ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే ,విడాకులు తీసుకోని వాడిని పెండ్లాడితే ఇలా ఏడ్వాల్సిందే !

                                                                         

పేరు గౌతమి !కర్నూల్ కలక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సాయిబాబా అనే అతన్ని  పెండ్లి చేసుకుని 4 సంవత్సరాలు గడచింది . వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు . ఇక సాయి బాబా విషయానికి వస్తే అతనికి అంతకు మునుపే వివాహం అయింది . అయితే మొదటి బార్యతో పొసగక పోవటం తో ఆమె తో విడాకులు తీసుకోవాలను కున్నాడు . అందుకు ఆమె కూడా అంగికరించి ఉంటుంది . అయితే చట్ట ప్రకారం విడాకులు తీసుకోక మునుపే,తనకు విడాకులు వచ్చాయని చెప్పి ,  గౌతమి ని పెండ్లి చేసుకున్నాడు . అందుకు పెద్దలు అందరు అంగీకరించారు . అలా వారికి వివాహం జరిగింది .

  అయితే చట్ట బద్దంగా విడాకులు ఇవ్వడానికి మొదటి బార్య 10 లక్షలు డిమాండ్ చెసే సరికి , సాయిబాబా గుడ్లు తేలేశాడు .తిరిగి మొదటి బార్యతొనే సంసార బందం కొన సాగించడానికి ఆమెను ఒప్పించి ,గౌతమిని వదిలి వేసి ఆమె తోనే ఉండటం ప్రారంభించే సరికి ,ఇది తెలిసిన గౌతమి గగ్గోలు పెట్టింది .చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అంటే అతనికి మొదటి బార్య తో విడాకులు కాలేదని తెలిసి హతాశురాలైంది . అత్త మామలు కూడా మొదటి బార్యకే సపోర్ట్ చెసే సరికి ,ఏమి చెయ్యాలో తెలియక బోరు బోరు న విలపిస్తూ కలక్టరేట్ ముందు ధర్నాకు దిగింది . ఇప్పుడు ఆమె పరిస్తితి ఏమిటి?

   కాబట్టి రెండవ పెండ్లి వాళ్ళని చేసుకునే ముందు ,సరి అయిన ఎంక్వైరీ చేసుకున్నాకే పెండ్లికి సిద్ద పడాలి తప్పా ,ఏవరో హామీ ఇచ్చారని పెండ్లి చేసుకుంటే ఏడుపే మిగిలేది . విడాకులు అనేవి ఖచ్చితంగా కోర్టు ద్వారానే పొందాలి .పెద్ద మనుషుల పంచాయతి ద్వారా తీసుకున్న విడాకులకు చట్టబద్దత ఉండదు కాబట్టి , బాదితులకు చట్ట రక్షణ లభించదు . ఈ కేసులో సాయి బాబా మిద చీటింగ్ కేసు పెట్టడానికి తప్పా ,బార్యగా గౌతమి తన హక్కును అమలు చేసుకొని పరిస్తితి . సాయిబాబా ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మొదటి బార్య 10 లక్షలు ఇచ్చే దాక అతనికి విడాకులు ఇవ్వక పోవచ్చు . మరి అప్పటి దాక ఇద్దరి పిల్లల తల్లి అయినా  గౌతమి  ఇల్లాలు కాని పరిస్తితి . పాపం! అదే పాకిస్తాన్ లో అయితే పై చిత్రం లో మాదిరి 24 గంటలు లోపు రెండు పెండ్లిళ్ళు చేసుకున్నా ,బార్యల హక్కుకు బంగం  కలగదు మరి!

  ఇండియన్ వైప్   గౌతమి  బోరు బోరున ఎలా ఏడుస్తుందో క్రింది వీడియోలో చూడండి !


                       

                                               (22/1/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన