తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!
ఆడపిల్లలకు పెళ్లి కాక ముందు పుట్టింటి రక్షణ, పెండ్లి అయ్యాక మెట్టినింటి రక్షణ ఉండాలనృది సాంప్రదాయ బావన. కాకపోతే ప్రస్తుత పరిస్తితులు ప్రకారం పుట్టింటి వారి రక్షణ స్త్రీలకు, ఎల్ల కాలం ఉండాల్సిందే అనిపిస్తుంది. అయితే బార్యా భర్తల సంబందాలు సున్నితమైనవి కాబట్టి వారి మద్య ఏర్పడిన సమస్యలు పరిష్కరించే వారు కొంచం సహనవంతులై, ఇరువురికి తగిన విదంగా కౌన్సిలింగ్ చేస్తూ, వారి వారి తప్పులు తెలుసుకోవటమే కాక, సర్దుకు పోయే తత్వంలో కాపురం సరిదిద్దుకునేలా చేయ గలగాలి. దీనికి ఎంతో అనుభవమున్న పెద్ద మనుషులు కావాలి.అంతే కానీ తమ తోడపుట్టిన వారిని కట్టుకున్నోడు ఏదో రాచి రంపాన పెడుతున్నాడని , అంతులేని ఆవేశం లో "నేను లేస్తే మనిషినే కాను " అని ప్రవర్తించే దోరణిలో పుట్టింటి వారు ప్రవర్తిస్తే , మొన్న పండితా పురంలో బావను చంపిన బావమరిది కేసులో లాగే అవుతుంది. ...