ఇంటి స్వేచ్చను కాదని ఒంటి స్వెచ్చను కోరుకున్న స్త్రీ చివరకు ఎవరకు ఉపయోగ పడుతుందో చూడండి
దేనికైనా పరిణామ క్రమం ఒకటి ఉంటుంది . ప్రపంచం లో నే కాదు, విశ్వాంతరాలలో కూడా మార్పు అనేది సహజ మైన ప్రక్రియ. దీనికి ఏ విషయం అతీతం కాదు. మనిషి జీవన శైలి కూడా అంతే. అయితే ఈ మార్పు అనేది పరిణామ క్రమంలో బాగంగా యత్న దోష పద్దతిలో అభివృద్ధి చెందాలి తప్పా , ఎవరినో చూసి తెల్లారి పాటికి మారి పోవాల్సిందే అంటె "పులి ని చూసి వాతలు " పెట్టుకున్నట్లే . మన సమాజంలో స్త్రీకి స్వేచ్చ లేదు అని, దానికి కారణం మనువు చెప్పిన విదానమే అని , ఆదునిక జీవులు ఆడిపోసుకుంటున్నారు. మనువు చెప్పిన విదానం మను కాలం నాటి పరిస్తితులకు అనుకూలం గా ఉండవచ్చేమో కాని ఇప్పటి పరిస్తితులకు పనికి రానివే. వాటిని మార్చుకోవలసిన అవసరాన్ని ఎవరూ కాదనజాలరు. ఉదాహరణకు "డబ్బులు కోసం దేవుని పూజలు చేసే వారు రౌరవాది నరకాలు పొందుతారు అని ...