప చేయగలిగిందేమి లేదు. ఇందులో పాల్గొన్న రౌడి మూకలకి మంచి రాజకీయ పలుకుబడిగా ఉంట్టుంది. కేసు, కోర్ట్, సాక్షాలు అంట్టు నాలుగు సార్లు వాటి చుట్టు తిరిగితే ఆ విభాగాలు పనిచేసే తీరు చూసి విరక్తి పుట్టి, ఆవైపుకి పోవటం మానుకొంటాము.
we need to take preventive measures
ReplyDeletehi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
Thank you For your Response.
Deleteనేను మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను, కానీ.. : బాధిత యువతి
ReplyDeleteమహిళలు ధైర్యంగా ఉండటాన్ని చూసిన మగాళ్ళు తమ శక్తిని వాళ్ళకు చూపించాలనుకుంటారు. ఇక్కడ సమానత్వం లేదు. ప్రభుత్వం, మన కుటుంబాలు, ప్రజలు మార్పును విశ్వసించాలి. దీనికి అడ్డుకట్ట వేయాలి. పురుషులు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా బోధనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని నొక్కి వక్కాణించాలి. సమానత్వాన్ని స్థాపించాలంటే రాడికల్ ఫెమినిజంతో ప్రారంభించాలని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాడికల్ ఫెమినిజం మాత్రమే ఏదైనా ప్రభావం చూపగలుగుతుంది.
http://www.andhrajyothy.com/artical?SID=353969
------------
టివి ల లో బెంగుళూరు కమ్మనహళ్ళి లో జరిగిన ఒక సంఘటన క్లిప్ ను, యం.జి.రోడ్ లో జరిగిన సంఘటనకు లింక్ ఉన్నట్లు చూపుతున్నారు. కమ్మనహళ్ళి నాకు బాగాతెలుసు. యం.జి. రోడ్ కి కమ్మనహళ్ళికి పది కిలోమిటర్ల దూరముంట్టుంది. ఈ రెండు వేరు వేరు సంఘటనలు.
పోలిస్ వాళ్ల మాటలను బట్టి చూస్తే ఈ సంఘట ఇదొక బోగస్ అనిపిస్తున్నాది. ఇప్పటివరకు నేను చదివిన వార్తలు బట్టి చూస్తే , రాడికల్ ఫెమినిజం ప్రమోట్ చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో!
'It Didn't Happen,' Bengaluru Police Chief Says On Mass Molestation
http://www.ndtv.com/bangalore-news/bengaluru-mass-molestation-did-not-happen-says-police-chief-1645563?
The police chief also expressed his "strong objection" to the word "mass molestation", saying "In fact, it would be a great disservice".
Today, the police chief said, "On December 31, police officers were there... about 20 media OB vans were there on MG road... No one reported anything on the January 1... and nowadays, if something wrong happens, it goes viral in a minute". He said even on January 1, when he was addressing the media, "no one raised the issue".
Asked if he was saying the mass molestation may not have happened, he said, "I am saying it did not happen". It was not possible to say in a city of 10 million people such an event could not have happened, he later added. "If something has happened, I said 3 days back, 'please come to us, we are ready to take action'," he said.
The media footage of the event "changes the whole context," Mr Sood further said. "Only 30 seconds of footage is being shown, not what happened immediately before," he added
-----------------------
Bangalore mass molestation – how media created stories
https://themalefactor.com/2017/01/03/bangalore-mass-molestation-how-media-created-stories/
Many fabricated news are carefully planned by some media people with support of some so radical feminist group to create hatred against men
మీరు ఇచ్చిన లింక్ ల లోని వీడియోలు చూసినప్పుడు , బాధ్యత కలిగిన ABN లాంటి మీడియా ఛానల్ సహితం కేవలం , తమ రేటింగ్ ల కోసం ఒక దృశ్యాన్ని ఎలా వక్రీకరించి ప్రసారం చేశారో కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. విదేశీ సంస్కృతిలో భాగమైన ఈ తరహా ఆడా మగ కలసి తాగుడు , అర్ధరాత్రి ఒళ్ళు పై కానక నడి బాజార్లో పూనకం వచ్చినట్లు వెర్రి కేకలు వేస్తూ ఎగురుడూ, ఆ ఒళ్ళు కానని స్థితిలో ఎవడైనా ఏదైనా చేసినా , ఫలాని వాడు నన్ను ఇలా చేసాడు అని with in టైం లో కేసులు పెట్టి నిరూపించ గలిగే స్థితిలో ఉన్నారా ? సో కాల్డ్ బాధితులు ? కర్ణాటక హోం మంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇలాంటి మాస్ మోలెస్టిజ్ సంఘటనలు క్రిస్మస్ , మరియు న్యూ ఇయర్ వేడుకలో నే ఎక్కువని . ఆ రోజుల్లోనే ఎందుకు జరుగుతాయో ఆలోచించారా ఎవరైనా?
