ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా యే ఫస్ట్ అట!!?

                                                                     

                                        నిన్న ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు కాకపోయినా , చదువరులను ఆకర్షించే అంత అక్షరాలతో "మహిళలను అవమానించడం లో మనమే ముందు" అనే శిర్షికతో ఒక వార్తను ప్రచురించారు. దాని పక్కనే చిన్న అక్షరాలతో "సిగ్గు, సిగ్గు" అని కూడా ఉంది. ఏంటబ్బా అని విషయం మొత్తం చదివితే ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా స్టేట్ మొదటి వరుసలో ఉంటె , అత్యాచారాల విషయం లో మాత్రం ఆ క్రెడిట్ మద్యప్రదేశ్ వాళ్ళు కొట్టేసారు.తెలుగు రాష్త్రాలుకి , మద్యప్రదేశ్ కి అత్యాచారాల  సంఖ్య విషయంలో చాలా తేడా ఉంది. ఈ  లెక్కలు ఎవరో చెప్పిన కాకి లెక్కలు కావు. సాక్షాత్తు మనదేశ జాతీయ నేరాల నమోదు సంస్థ వారు ప్రకటించినవి కాబట్టి నమ్మదగినవే . వారు 2014 సంవత్సరానికి గాను దేశం లో  జరిగిన రక రకాల వేదింపులు , నేరాలు కు సంబందించి ఒక చిట్టా విడుదల చేసారు . అదేమిటో క్రింద చూడండి.

                                                                   


                                            
                              పై చిట్టాను చూస్తే హత్యలు, అపహరణాలు విషయాల్లో అత్యదిక జనాబా ఉన్న ఉత్తరప్రదేశ్ , బీహర్ మొదటి వరుసలో ఉన్నాయి. అలా కాకుండా జనాబా పరంగా నేరాల దామాషాను లెక్క కడితే బాగుండెది. ఎక్కువ మంది ప్రజలు ఉన్నచోట నేరాలు సంఖ్య  కూడా ఎక్కువే ఉంటుంది కదా. 

   మహిళల ఆత్మగౌరవం కించపరచడం లో ఆంద్రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే , తెలంగాణా 3 వ ప్లేస్ లో ఉంది. అలాగే బస్సుల్లో రైళ్ళలో లేడిస్ ని కెలకడం లో ఆంద్రా మొదటి స్తానం లో ఉంటె అతి తక్కువ జనాబా ఉన్న కేరళ 2 స్తానంలో ఉంది. తెలంగాణా 5 స్తానం లో ఉన్నది అని లెక్క ప్రకారం చెప్పినప్పటికీ నమోదు అయిన కేసులు 3 మాత్రమే , 2 నుండి 5 స్థానం వరకు ఉన్న రాష్ట్రాలలో జ్ఞమోదు అయిన కేసుల సంఖ్య 30న అయితే , మొదటి ప్లేస్ లోఈ ఉన్న ఆంద్రాలో 65 కేసులు నమోదు కావడం చూస్తుంటె బస్సుల్లో రైళ్ళలో "మగబుద్ది " ప్రదర్శించడం లో ఎంత ఉబలాటమో అర్దమవుతుంది. 
             ఇకపోతే పని ప్రదేశాలలో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టడంలో తమిళ తంభి లదే అగ్రస్తానం. తర్వాతి స్తానాలు వరుసగా ఆంద్రా , మహారాష్ట్ర , తెలంగాణా ఆక్రమించాయి. ఇక్కడ కూడా 2,3,4 స్తానాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎన్ని కేసులు నమోదు అయ్యయో ఇంచు మించు  అదే స్తాయిలో మొదటి ప్లేస్ లో ఉన్న తమిళ నాడు ఒక్క రాష్ట్రం లోనే అన్ని నమోదు అయ్యాయి. దీన్ని బట్టి పని చేసే మహిళలను కెలకడంలో తమిళులు ఘనులు అని తెలుస్తుంది . 

     ఇక పోతే ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మనోళ్ళు ఆడవాళ్ళను గోకడం లో ఫస్ట్ తప్పా , అత్య్చారాలు కాడికి వచ్చే సరికి కాస్త కాదు, చాలా వెనుకపాటె . ఈ  విషయం లో  మొదటి రాంక్ లో ఉన్న మద్యప్రదేశ్ 5067 కేసుల నమోదు తో మొదటి స్తానం లో ఉండగా , తెలంగాణా 979, ఆంద్రా 961 కేసులతో 11, 12 స్తానాల్లో ఉండడం ఊరట కలిగించే విషయమ్. పర్సంటేజ ప్రకారం చూస్తే మద్యప్రదేస్  కేసులలో 19% మాత్రమే తెలుగు రాష్టాల్లో నమోదు అయ్యాయి. 

     మరి ఆడవాళ్ళను గోకడం లో ముందున్నతెలుగు  రాష్ట్రాలు ,  అత్యాచారాలు ,  విషయాల్లో వెనుకపడతానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే తెలుగోళ్ళకి నోటి దూల , చేతులు దూల ఎక్కువ. గోకడానికి అవి చాలు . అత్యాచారం విషయం లో మానవత్వమో, చట్ట బయమో పని చేసి వారిని వెనుకపడెలా చేస్తున్నాయి కాబోలు. అయినా నేరాలు నమోదు అయినంత మాత్రానా , అవన్నీ నిజం కేసులే అనుకోవటానికి వీలు లేదు. కేసులు కోర్టు విచారణ తర్వాత కాని  నిగ్గు తేలవు. ఆ లెక్కలు కూడా చెపితే ఇందులో దొంగ  కేసులు ఎన్నో, అసలు కేసులు ఎన్నో తేలుతాయి. ప్రత్యర్డులని దారిలోకి తెచ్చుకోవడానికి కొంత మంది స్త్రీలు  తప్పుడు కేసులు పెడుతున్నట్లు, న్యాయస్తానాల రికార్డులు తెలియ చేస్తుండడమ్ దురద్రుష్టకరం. 

    ఏది ఏమైనా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో , అక్కడ దేవతలు నివసిస్తారు అన్నభారతీయ సాంప్రదాయాన్ని గౌరవించి,పూజించకపోయినా  కనీసం  వారిపట్ల  గౌరవ మర్యాదల తో మెలగడం ప్రతి పురుషుని ధర్మం.

                                               (21/8/2015 Post Republished)




Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం