ఫేస్ బుక్ బాయ్ ప్రెండ్ రమ్మంటే "రూం" కెళ్లింది!అన్నీ అయ్యాకా పెండ్లి చేసుకోను పొమ్మంటే "దేవుడు" దగ్గరకెల్లీంది.
ఫేస్ బుక్ పరిచయాలు యుక్త వయస్కులను ఎంత నాశనం చేస్తున్నాయో ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది. చదువు సంధ్యల్లో వెనుకబడి ఉన్నా , ఫేస్ బుక్ ,ఇంటర్నెట్ చాటింగ్ లలో మాత్రం పన్నెండేల్లకే నైపుణ్యం సంపాదిస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయితో ఆన్లైన్ చాటింగ్ ల పరిచయంతో వాడు రమ్మన్న చోటుకల్లా వెళ్లి, ఇమ్మన్నదల్లా ఇచ్చేస్తుంటే , ఆ అమ్మాయీ కచ్చితంగా వాడి ద్రుష్టిలో పెద్ద లూజ్ కారెక్టర్ . తన మగతనం కోసం వేంపర్లాడి తను రమ్మచోటుకి వస్తుంది అనుకుంటాడు కానీ, తనని అమితంగా ప్రేమించడం వలననే తను కోరింది చేస్తుంది అని చచ్చినా అనుకోడు. ఇంకా తమ ప్రెండ్ షిప్ గురించి తన మిత్ర బృందంతో చెప్పి , ఆ అమ్మాయిని పదిమందిలో పలచన చేస్తాడు. ఇలా టినేజ్ వయసులో కలిగే వ్యామోహాన్ని ప్రేమ అనుకుని చాల మంది ఆడపిల్లలు తమ బంగారం లాంటి బ్రతుకును పాడు చేసుకుంటున్నారో బెంగులూర్ లో జరిగిన ఈ ఉదంతం తెలియ చేస్తుంది.
ఆ అమ్మాయి వయస్సు 14 యేండ్లు. 9 వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే సరదాగా ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. ఫేస్ బుక్ లో తొమ్మిదో తరగతి పాఠాలు చెప్పరు కాబట్టి , తన వయసు కోరుకుంటున్న పాథాలు చెప్పే మనోజ్ కుమార్ అనే B.Com కుర్రాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆసెప్ట్ చేసింది. ఒక్కసారి అమ్మాయి ఫేస్ బుక్ లో ఆసెప్ట్ ఇచ్చిందంటే ఇక కుర్రాడికి నిద్ర పట్టి చస్తుందా? ఇక ఒకటే చాటింగ్ లు, అయినదానీకి కానీ దానికీ ఒకటే లైకింగ్ లు. ఇంకేముంది తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లకి, తనను అమితంగా ఇష్టపడే కుర్రాడు ఒకడు ఉన్నాడని తెలిస్తే వాడే ఆమె కలల రాకుమారుడు. ఇక ఐ అమ్మాయికి నిద్రపట్టడం గగగనం. ఇలా నిద్ర లేని రాత్రులను కంపూటర్ ముందు గడుపుతున్న కూతురుని చూచి ఇంట్లో వారికి అనుమానం వచ్చి, నిఘా పెడితే , అమ్మాయి ఆరాధన బయట పడింది. వెంటనే ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసి వేసారు.
పాపం ఆ తల్లితండ్రుల అమాయకత్వం కానీ, ఇంట్లో ఇంటనెట్ తీసివేయించారు కానీ,"కాపీ కేప్' లు లాగా వీదీ కి నాలుగు ఉన్న "ఇంటర్నెట్ కేప్" లు గానీ తిసివేయించ గలరా! అలాగే అమ్మాయి ఒంట్లో ఆవహించిన ఆ పేస్ బుక్ బూతాన్ని పారద్రోల గలరా? ఆ విషయం లో వారు విపలులయ్యారు. ఆ అమ్మాయి చాటుగా ఇంటర్నెట్ కేప్ ల ద్వారా తన ప్రియుడికి ప్రేమ సందేశాలు పంపిస్తూనే ఉంది. ఇక అ పోరగాడు మాత్రం ఎంత కాలం ఒక దానితోనే చాటింగ్ లు చేసుకుంటు టైం వేస్ట్ చేసుకుంటాదు. అందుకే మంచి ముహుర్తం చూసి తన రూం కి రమ్మని ఆహ్వనించాడు. ఇంకేముంది అమ్మాయి ఉబ్బి తబ్బిబ్బు అయింది! వలచిన వాదే పిలిచాడు కదాని సంబరపడి అతని రోం కి వెల్లింది . ఆ తర్వాత కద మామూలే . ఇద్దరూ అన్నాళ్ళ తమ అంతర్జాల అవేశం ని చల్లార్చుకున్నారు. అలా తమ మద్య ఉన్న బందాన్ని పెనవేసుకున్నారు.
ఆ తర్వాత ఆ అమ్మాయి తనను పెండ్లి చేసుకుని తమది జన్మజన్మ ల బందం అని వ్రుజువు చేయమందట. దానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక వెర్రి దానిలా చూసి , ఇలా చేస్తే ఇప్పటికే నేను చాలా మందిని పెండ్లి చేసుకోవాల్సి ఉండేది అన్నాడట! దానితో ఆ అమ్మాయి నివ్వెర బోయింది. పాపం ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడా కద షరా మామూలే . తల్లితండ్రుల పిర్యాదు మేరకు ఆ బ్బాయి మీద మోసం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు పోలిసులు. కేసు దర్యాప్తులో ఉంది. అదీ విషయం.
నేను పైన చెప్పినట్లు మగవాడు పెళ్లి కాకముందు ఎంతమంది తన రూం కి గాళ్స్ ప్రెండ్స్ వచ్చినా ఆహ్వానిస్తాడు. కానీ అదే గాళ్ ప్రెండ్ పెండ్లి చేసుకోమంటే మాత్రం నూటికి తొంబైతొమ్మిది మంది సుతారం అంగీకరించరు. ఎందుకంటే ప్రతి మగవాడు పతివ్రత అయిన బార్యనే కావాలనుకుంటాడు. తను రమ్మంటే ఈజీగా వచ్చేసింది, ఇతరుల దగ్గరకు పోలేదని గ్యారంటీ ఏమిటి? అనే ఆలోచిస్తాడు. ఒక వేళ పరిస్తితుల ప్రబావం వల్లా , పెండ్లి చేసుకున్నా వాడు జీవితం మొత్తం ఈ కుశంకతోనే బాదపడుతో, ఆ అమ్మాయిని నకయాతనకు గురి చేస్తాడు. కాబట్టి అమ్మాయిలూ ఎవరైనా సరే , వారు ప్రేమించిన వారిని పెండ్లి చేసుకోవాలంటే , పెండ్లి కాక ముందు తొందరపడకుండా జాగర్త పడితేనే , అబ్బాయిలు దృష్టిలో వారికి విలువ ఉంటుంది. అయినా ఫేస్ బుక్ పరిచయాలని ప్రణయాలు అనుకునే బేవకూప్ తనం ఆ పిల్లలది కాదు. వారి వయసుది. కాబట్టి పిల్లల అనాలోచిత, అపరిపక్వ నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరించడమే కాక , వారిని కట్టుదిట్ట చర్యలతో రక్షించుకోవడం తల్లితండ్రుల ప్రాదమిక హక్కులో బాగమే. ఆ హక్కును గుర్తించాల్సిన అవసరం ప్రబుత్వాలకు ఉంది.
( 8/11/2013Republished post).
Comments
Post a Comment