Deleteనిజంగా జరిగినదేమిటో బాధితులు with in టైం లో చెపితే కానీ దానికి విలువ ఉండదు. మీడియా చానళ్ళు తమ రేటింగ్ ల కోసం విషయాన్ని వక్రీకరిస్తారు అని మీరు ఇచ్చిన లింక్ లో వీడియో ఏ ఉదాహరణ. సదరు వీడియోని పోస్ట్ లో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసేవారెవరికైనా అర్ధం అయ్యేది ఏమిటంటే , ఆడో , మగో స్పష్టంగా తెలియటం లేదు కానీ, తాగి ఆ చేతనా వస్తలో ఉన్నట్లు ఉన్న ఆ వ్యక్తిని ఇద్దరు మగాళ్లు పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి ఒక చోట పడుకో పెట్టారు. వారి తో పాటు మరో ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. ఒకడేమో ఆ తాగినట్లు ఉన్న అడ / మగ వ్యక్తి ముఖం మీద ముఖం పెట్టి ఎదో అంటున్నట్లు ఉంది. వారంతా సదరు వ్యక్తిని తరలించడానికి చూస్తున్నారు. వారంతా ప్రెండ్స్ లాగే కనిపిస్తున్నారు.
ఇక దీనికి ABN యాంకర్ భాష్యం వింటుంటే అసహ్యం వేస్తుంది . కేవలం తమ ఛానల్ రేటింగ్ కోసం ఇంట వక్రీకరణా చేస్తారా ? చి! చి! సెలబ్రేషన్ లో చీడపురుగులు చేసిన దాని కంటే ఈ ఛానల్ వాళ్ళు చేసే పనే అత్యంత భయంకరమైనది.
నేను మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను... వ్యాసం మొత్తం జాగ్రత్తగా చదివితే అవమానం జరిగిన అనుభవం కన్నా, ఆ వ్యాసం రాసిన వాళ్ళు వాళ్లకు తెలిసిన ఫెమినిజం పైత్యాన్ని రంగరించి పోసారనిపిస్తుంది. ముగింపుగా రాడికల్ ఫెమినిజం మాత్రమే ఏదైనా ప్రభావం చూపగలుగుతుంది అని ముక్తాయింపు ఇచ్చరు. పరోక్షంగా వాళ్లెందుకు రాశారో చెప్పకనే చెప్పారు.
Deleteమీడియాలో ఎర్రపార్టి సానుభూతిపరులు తిష్టవేసి ప్రతిదానికి మన సంస్కృతిని,సమాజాన్ని పూర్తి నెగటివ్ గా చూపుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వార్తలు రాసి జనంపై వదులుతున్నారు. ఒకప్పుడు ఈ ముఠా మేధావులు మన తెలుగు సాహిత్యంలో పశ్చిమదేశాలు మహిళలకు భూతల స్వర్గమైనట్లు సాహిత్యం సృష్టించి ప్రచారం చేశారు. తక్కువ జనం, సంపద, టెక్నాలజి,సుశిక్షితులైన పోలీసులు ఉన్న ఆ దేశాల్లో కూడా పరిస్థితి ఎమి మెరుగ్గాఎమీ లేదు.
https://www.youtube.com/watch?v=GaOLgy3YKtA
Deletehttp://www.opindia.com/2016/12/the-top-media-lies-of-the-year-2016/
పితృస్వామ్యాన్ని బద్దలు కొడదాం
ReplyDeletehttp://www.andhrajyothy.com/artical?SID=356169