N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?

                                                                      
 
                                                         ఆంద్రుల అభిమాన  నటుడు,నాయకుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు.ఆయన పక్కా హిందూ వాది. హిందూ జీవన విదానమయిన "ఆశ్రమ  జీవన విదానం" పట్ల అనురక్తి ఉంది. అందుకే తాను ఎన్నో సార్లు  "ఆశ్రమ  జీవన విదానం" లోని మూడవ ఆశ్రమమయిన వానప్రస్తం లో ఉన్నానని ఇంకా "సన్యాసం" స్తాయికి రాలేదని చెపుతూ, అసెంబ్లీ లో చొక్క ఎత్తి, తన పంచె కట్టు ని చూపించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన పక్కాగా  "ఆశ్రమ  జీవన విదానం" అనుసరించ దలచిన వ్యక్తి అని . కాని విది ఆడిన నాటకంలో ఆయన ఆ విదానం నుండి దూరం కాక తప్పలేదు.

  హిందువు "గ్రుహస్తాశ్రమ" దర్మాచరణాణికి మాత్రమే "వివాహం" చేసుకోవాలి. మూడు, నాలుగు ఆశ్రమాలయిన వానప్రస్తం ,సన్యాసం లలో "వివాహం" కూడదు. బార్య ఉన్నా, లేకపోయినా అమే తలపుల సహవాసం తోనే ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వహించాలి.కాని అనూహ్యంగా ద్వితీయ  వివాహ మాడి , హిందూ జివన విదానానికి దూరమయ్యారు   . దీనికి కారణం ఎవరు? ఆయనకు తన స్వదర్మ నిర్వహణలో, ఆయన పిల్లలు సహకరించలేదా? లేక అయన ధర్మ నిష్టను కావాలనే ఎవరయిన భంగం చేసారా?

   ఇప్పుడు ఆయన విగ్రహాన్ని పెట్టడానికి "నేనంటే నేనని" గొడవ పడుతున్నారట! ఆయన మన మత జీవనానికి కూడ ప్రతీక. కాబట్టి ఆయన విగ్రహాని తెలుగువారు అందరి తరుపున ప్రభుత్వమే శ్రద్ద తీసుకుని పార్లమెంట్ లో విగ్రహం పెట్టించాలి అని మనవి చేస్తున్నాం. ఆయన దర్మ నిష్టలో సహకరించని ’కుటుంబ సబ్యులకు" ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని మా అభిప్రాయం.

                             కోట్లు సంపాదించినవారికే, మన సమాజమ్ లో, ముసలితనం లో బద్రత లేక పోతే ఇక సామాన్యుల గతి ఏమిటి?మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్య గలరు. http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_6635.html

                                                   (13/12/2012 Post Republished). 

Comments

 1. @ దీనికి కారణం ఎవరు? ఆయనకు తన స్వదర్మ నిర్వహణలో, ఆయన పిల్లలు సహకరించలేదా? లేక అయన ధర్మ నిష్టను కావాలనే ఎవరయిన భంగం చేసారా?
  దాన్నే కర్మ అంటారు...మంచిగా మసులుకో...పాప పుణ్యాలు వెంటాడతయ్ అనేది...ఇందువల్లే...తెలిసో తెలియకో చేసే తప్పులకు శిక్ష అనుభవించాలిసిందే...అంటారు...

  ReplyDelete
  Replies
  1. కరెక్టుగా చెప్పారు. దన్యవాదాలు kvsv గారు

   Delete
 2. చొక్కా ఎత్తి పంచకట్టు చూపిస్తే అది "ఆశ్రమ జీవన విధానమా" మనవు గార్లు? చొక్కా కాబట్టి సరిపోయింది, అదే పంచకట్టు.. సభ్యులకు విశ్వరూప సందర్శనం అయ్యేది. :)

  /అమే తలపుల సహవాసం తోనే ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వహించాలి/
  ఆధ్యాత్మిక తలపులతో, మోక్షసాదన దృష్టితో కాదన్న మాట! ఇస్మీ!!! ఇదేనా మీ ఆశ్రమంలో చేస్తోంది?!

  నిగ్రహంలేని సన్నాసుల విగ్రహాలు అంత అవసరమా? రోడ్ల మీద ఎన్నో పడివున్నాయి కదా?! ఇలా బజారున పడకుండా, ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళింట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు కదా.

  ReplyDelete
  Replies
  1. నాయనా,’వంకర శంకరా’,తమరేది సవ్యదిశలో ఆలోచించరనుకుంటా!,చొక్క ఎత్తి చూపింది, తను గోచి పెట్టిన,పంచ కట్టు విదానం గూర్చి మాత్రమే. "ఆశ్రమ జీవన విదానం " అంటే ఆశ్రమాలు నిర్మించుకుని భజనలు చెయ్యడమ్ కాదని తమరు గ్రహిస్తే మంచిది. ఆశ్రమం అంటే"దశ" అని అర్థం. ప్రతి హిందువు నాలుగు దశల జీవన విదానం అనుసరించి తీరాలి. మూదు దశలు అంటే 81 సంవత్సరాలవరకు "మోక్ష"చింతన అవసరం లేదు. కేవలం "సన్యాస" ఆశ్రమం లోనే దాని గురించి ఆలోచించాలి. "సంసారి కాని వాడు సన్యాసి కారాదు". ఇది హిందూ తత్వానికే వ్యతిరేకం. దీని గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది.
   N.T.R. గారి జివీతం చాల మంది తల్లి తంద్రులకు గుణపాటం కావాలి. బార్య అండలేని బర్త, బర్త తోడు లేని బార్యలు,తమకు నిజమయిన తోడు అవసరం ముసలితనం లోననే వాస్తవాన్ని ఆయన జివితం నేర్పే పాటం. కోట్లు పంచుకున్న పిల్లలు "జీవిత సహ వాసులు" కాజాలరు.’వివాహం, వల్ల మన జీవితాలో ప్రవేశించిన ’బాగస్వామి’ కడకంటా లేకపోతే దురద్రుష్టమే. వ్రుద్దాప్యంలో వివాహం అవసరంలేదు. ప్రత్యామ్నాయ ’వాన ప్రస్తాన" వ్యవస్తే దీనికి సరి అయిన పరిష్కారం.

   మీకు N.T.R గారంటె అంత కోపం ఎందుకండి? ఆయన"కలం పోటుకి ఊడిన కరణం గారిలో మీరు ఒకరా ఏమీటి?’నిగ్రహం లేక పెండ్లి చేసుకోలెదు అయన, పరిస్తితుల ప్రబావమే ఆయన దురద్రుష్టాన్ని నిర్ణయించింది.’సౌత్ ఇండియా" అంటే కేవలం "మద్రాసీలే" అనే ఉత్తరాది వారికి "తెలుగువాళ్ళు" మేమున్నాం అని చాటిన వాడు . ఆయన "విగ్రహం" పార్లమెంట్లులో వద్దనే వాడు తెలుగువాడు కాదని నా అభిప్రాయం.

   Delete
  2. :)) చొక్కా ఎత్తి చూపిన 'ఆశ్రమ విదానం' కొద్దిగా వివరించండి, తెలుసుకుని ఫాలో అవుతాము. పంచె కట్టుకునే విధానంలోనే ఆశ్రమ స్టైలుందని నిజంగా ఇప్పుడే వింటున్నాను.

   / పరిస్తితుల ప్రబావమే ఆయన దురద్రుష్టాన్ని నిర్ణయించింది.’/
   ఏమిటో ఆ పరిస్థితులు! నటుడిగా అభిమానం వుంది కాని, ప్రతి మూర్ఖపు పనీ సమర్థించేంత మూఢాభిమానం వుండకపోవచ్చు.

   పెన్ను పోటుతో కరణాలను పీకేశాడా! అరెరే.. కరణాలు ఈ దేశపు వోటర్లు, పౌరులు కారా?! గొప్ప దార్శనికుడే. అసెంబ్లీలో చొక్కాలెత్తి చూపించలేదేమో కాని, YSR కూడా కట్టాడు, పంచ. పెట్టండి ఆయన విగ్రహం. పైగా ఆయన పెన్నులతో ఎవరినీ పొడిచిన హింసాత్మక దాఖలాలు లేవు.

