, రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?

                                                                     


రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?    అంటె                                                           
 లేదని చదువు రాని పామరుడైనా డంకా బజాయించి చెపుతాడు. ఇందులో మొదటిది లౌకిక ఆనందాన్నిచ్చే వినొదాత్మక కేంద్రమయితే, రెండవది అలౌకిక ఆనందాన్నిచ్చే ఆద్యాత్మిక క్షేత్రం  .  ఈ రెండు కేంద్రాల మనుగడకు డబ్బు అవసరం అనేది ఎవరూ కాదనరు.కాని ఆ ఆర్థిక వనరుల స్వబావం మాత్రం వేరు.

  ఆద్యాత్మిక క్షేత్రాల నిర్వహణకు పూర్వ కాలంలో రాజులు, దనవంతులైన వ్యవస్తాపక కుటుంబాల వారు భూరి విరాళాలతో పాటు, మాన్యాలు ఇచ్చి పోషించే వారు. భక్తులుకు, బాటసారులకు దేవాలయాలు ఉచిత అన్న దానం, ఇతర సేవలు ఒసగేవి. కాని ఇప్పటి రోజులలో అసలు ప్రభుత్వం నుండి ఒక్క నయా పైసా కూడా తీసుకునే వీలు దేవస్తానాలకు లేదు, కారణం మనది లౌకిక రాజ్యం కాబట్టి, మత సంస్తలకు రాజ్య సొమ్మును ఖర్చుపెట్టడాని మన రాజ్యాంగం ఒప్పుకోదు. కేవలం భక్తుల దాత్రుత్వం మీదే దేవాలయాల మనుగడ నడుస్తుంది.

  ఇక పోతే పెత్తనం విషయానికి వస్తే గవర్నమెంటే పెద్ద కొడుకు. పేరుకే ట్రస్ట్ బోర్డులు. పెత్తనం మొత్తం ఎండొమెంట్ అధికారులదే. ప్రబుత్వాలను నడిపే రాజకీయ పార్టీల కను సన్నులలో మెలిగే ఎండోమెంట్ అధికారుల ద్వారా వీరు దేవాలయ వ్యవస్తను నియంత్రిస్తుంటారు. ట్రస్ట్  బోర్డులను కూడా రాజకీయ నిరుద్యోగులతో నింపి అటు అధికార్లు, ఇటు రాజకీయ పార్టీలు దేవాలయాలను సర్వనాశనం చేసారు . అసలు మత సేవలకు అర్థమే మార్చి పారేశారు.

  దేవున్ని చూడాలంటే డబ్బు ఇవ్వాలి. కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బు ఇవ్వాలి.పూజ చేయించుకోవాలంటె డబ్బు ఇవ్వాలి,ఇలా ప్రతి దానికి టికెట్లు పెట్టి ఆలయాల్ని సినిమా హాళ్ళు గా మార్చిన ఘనత ఎండోమెంట్ డిపార్ట్మెంటుది. రాజకీయ నాయకులు ఎక్కడ ఉంటే అక్కడికి దేవున్నే తీసుకువెళ్ళి డర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు ఇవ్వగలిగిన ఘనులు వీరు.వీరు అమ్రతసర్ స్వర్ణ దేవాలయం ముందు భక్తుల  బూట్లు తుడిచే మంత్రుల ను చూసి సిగ్గు తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  మత సంస్తలను వ్యాపారసంస్తలు చేసారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రామోజి ఫిల్మ్ సిటీ వినోదా పరమైన వ్యాపారసంస్త. దానికి ప్రబుత్వం భూములు ఇచ్చింది. అనేక రాయితీలు ఇచ్చింది. కాని దాని మీద పెత్తనం మాత్రం చేయలేదు. పూర్తీగా ప్రైవేట్ నిర్వహణా సంస్త. అదే మత సంస్తల విషయంలో మాత్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా మొత్తం పెత్తనం ప్రభుత్వానిదే. ఎందుకంటే చేత  కాని హిందువులం ఉన్నాం కాబట్టి. మేము మత వాదులం కాదు, లౌకిక వాదులం అని గప్పాలు కొడుతూ, మత వాదులను ఈసడించే రాజకీయ పార్టీలకు అవి నడిపే ప్రబుత్వాలకు  మత సంస్తల మీద పెత్తనం కలిగి ఉండడం ఎంతవరకు సమoజసం?

  మన రాష్ట్రంలో రాజకీయ సంస్తలకు మాత్రమే స్వాతంత్ర్యం వచ్చింది. కాని అప్పట్టివరకు హిందూ మత సంస్తలకు ఉన్న స్వాతంత్ర్యం పోయింది. ఆ స్వాతంత్రం తిరిగి తెచ్చుకోవడానికి మరో పోరాటం చెయ్యాల్సిన బాద్యత ప్రతి హిందువు మీదా ఉంది. లేకుంటే దేవాలయాలు పర్యాటక  కేంద్రాలుగాను, దేవుళ్ళు అందులోని బొమ్మలుగాను మిగిలిపోతారు.       
                                                       (20/1/2016 Post Republished).

Comments

 1. >>>>రామోజి ఫిల్మ్ సిటీ వినోదా పరమైన వ్యాపారసంస్త. డానికి ప్రబుత్వం భూములు ఇచ్చింది. అనేక రయితీలు ఇచ్చింది.<<<<

  మీరు వ్రాసింది తప్పు.రామోజీ రావు ప్రభుత్వం నుండి ఒక్క పైసా తీసుకోలేదని కే సి ఆర్ గారు స్వయంగా చెప్పారు.రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీ రావు స్వంత సంస్థ!

  హిందువులలో ఐక్యతే లేనపుడు స్వాతంత్ర్యం ఎలా వస్తుంది ?

  ReplyDelete
  Replies
  1. రామోజి ఫిల్మ్ సిటి అనేది హైద్రాబాద్ లోని టూరిస్ట్ కేంద్రం. దీని నిర్మాణానికి, కొనసాగింపుకు అప్పటి ఆంద్రప్రదెశ్ టూరిజం బోర్డు నుండి, కేంద్ర టురిజమ్ పదకాలు ద్వారా అనేక రాయితీలు పొందింది. వాటిలో భూమి కొనుగొలు నుండి కరెంట్ వినియోగం వరకు రాయితిలు పొందింది. కాని అదే దేవాలయాలు విషయం వచ్చే సరికి కనీసం కరెంట్ వినియోగం లో కూడా ఒక్క పైసా రాయితీ ఉండదు.

   మీరు హిందువులలో ఐక్యత లేదన్నది నిష్ఠుర సత్యం.

   Delete
 2. See this Article also #http://rightactions.in/more-than-80-of-hindu-temple-funds-used-to-fund-non-hindus-a-day-night-robbery/

  ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )