సింధు పేరెంట్స్ ని చూసి అయినా చిత్తం మార్చుకోని "పురం నాగమణి "

                             రియో ఒలంపిక్స్ 2016 లో అమ్మాయిలే భారత జాతి పరువు కాపాడారు అని జాతి యావత్తు కీర్తిస్తున్న వేళ, ఆ సందర్భంగా మొన్న సోమ వారం , ఒలంపిక్స్ విజేత  P.V.  సింధుకు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ,ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికిన చందంగా ఘనస్వాగతం పలికి , భారీ ఊరేగింపుతో ఊరేగించి , బోల్డన్ని నజరానాలు ఇస్తే , తమ కూతురు అయినందుకు ఆమె తల్లి తంద్రులు ఎంతో గర్వంగా పీలయ్యారు. దేశం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సిందూ లాగా తమ కూతుళ్ళు  పేరు తెచ్చుకోవాలని అభిలషించి ఉంటారు. అసలు ఆడబిడ్డలే లేని వారు తమకు ఆ బాగ్యంలేకపోయిందే అని బాదపడిన వారూ ఉండవచ్చు . కాని నిజమాబాద్ జిల్లా, బీర్కూరు మండలం, దుర్కి గ్రామమ్ కి చెందిన పురం నాగమణి అనే పుత్రికల తల్లి మాత్రం అలా అనుకోలేక పోయింది. అందుకే సిందుకి సన్మానం జరిగిన తెల్లారే ఆమె అంత దారుణానికి ఒడిగట్టింది.

               ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రచురితమైన వార్త ప్రకారం , నిజమాబాద్ లోని దుర్కి గ్రామానికి చెందిన పురం అశోక్ ,నాగమణిలకు మూడెల్ల క్రితం పెండ్లి అయింది. వారికి మొదటి సంతానంగా కూతురు పుడితే తేజశ్రీ అని పేరు పెట్టారు. రెండవ కాన్పులో మగపిల్లాడు పుట్టాలని నాగమణి కోరుకుంది అట. కాని ఆమె కోరిన విదంగా కాక ఆమెకు రెండవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది అట. ఆమె ప్రసవింఛి 26 రోజులే అయినది. కానీ తనకు మగపిల్లాడు పుట్టలేదె అని మనోవ్యద చెంది నిన్న మంగళవారం తన ఒంటి మీద, తన పిల్లల ఒంటి మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించుకుని దారుణంగా చనిపోయింది. ఆ మంటల్లో ఆమె ఆడపిల్లలు మాంసపు ముద్దలుగా మరిపోతే చూసే వారికి గుండె తరుక్కు పోయి ఉంటు0ది.

   వంశాన్ని నిలబెట్టడానికి కొడుకు కావాలనేది పాతమాట. కాలం చెల్లిన మాట. పుట్టబోయే శిశువు లింగ నిర్దారణ చేసేది తల్లిలోని క్రోమోజోములు కావు, తండ్రి లోని క్రోముజోములే అని ఆధునిక వైద్యశాస్త్రం స్పష్టం చేసాక ఆడపిల్లా, మగపిల్లాడు అని వారసుల మద్య బేదాభిప్రాయాలు చూపడం తండ్రి తరపు వారికి తగని మాట. ఇక ఆడపిల్ల పుట్టినప్పుడు తను స్త్రీగా తల్లి గర్వపడాలే కాని , తనజాతి శిశువును చూసి తనే వాపోవడమ్, వాళ్ళని చంపి తను చావడమ్ అనేది స్త్రీ జాతికి మాయని మచ్చను తెచ్చే పని. ఒక వేళా తను ఆడపిల్లకు  జన్మను ఇచ్చాను అని భర్త కాని, అత్తింటివారు తరపు వారు ఎవరైనా ఈసడిస్తుంటె, వారిని గల్లాలు పట్టుకుని తీసుకు వెళ్ళి డాక్టర్లతో , ఆడపిల్లల పుట్టుక నిర్దారణకు కారణమెవరో తెలియచేసే క్లాసులు ఇప్పించండి. అంతే కాని ఆడపిల్లలను చంపి వారి ఉసురు కొట్టుకోకండి .

                                                                       

                      మానవ  జాతిని కనే బాగ్యం దేవుడు స్త్రీలకు ఇచ్చినప్పటికి, స్త్రీ పురుషుల లింగ నిర్దారన చేసే అవకాశమ్ మాత్రం పురుషులదే .  ఏ పిల్లలు పుట్టాలి అన్నది మగవాడు నిర్ణయించలేనప్పటికి, వారి లింగ నిర్దారణకు తనలోని క్రోమో జోములే కారణమవుతున్నందున , ఆడపిల్ల పుట్టినా , మగపిల్లాడు పుట్టినా వారి లింగ నిర్దారణకు   100% బాధ్యత తనదే .ఒక వేళ ఆడపిల్లలు పుట్టడం అరిష్టం అని ఏ మూర్కుడు అయినా భావిస్తే అందుకు 100% బాధ్యత వహించాలసింది కూడా తానే. ఈ  విషయం లో  స్త్రీ నిమిత్త మాత్రురాలు. ఇక ఆడపిల్ల అయినా , మగపిల్లాడు అయినా 100% తండ్రికి వారసులే . అందువలననే ఆడపిల్లలకు కూడా కుటుంబ ఆస్తులు, బాద్యతలులో సమాన వాటాలు కల్పించింది. ఆడపిల్లలును చూసి కుంచించుకు పోయే తల్లితండ్రులు సిందు పెరెంట్స్ ను చూసి అయినా చిత్తం మార్చుకోండి.ఎందుకంటె వారు కూడ ఇద్దరు ఆడపిల్లల్ని కని వారి వలన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.

                ఎవరెన్ని చెప్పినా మా పద్దతి మార్చుకోము అనే మూర్కులు చివరకు నాగమణి లాగే అవుతారు. కాకపొతే బాధా కరమైన విషయం ఏమిటంటే ఈ మూర్కుల కడుపున పుట్టిన నేరానికి ఎంతో మంది ఆడపిల్లలు అన్యాయంగా బలి అవుతున్నారు. వారి ఉసురుతో భరత భూమి అల్లడి తల్లడి అవుతుంది.

              

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.