   Delete
  3. గారి మాటల్లోనే, "సన్యాస" ఆశ్రమంలో ఉన్నవారు. పంచె కట్టినా వెనుక గోచి పోయరు. అంటే లుంగీ లాగ కట్టొచ్చు. కాని ఇంకా వానప్రస్తం లో ఉండటం వలన మామూలుగానే ఉంది అని చూపించడం జరిగింది.వెనుక "రాజర్షి" లాంటి వాడినని తానే స్వయంగా చెప్పారు.అమెరికా లో ఉండే వారికి ఎందుకు లెండి "ఫాలోఇంగ్’ ల జంఝాటం.!
   బార్య చనిపోవటమే ఆయన ఏకైక దురద్రుష్టం.

   కరణం వ్యవస్త రద్దుకి, దేశ పౌరసత్వానికి ఏమిటి లంకె?’పంచె కట్టినందుకు "పార్లమెంట్’ లో విగ్రహం పెట్టమని ఏవరు అడిగారు మిమ్మల్ని?

   Delete
 3. పౌరులందరిపై సమదృష్టి కలిగి వుండి, వాళ్ళ కడుపు కొట్టాల్సివచ్చినపుడు తరాలుగా ఆయావృత్తుల్లో వున్నవాళ్ళకు ప్రత్యామ్న్యాయం చూపాడా? అలా చేసివుంటే (నాకు తెలియదు) అతన్ని ఓ మార్గదర్శకుడిగా భావించవచ్చు. సన్యాస ఆశ్రమమ నియమాలకు వృద్ధవివాహం చేసుకోవడం భ్రష్టుపట్టించిన ఆ మహానటుడికి గోచీ పోయడం/తీయడం పెద్ద అసాద్యమైన పని కాదు. అలాంటి గోచీలు, పాగాలు, కాషాయాలు ఆ తరవాత. వున్నా, పోయినా జ్యాదా ఫరక్ నహీ పఢ్తా. వేమన దేహం మీదే మోహం నశించి, విరాగి అయ్యి, నగ్నంగా వుండి కటారుపల్లె దగ్గర ఓ గుహలో కాలం చేశాడడని ఓ కథ.
  అధికారం లాక్కున్నాడని, స్వంత అల్లుడిని శాపనార్థాలు పెట్టేటైపు సన్యాసి కాదు.
  /"రాజర్షి" లాంటి వాడినని తానే స్వయంగా చెప్పారు/
  నిత్యానంద కూడా తనను బ్రహ్మ్హర్షి అని చెప్పుకున్నాడు, హోమాలు చేశాడు. ఆయన విగ్రహం తమిళ్‌నాడు అసెంబ్లీలో పెట్టాలని వీరాభిమానుల డిమాండ్, అది సంగతి!
  ----
  /బార్య చనిపోవటమే ఆయన ఏకైక దురద్రుష్టం/
  మనువులూ...( పార్ఠా... అనే శృతిలో అనుకోండి :) )
  "చావుపుట్టుకలు సహజమైనవి. అవి నిజమైన సన్యాసుల్లో సుఖదుఃఖాలుగా అనిపించవు, ఆందోళనలను రేకెత్తించవు, కూడదు". ( గీతలో సన్యాసయోగమును ఎప్పుడైనా వినుడు, మీ భ్రమలన్నీ పటాపంచలై అజ్ఞానం దూరమగును)
  ----
  ఇక దొంగసన్నాసుల విషయానికి వస్తే... కాషాయం కట్టి, ఆశ్రమం అని బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి అయిపోరు, గాంధీ అని తోక తగిలించుకున్న ఎదవలంతా MKగాంధీలు అవ్వరు. ఆయన కన్న కొడుకులే అవలేదని స్వయం 'మనువులని' మీకు దరమసూత్రాలు చెప్పేంతటి వాడను కాను.

  మీ ఆశ్రమం ముందు ఆ స్వయంప్రకటిత రాజర్షి విగ్రహం ప్రతిష్టించండి, బాగుంటుంది. :D ముసలయ్యాక మీ ఆశ్రమంలోనే చేరాలనుకుంటున్నా, టిపినీలు, చాయ్, భోజనం ఎన్ని, ఎలా వుంటాయి, వైర్లెస్ నెట్ వుందా? వివరాలు ఓ పోస్ట్‌లో ఇవ్వండి. అసలే 20వ శతాబ్దపు సన్యాసులం. :)) :P

  ReplyDelete
  Replies
  1. గారు చేసిన గొప్ప కార్యాలలో "మండలాల " ఏర్పాటు ఒకటి అని మెజార్టి ప్రజల అభి ప్రాయం. ఇక పోతే బాదితుల హక్కులకు విఘాతం కలిగితే కోర్ట్లు ఉన్నాయి. ఆ విదంగానే "కరణాలలో" అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు కూడ.

