ఆలి కోసం కులంచెడ్డా,మిగిలింది ఎగతాళే!
ఈ మద్య మాకు తెలిసినతను తన బామ్మర్దిని నా దగ్గరకు తీసుకు వచ్చి అతని సమస్యకు పరిష్కారం చెప్పమని అడిగాడు. అతని బామ్మర్ది సమస్య విన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది.సమాజంలో ఇటువంటి మనుషులు, అందులో ఆడపిల్లలు ఉంటారా అనిపించింది.సరే పరీష్కారం చెపుతాను కొద్ది రోజులాగి రండి అని వారిని పంపించి వేసాను.సమస్యా నేటి స్త్రీ పురుషుల మద్య ఉండవలసిన సంబందాలు ఏ విదంగా ఉన్నాయో తెలిపే ఒక ఉదాహరణ గా బావించి మీతో షేర్ చేసుకుందామనిపించి అతని సమస్యను మీ ముందుంచుతున్నాను.దీనికి పరీష్కారం చెప్పండి. అతను అగ్ర వర్ణానికి చెందిన వ్యక్తి.తక్కువుగా చదువుకున్నాడు.సుతారి మేస్త్రి గా పని చేస్తూ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఉన్న ఒక అక్క పెళ్ళి చేసి తమకున్న రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం ఆమే కి ఇచ్చాడు.వాళ్ల సామాజిక వర్గంలో వాళ్ళు చేసిన స్త్రీ శిశు హత్యా పాపానికి పాపం ఇప్పుడు ఆడ పిల్లల్లు కరువై అతనికి వదువు దొరకడం కష్టం అయి పోయింది.చివరకు వయసు పోరు తట్టుకోలేక పోవటం వల్ల