ఆలి కోసం కులంచెడ్డా,మిగిలింది ఎగతాళే!

                                                                  
              
                           
                  ఈ మద్య మాకు తెలిసినతను తన బామ్మర్దిని నా దగ్గరకు తీసుకు వచ్చి అతని సమస్యకు పరిష్కారం చెప్పమని అడిగాడు. అతని బామ్మర్ది సమస్య విన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది.సమాజంలో ఇటువంటి మనుషులు, అందులో ఆడపిల్లలు ఉంటారా అనిపించింది.సరే పరీష్కారం చెపుతాను కొద్ది రోజులాగి రండి అని వారిని పంపించి వేసాను.సమస్యా నేటి స్త్రీ పురుషుల మద్య  ఉండవలసిన  సంబందాలు ఏ విదంగా ఉన్నాయో తెలిపే ఒక ఉదాహరణ గా బావించి మీతో షేర్ చేసుకుందామనిపించి అతని సమస్యను మీ ముందుంచుతున్నాను.దీనికి పరీష్కారం చెప్పండి.

                     అతను అగ్ర వర్ణానికి చెందిన వ్యక్తి.తక్కువుగా చదువుకున్నాడు.సుతారి మేస్త్రి గా పని చేస్తూ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఉన్న ఒక అక్క పెళ్ళి చేసి తమకున్న రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం ఆమే కి ఇచ్చాడు.వాళ్ల సామాజిక వర్గంలో వాళ్ళు చేసిన స్త్రీ శిశు హత్యా పాపానికి పాపం ఇప్పుడు ఆడ పిల్లల్లు కరువై అతనికి వదువు దొరకడం కష్టం అయి పోయింది.చివరకు వయసు పోరు తట్టుకోలేక పోవటం వల్ల కాని, ఏలాగోలా ఒక ఇంటి వాడు కావాలన్న ఆశ తో నైతే కాని కొంత మంది మిత్రుల సలహా మేరకు కట్నం ఏమి లేకుండానే కులాంతర వివాహానికి సిద్ద పడ్డాడు. చివ్రకు ఒక మద్యవర్తి సహాయంతో ఒక అమ్మాయని, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.హాయిగా కాపురం సాగించాడు.అతని బందువులు కూడ కులంచెడ్డా మంచి పనే జరిగింది లే అని సంతోషించారు.

 కొన్నాళ్లకి ఆ ఆమ్మాయికి గర్బం వచ్చింది. ఆ అబ్బాయి బోల్డు ఆనంద పడిపోయి పెళ్లాని అపు రూపంగా చూడటం మొదలు పెట్టాడు. కాని అతని ఆశల మీద నీళ్లు చల్లుతూ, ఆ గర్బం కాస్తా పోయే సరికి నిరాశపడ్దాడు. ఆ తర్వాతి గర్బం కూడ అదే మాదిరి అయ్యే సరికి, అతని బావకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లి పరిక్షలు చేయిస్తే వారికి పిడుగు లాంటి నిజం తెలిసింది.ఆమెకు పెళ్లికి పూర్వమే 6 ఆబార్షన్లు అయ్యాయని, కాబట్టి ఆమేకు గర్బం నిలవడం కష్టమని చెపితే నమ్మలేక, ఆ అమ్మాయని నిలదీసే  సరికి అది నిజమేనని ఒప్పుకుంది.

అసలు కథ ఏమిటంటె ఆ అమ్మాయి పెళ్లికి పూర్వమే ఒకరి తర్వాత ఒకరిని ప్రేమించిందంటా(?).వారి వల్ల కడుపులు వస్తే డాక్టర్ల పుణ్యమాని గప్ చుప్ గా తీయించేసారట!అందులో ఒక ప్రియుడి మీద చీటింగ్ కేస్ పెట్టి పైసలు వసూల్ కూడ చేసారట.ఆ తర్వాత పెళ్లాం దొరక్క బాద పడుతున్న ఈ అబ్బాయిని చూసి మద్యవర్తి సలహా(కుట్ర) తో ఈ విషయాలు ఏమి చెప్పకుండా వాళ్ల పెద్దలు పెళ్లి చేసారట.

 ఇప్పుడు ఈ అబ్బయి పరిస్తితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా తయారై సలహా కోసం నా దగ్గరకు వచ్చాడు.నేను అతని ఉద్దేశ్యం అడిగితే తనకు సంతాన బాగ్యం కలిగితే చాలు ఆమెను క్షమించి ఏలుకుంటాను అంటున్నాడు. ఆ అమ్మాయి తను అమాయకంగా మోసపోయానని, ఈ పెళ్లిలో తన తప్పు ఏమి లేదని అంతా పెద్దల్దే నని ఏడుస్తుందట.అప్పుడు మెచ్చుకున్న బందువులే ఇప్పుడు కులం కానిదాన్ని కట్టుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఎగతాళి చేస్తున్నారంట.
   అదండి  సంగతి! ఆ అబ్బాయికి ఏ మని సలహా ఇమ్మంటారు?

                             (Republished Post. 11/11/2012)

Comments

  1. eerojullo Pelli Anedi Lottery Lantidi..

    ReplyDelete
    Replies
    1. లాటరీ టికెట్ లు కొనేవాడికి ఎన్ని సార్లైనా, ఎన్ని టికెట్ లైనా కొని తన అద్రుష్టాన్ని పరీక్షించుకునే అవకాసం ఉంది. పెళ్లికి ఆ చాన్స్ లేదే!

      Delete
  2. Ayanaku ila cheppandi.. Ayyindedo Ayyindi. Pedda vayasu kooda antunnaru kadha.. Ekkuva samayam bhagatdhayam lo gadapamani cheppandi.

    ReplyDelete
    Replies
    1. లేదు క్రిష్ణ గారూ, అతని వయస్సు పాతిక లోపే.అందుకే బాద.ఏమి చెయ్య మంటారు?

      Delete
  3. aa ammayi pelli ayina tarvaata itaninene nammukundi kada, gatam gataha, garbham nilupukune maargam telusukoni chakka kaparam chesukomanandi.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యానాలు తెలుగులో రాస్తే బాగుంటుంది అని నా మనవి.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ఇంత నమ్మక ద్రోహమా..దారుణం.

    ఆ అమ్మాయి ఇతనిని నమ్ముకోవడం లా లేదు వ్యవహారం, 'అన్నీ' అయ్యాకా సంఘం కోసం ఎవడో ఒక భర్త ఉండాలి కదా, అలా ఐతే సంఘం లో గౌరవానికి, ఇంట్లో సుఖానికి ఏ లోటు ఉండదు కద, అందుకు ఇతనితో కాపురం..

    ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చి అతను ఇంకొక పెళ్ళి చేసుకొవడం ఉత్తమం.

    అసలు ఆ అమ్మాయి లో అపరాధ భావం ఉందో లేదో కూడా అనుమానమే!
    నిజం గా అపరాధ భావం ఉండి, ఇతని ముందు తన మనసుని పరచి ఇతనినే సర్వస్వం గా భావించేంతటి ప్రేమ ఆ అమ్మాయిలో ఉన్నప్పుడు మాత్రమే అతను కాపురాన్ని కొనసాగించ గలడు, అప్పుడు కూడా అతనికి పిల్లలు కలిగే అవకాశం ఉండదు.
    అలా ఐతే తనిని ప్రేమించే వ్యక్తి ముఖ్యం కనుక పిల్లలు కలగడానికి ఇంకా వేరే దారులేవైనా ఉంటే ప్రయత్నించవచ్చు,
    అసలు గలిగే అవకాశమే లేకపొతే గనక దత్తత తీసుకోవచ్చు.

    కానీ ఆ అమ్మాయి నుండీ ఇంత పరివర్తన ఆశించడం అత్యాశే!!

    ReplyDelete
    Replies
    1. వాస్తవాలు ఎప్పుడూ కటినంగాను, చేదుగానూ ఉంటాయనటానికి మీ వ్యాఖ్యానమే తార్కాణం శర్మ గారు. విడాకులు అనేసరికి ఆ అమ్మాయి మీద ఆరోపణలు రుజువు చెయ్యడానికి కాలము,డబ్బు,ఖర్చు చెయ్యాలి.లేదంటే నష్ట పరిహార రూపంలో అతని శక్తి మించినది ముట్ట చెపితే తప్పా,ఆమే విడాకులకు ఒప్పుకోపోవచ్చు.
      అసలు సమాజంలో అడదానికి గాని,మగవాడికి గాని ఇటువంటి పనులు చెయ్యడానికి ప్రోద్బలం ఇస్తున్నవేమిటంటారు?

      Delete
    2. తెలిసి చేసినవి - డబ్బు/స్వలాభం
      తెలియక చేసినవి - అఙానం

      Delete
    3. చక్కటి మాట!

      Delete
  7. పరిస్థితులు నిజం గ ఎన్నో విషయాలు బోదిస్తాయీ డాక్టర్ చెప్పాడు కాబట్టి విష్యం వెలుగులోకి వచ్చింది కానీ అబ్బాయీ పెద్ద మనసుతో అమ్మాయీని ఎలుకోవాలి
    పిల్లలు ఎవరి నైన పెంచుకోవచ్చు కాదు కూడదు అంటే ఈ మద్య గర్భ సంచి ని అద్దెకి తీసుకుంటున్నారు ఆ ప్రయత్నం మేలు ఆర్ధికంగా కాస్త కర్చుతో కుడి న పని కానీ ఇద్దరి కాపురం నిలబడుతుంది చుడండి మా సలహా నచ్చుతుందో లేదో ?

    ReplyDelete
    Replies
    1. కాపురం చేసే వారి మద్య ఉండవలసింది ప్రేమ,నమ్మకాలే బాలు గారూ. ఇక్కడ అమ్మాయి పూర్వ ప్రవర్తన తెలిసీనా అబ్బాయి, ఆమే సంతానవతి అయితే చాలు అంటున్నాడు.మీరు సూచించిన ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది.అతనికి సాద్యపడదు.తన రక్తం పంచుకున్న పిల్లలు కావాలని కదా అతని ఆరాటం. లేకుంటే ఆమే గురించి తెలిసి కూడా ఆమెను క్షమిస్తున్నది దీని కోసమేనని నా అభిప్రాయం.ఏమంటారు?

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!