   దీరులు మోహం నోందరు. కాబట్టే బార్య తో పాటు తాను పోక, శేష జీవితం "సమాజ సేవ" కే వినియోగించారు.

   "రాముడంతటి వాడే దుఃఖించాడు, రామారావు గారేంత?"

   మా ఆశ్రమం లో ఎవరి విగ్రహాలు పెట్టాలన్నది ముఖ్యం కాదు.సమస్య "పార్లమేంట్" కాబట్టి దానికి పరిమితం అవడం మంచిది. మీ బోటి వారు ఉండేంత గొప్పది కాదు మా ఆశ్రమం. "నిత్యానంద" గారిని కాంటాక్ట్ చెయ్యండి."టిపినిలు’బోజనాలు" కోరుకున్నవి దొరకొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్.

   Delete
  2. /దీరులు మోహం నోందరు. కాబట్టే బార్య తో పాటు తాను పోక, శేష జీవితం "సమాజ సేవ" కే వినియోగించారు./
   అవునా! ఆహా!!
   1985లో మొదటి భార్య పోయారు, ఆతరువాత మోహమునొంది 1993లో 70వఏడు తనకన్నా 20ఏళ్ళు చిన్నదైన ల.పాని మనువాడారు. 72ఏళ్ళ వయసులో... ఏవో మాయదారి మాత్రలేసుకుని ... అని విన్నాను నిజం కాదా? :P సమాజషేవ బాగుంది.

   Delete
  3. /మా ఆశ్రమం లో ఎవరి విగ్రహాలు పెట్టాలన్నది ముఖ్యం కాదు.సమస్య "పార్లమేంట్" /
   ఆశ్రమంలో స్వయంప్రకటిత రాజర్షి విగ్రహం, మీరన్నట్టు 'భార్యలపై ఆలోచనలతో' వృద్ధవివాహాలకు స్పూర్తి నివ్వగలదు. అదే మోక్షసాధకం అని మీరూ సెలవిచ్చారు కూడా. మీ ఆశ్రమానికే అక్కరకు రాని విగ్రహాలు, పార్లమెంటుపై రుద్దడం ధర్మమే?! ఓ ధర్మమూర్తి.

   Delete
  4. నాకు తెలిసిన సమాచారం ప్రకారం రామా రావు గారికి ’జ్యొతీష్యాం" మీద నమ్మక ముందట. ఆ విషయాన్ని తెలిసుకున్న కోందరు ఏదో "వీర బోగ వసంత రాయలు" అనే అవతార పురుషుడు రామా రావు గారికి తిరిగి వివాహాం చేసుకుంటె జన్మిస్తాడని, చెపితే నమ్మి పెళ్లి చేసుకున్నారని వినికిడి. కాని అది అయన దురద్రుష్టానికి కారణమయింది.

   మా ఆశ్రమంకి, బారత పార్లమెంట్ కి ఏమన్నా సంబందంఉందా? మీరు ప్రతిది మొకాలికి, బట్టతలకి ముడి పెట్టడం ,ఇది ఏ తరహా వాదమో అర్థం కావడం లేదు.

   Delete
  5. మీరు అపార్థం కావాలని చేసుకుంటున్నారు. మీ ఆశ్రమానికి, సన్యాసిత్వానికి సంబంధాలు వున్నాయ్యి. సన్యాసిత్వానికి NTRకీ ఉన్నాయి. మీకు NTR అంటే పిచ్చ అభిమానమూ వుంది. ఇంతకన్నా ఏం కావాలి? చెప్పండి? పార్లమెంటులో బాగా నేరచరితులున్నారు, దొంగ సన్నాసులూ కలరు. NTR పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు కారు.
   మీ ఆశ్రమంలో అటువంటి రాజర్షి విగ్రహం వుండతగదు అనుకునేట్టయితే సరేకాని అకారణంగా విగ్రహాన్ని పార్లమెంటుపై రుద్దడం ఏంబాగోలేదు.
   వీరభోగవసంతరాయలేమో కాని, 70ల్లో వయాగ్రాలు స్వర్గానికి అడ్డదార్లు, సోపానాలు అని మాత్రం తెలుస్తోంది. :D

