మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?

                                                                                                                           


                      ప్రభుత్వాలు ఎంత గొప్ప చట్టాలు చేసాయి  అనేది కాదు , ప్రజలు దానిని ఎంత సక్రమంగా వినియోగొంచుకుంటున్నారు అనే దాని  మీదే  ఆ చట్టం యొక్క కొనసాగింపు ఆదారపడి ఉంటుంది . ప్రజలు స్వీకరించని చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రజలు 95% దుర్వినియోగ పరచడం వలన, వ్యక్తులు  హింసించబడడమే  కాక ఆత్మహత్యలకు గురికాబడుతున్నపుడు , ఆ చట్టాలు మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను కోన సాగించడానికి వీలు లేదు. ఏ  నేర చట్టం ఉద్దేశ్యమైన  ప్రజలలో మార్పు తేవడమే తప్పా , మట్టు బెట్టడానికి కాదు. ఒక వేళా నేరస్తుణ్ణి చంపాలన్నా అదీ కూడా  చట్టబద్ద విదానాల ద్వారానే జరగాలి తప్పా , చట్ట వేదింపులు గురి అయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్తితుల్లో కాదు. అలా 95% దుర్వినియోగ మవుతూ భారతీయ భర్తల ఆత్మహత్యలకు కారణ మవుతున్న 498-A  నేరస్మ్రుతి నిబందన పై తక్షణం సమీక్ష జరిపి సవరించాల్సిన అవసరం  ఉంది.

  భారత దేశానికి ఉన్న విశిష్టతల్లో బలమైన కుటుంభ వ్యవస్థ కూడా  ఒకటి . స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలే కాక, పిల్లలను సమాజానికి ఉపయోగ పడే , పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చి దిద్దడానికి "కుటుంభం " అనేదే మొదటి పాఠ శాల , తల్లి తండ్రులే తోలి గురువులు అవుతారు. ఒక పాఠ శాలలో గురువుల మద్య సమస్యలు వస్తే , ఆ పాఠశాల యొక్క బవిష్యత్తు ను ద్రుష్టిలో పెట్టుకునే వారి మద్య సమస్యలు తీర్చడానికి పెద్దలు లేక అధికారులు ప్రయత్ణిస్తారు. కానీ అదేమి దౌర్బాగ్యమో  కానీ అదే కుటుంభం లోని భార్యా భర్తల మద్య సమస్యలు వస్తే మాత్రం కుటుంభ సంక్షేమం కంటే వ్యక్తీ సంక్షేమమే ముఖ్యమనే దోరణిలో వ్యవహరిస్తున్నారు. ఒక విద్యా సంస్తలో పని చేసే  ఉపాద్యాయురాలీని హెడ్ మాస్టర్ వేదింపులకు గురిచేస్తే దానిని హెడ్మాస్టర్ హింసిస్తున్నాడు అని మాత్రమే వ్యవహరిస్తారు. అంతే కానీ అది "విద్యాసంస్త హింస" గా పరిగణించరు . కానీ అదే కుటుంబం వరకు వచ్చే సరికి వ్యక్తుల మద్య హింసను కూడా "గృహ హింస" గా పరిగణిస్తూ మొత్తం కుటుంభానినే శిక్షిస్తున్నారు.
  ఈ  దేశం లో స్త్రీలకు రక్షణ లేదు అనే ఒకే ఒక నినాదంతో  ఇంటిని, వీదిని  చట్ట సవరణలతో ఒకే గాటన కట్టి పడేశారు . చెప్పుకుంటే సిగ్గు చేటు కానీ "నిర్భయ " కంటే భయంకరమైనది  498-A  చట్టం . నిర్భయలో మ్రుగాడు జైలులో అన్నా బ్రతుకుతాడు. కానీ గృహ హింస నిందితుడు అయినా మగాడు నరకయాతన అనుభవించి , చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నాడట! ఇది నేను చెప్పే మాట కాదు సాక్షాతూ నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వారు లెక్కలు పరిశిఌంచి చెప్పిన మాట. 2012 లెక్కల ప్రకారం వివాహం అయిన పురుషులు గృహ సంబంద సమస్యలు వలన చనిపోయినవారు 63,343 మంది కాగా స్త్రీలు 31,921 గా ఉందంట! అంతే బార్యలు కంటే భర్తల సంఖ్యే రెట్టింపుగా ఉంది. మరి ఈ  విదంగా చూస్తె గృహ హింస వలన స్త్రీల కంటే పురుషులే రెట్టింపు సంఖ్యలో బాదపడుతున్నారు కదా! దీనికి కారణాలు ఏమిటి?

      భారతీయ కుటుంబాలను నాశనం చేసే వాటిలో మొదటిది "వరకట్నం " కాగా , రెండవది "గృహ హింస " చట్టం. వరకట్నం కోసం ఆడపిల్లలను రాచి రంపాన పెట్టే భర్తల కన్నా , అత్తలు ఆడబిడ్డలు పాత్రే ఎక్కువ. అప్యాయతలు, అను రాగాలు అనే వాటికి అర్దం లేకుండా చేసింది వరకట్న వ్యవస్త. అటు ఎక్కువ కట్నం తెచ్చిన వారు కూడా  తాము అత్తింటి వారికి ఊడిగం చేయాల్సిన కర్మ ఏమిటి? అని పెళ్లినా ఆర్నెళ్ళకే ఎదో సమస్య సృష్టించుకుని , చిన్న సమస్యలను కూడా  బూతద్దాలలో  చూపిస్తూ వేరు కాపురం కోసం కీచులాట పెడుతుంటారు. ఇది సహజంగానే ఆ కుటుంబంలో ని సబ్యుల మద్య శాశ్వత వైరాలు కలిగిస్తుంటాయి. అలాగే భార్య భర్తల మద్య గొడవలు వస్తే వాటిని పరిష్కరించడానికి అటు భార్య తరపు వారు కానీ, ఇటు భర్త తరపు వారు కానీ కుటుంభ సంక్షేమం ద్రుష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతయి. కానీ బార్య తరపున ఎవరైనా రాజకీయ నాయకులూ ఉంటే మాత్రం ఇక ఆ సమస్య పొలిసు కేసులు దాకా వెళ్ళటం , కేవలం భర్త మీద కేసు పెడితే భర్త తొందరగా దారికి రాడు కాబట్టి , ఎప్పుడో విడిపోయి వెళ్లి పోయిన అతని తరపు అన్నదమ్ములతో సహా ఆత్త మామల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ కేసులు ఎలాగు తొందరగా తేలవు కాబట్టి, సమస్య చిన్నదైనా పెద్దదైనా "గృహ హింస" మాత్రం ఒకటే మోతాదులో ఉంటుంది కాబట్టి, అటు పెళ్ళానికి, ఇటు పిల్లలకు దూరమై, తన వలన తన కుటుంభం యావత్తు బాధపడడం తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

    నేను ఇదంతా చెపుతుంది కుటుంబాలలో స్త్రీలు ఎక్కువుగా ఆనందంగా ఉంటున్నారని పురుషులు మాత్రమే బాదపడుతున్నారని కాదు. స్త్రీల బాదల పట్ల స్పందించినంతగా పురుషుల పట్ల అటు సమాజం కానీ , ఇటు చట్టాలు కానీ స్పందించవు. పురుషుడు పెట్టే హింస పైకి కనపడుతుంది కాబట్టి స్త్రీలు దానిని చూపించి జాలీ, సాను భూతి పొందగలుగుతున్నారు. అదే పురుషులను స్త్రీలు పెట్టే హింస పైకి కనపడదు. ఉదాహరణకు భర్తను రోజూ తిట్లతో లేక సనుగుడుతో సతాయించే  పోరును తట్టుకోలేక ఒక దెబ్బ కొడితే , ఆ కొట్టిన దెబ్బ కనపడుతుంది కానీ వారం రోజులుగా సనుగుడుతో సతాయించిన స్త్రీ వేదింపు ఎవరిక్ కనపడుతుంది? స్త్రీలు బోరున ఏడ్చి తమలో ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా చేసుకోగలుగుతారు. కానీ ఈ  పురుష అహంకార సమాజం మగవాడిని ఏద్వనీయకుండా చేస్తుంది. దీని వలన మరింత స్ట్రెస్ కు గురి అయి ఆ కోపం భార్యా పిల్లల మీద చూపించే సరికి అది గృహ హింస గా వికృత రూపం దాల్చి , చివరకు అతని ప్రాణాలను తీస్తుంది. కాబట్టి  పురుషా అహంకార సమాజం లో స్త్రీలే కాదు , పురుషులు కూడా  బాదితులే! ఏడ్చే స్వాతంత్ర్యం లేని సమాజంలో పురుషుడు ఉండలేక పోతున్నాడు.

    కాబట్టి కుటుంబ సమస్యలను కుటుంభ సంక్షేమం దృష్టితోనే చూడాలి అందులోని సబ్యుల వ్యక్తిగత సంక్షేమం దృష్ట్యా కాదూ . ఒక వేలా భార్యా భర్తలు కలస్ది ఉండలేని పరిస్తితులు దాపురిస్తే అప్పుడు మత్రమే బాద్యులను శిక్షించి బాదితులకు విడాకులు సహితంగా అన్నీ పరిహారాలు లభించేలా చేయాలి. లేదంటే ఇంగ్లాండ్ మాదిరి ఇండియాలో కూడా  వివ్వాహ రహిత కుటుంబాలు ఉంటాయి.కాకుంటే స్త్రీలు బాదపడుతున్నారు కాబట్టి వారికోసం ఒక రోజును కేటాయించినట్లు , బాదిత పురుషుల కోసం కూడా  ఒక దినం కేటాయించారు . అదే "అంతర్జాతీయ పురుషుల దినం". ఇలా దినాలు కేటాయించడం తప్పా మనమేమి చేయాలేమా? ఆలోచించండి.
                                                      (20/11/2013 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!