   Delete
  6. నాకు తెలిసి N.T.R. గారు "సన్యాస" ఆశ్రమం స్వీకరించక ముందే మరణించారు. ఆయన విగ్రహం పెట్టమనేది కూడ ఆయన రాజకీయ సేవలు ద్రుష్ట్యా తప్పా, మత సేవలు ద్రుష్ట్యా కాదని గుర్తుంచుకోవాలి.

   Delete
 4. "చావుపుట్టుకలు సహజమైనవి. అవి నిజమైన సన్యాసుల్లో సుఖదుఃఖాలుగా అనిపించవు, ఆందోళనలను రేకెత్తించవు, కూడదు".
  -------------------
  snkr వేదాంత రహశ్యాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారు.

  ReplyDelete
  Replies
  1. రావుగారు,
   ఏదో అలా నాగయ్య గారి సినిమా త్యాగయ్యలో చూశాను. చిన్నప్పుడు వూర్లో సాయంత్రం గుడిలోలోని వచ్చే ఘంటసాల భవద్గీత చెవిన పడేది.

   Delete
 5. మూదు దశలు అంటే 81 సంవత్సరాలవరకు "మోక్ష"చింతన అవసరం లేదు. కేవలం "సన్యాస" ఆశ్రమం లోనే దాని గురించి ఆలోచించాలి.
  -------------------
  తప్పు తెలుసుకున్నాను. ఆశ్రమంలో ఉండేవాళ్లందరూ సన్యాసులనుకునే వాణ్ని.

  ReplyDelete
  Replies
  1. మంచి పని చేశారు రాజు గారు, ఇంకొకటి కూడ తెలుసుకోండి మీరు ఉన్నది కూడ ఆశ్రమం లేక "ఆ శ్రమ" లోనే. బాహుశా ’గ్రుహస్తాశ్రమం" అనుకుంటా. కరక్టేనా రాజు గారు?"ఆశ్రమ జీవన విదానం" గూర్చి మా తాజా టపా"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు." ని చూడండి

   Delete
 6. ఆయన"కలం పోటుకి ఊడిన కరణం గారిలో మీరు ఒకరా ఏమీటి?
  ---------------------
  అంటే కరణం గార్ల ఉద్యోగాలు ఊడచ్చనా మీ ఉద్దేశం? "ఒక కత్తి పోటుతో పదిమందిని చంపినట్టు" లేక "ఒక ప్లేన్ తో వరల్డ్ సెంటర్ ను పడేసినట్టు" గర్వంగా చెబుతున్నారు.

  ఆహా! ఏమి ఆశ్రమం అండీ మీది. వానప్రస్తాస్రమంలో మోక్షం గురించి ఆలోచింప నక్కర లేదు కదా!

  ReplyDelete
  Replies
  1. కుటుంబం కోసం వ్యక్తిని, గ్రామం కోసం కుటుంబాన్ని, రాజ్యం కోసం ఒక గ్రామాన్ని నష్టపెట్టవచ్చు. ఇది దర్మమే అని పండితుల ఉవాచ. వాన ప్రస్తంలో ’సామాజిక బందం" తెగిపోదు. "సన్యాసం" లోనే అది జరిగేది. అప్పుడే పూర్తి మోక్ష చింతన అవసరం.

   Delete
 7. మా తాజా టపా"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."
  ---------------------
  పెళ్ళి చేసుకోకుండా సన్యాసులైన వాళ్ళందరినీ నిజం సన్యాసులు కాదని ఒక్క మాటతో తేల్చేసారు. ఏమిటో అన్నీ కొత్త సంగతులు తెలుసుకొంటున్నా నివాళ.

  ReplyDelete
  Replies

  1. అదే నిజమయిన హిందూ దర్మం. "శాశ్వత బ్రహ్మచర్యం" అనేది బౌద్ద, జైన, క్రిస్టియన్ ల బావ జాలం నుండి అరువు తెచ్చుకున్నదనుకుంట.

   Delete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )