మీ పిల్లలకి పదేళ్లు దాటాయా? అయితే వారు ఆడే ఆటల్లో "ఆ" ఆట ఉందేమో చూడండి.
స్త్రీల మీద లైంగిక దాడులు అధికమయ్యాయి అని అందరం తెగ బాద పడి పోతున్నాం. ఎక్కడైనా ఒక సంఘటణ జరిగి దానిని మీడియా వాళ్ళు కొంత హైలెట్ చేసాక, మనమూ మనుషులమే, మనకూ ఆడపిల్లలు ఉన్నారనో, సమాజానికి మన వంతు కర్తవ్యం గా సందేశం ఇవ్వాలనో, మరేదొ కారణాల చేత వీదుల్లోకి వచ్చి నాలుగు అరుపులు అరచి, మీడియాలో కనపడితే చాలు మన బాద్యత తీరిపోయిందని ఒక నిట్టూర్పు విడచి కాం గా ఉంటున్నాం. లైంగిక దాడులు జరుపుతున్నది మ్రుగాళ్ళు కాబట్టి వారికి కఠిన శిక్షలు విదింప చెయ్యాలని ప్రభుత్వం మీద పోరాడితే వచ్చింది "నిర్భయ" చట్టం. ప్రజలకు రక్షణ ఇవ్వ వలసింది ప్రభుత్వాలే కాబట్టి అత్యాచారాలకు ప్రభుత్వా లను మాత్రమే బాద్యులను చేస్తూ సాగిస్తున్న ప్రజాందోళనలు వల్ల నిజంగా స్త్రీల మీద అత్యాచారాలు ఆగుతాయని అనుకుంటే దానికంటే అమాయకత్వం మరొకటి లేదు.
నిజంగా ఈ రేప్ లు చేస్తున్న మైనర్ రేపిస్టులు ఎవరు? వారు ప్రభుత్వానికి చెందిన వారా? వారు అందరికి మల్లే అమ్మా బాబులకు పుట్టిన వారేనా? లేక పోతే రేపిస్ట్ జాతి అనే ప్రత్యేక తెగ ఏమైన ఇండియాలో ఉంటే ఆ జాతిలో పుట్తారా ! లేదు కదా . వారూ మన పిల్లలే కదా.మరి వారు అలా తయారు కావడానికి తల్లి తండ్రుల బాద్యత లేదా? మన బాద్యతను మనం విస్మరించి, ప్రతి దానికి ప్రభుత్వాలను విమర్శించినంత మాత్రాణా సమస్యలు తీరవు గాక తీరవు. పెరిగిపోతున్న దారుణాలకు ప్రస్తుత సమాజం లోని తల్లితండ్రులదే అదిక శాతం బాద్యత. తమ పనుల కోసం పిల్లల్ని పట్టించుకోని తత్వాల వలనే ఆడపిల్లలు బలి అవుతున్నారు. ఈ మద్య గౌహతిలో జరిగిన ఒక ఉదంతం చెపుతాను.
ఒక అమ్మాయి. వయస్సు పన్నేండేళ్లు. ఆ అమ్మాయికి ఆడపిల్లలతో పటు మగ పిల్లలు కూడా స్నేహితులు ఉన్నారు. సాదర్ణంగా ఆడపిల్లలు అయినా, మగపిల్లలు అయినా సరే యుక్తవస్సు రానంత కాలం వారు కలసి ఆడుకోవడాన్ని పెద్దగా అబ్యంతరం పెట్టరు పెద్దలు . పిల్లలో ఆటలు, వారి శారీరక మానసిక అభిరుద్దికి తోడ్పడతాయి. అలాగే అనుకుని ఉంటారు ఆ అమ్మాయి తల్లి తండ్రులు. ఆ అమ్మాయికి ఉన్న మగస్నేహితులు 5 గురు ఒక ఆదివారం రోజు వచ్చి ఆడుకుందాం రమ్మని పిలిచారట. పాపం సరే అని ఆ అమ్మాయి వారితో కలసి బయటకు అంటే కొంచం మదుగు ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. ఆ ఐదుగురు మగపిల్లలు వయస్సు కూడ పన్నేండేల్లు నుంచి పదహారేళ్ళ లోపే.వారు ఆడిన ఆట ఎమిటో తెలుసా కలవడం, విడిపోవటం. . అలా సాయంత్రం దాక ఆ ఆట ఆడి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారట!
ఆ రాత్రికి ఆ అమ్మాయి బాగ బాద పడుతుంటే, "ఏమిటమ్మా, ఏమైంది అని అడిగిన తల్లికి ఆ అమ్మాయి చెప్పిన విషయం విని షాక్ కి గురి అయింది. తన కూతురు గాంగ్ రేప్ కి గురి అయిందని తెలిసి నోట మాట రాలేదు ఆ తల్లికి. చివరకు తర్జన బర్జన పడి మంగళవారం సాయంత్రం పోలిసులకు విషయం తెలిపితే ఆ 5 గురు మగ పిల్లలు(?) మీద నిర్భయ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారట!
ఇప్పుడు చెప్పండి. ఈ ఉదంతం లో ఆ 5 గురు మగపిల్లలు తల్లితండ్రులు, ఈ ఆడపిల్ల తల్లితండ్రులు బాద్యులు కారా? వారి పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి ఆటలు ఆడుతున్నారు? ఎలాంటి చిత్రాలు చూస్తునారు? వీట్టన్నింటిని కీన్ అభ్సర్వేషన్ చేయ్యాల్సిన అవసరం లేదా? మరి ఉంటే ఇటు వంటి బాద్యతను విస్మరించిన వారికి ఏ శిక్ష ఉంది? మైనర్ లు చేసే పనులకు గరిష్ఠం గా మూడేళ్ల శిక్ష మాత్రమే అని మొన్న నిర్భయ కేసులో మైనర్ కి మూడెళ్ళ శిక్ష విదిస్తే దానికి ఎక్కువ శిక్ష విదించాల్శిందే అని గొడవ చేసారు కాని వాడి తల్లి తండ్రులను కూడా శిక్షించాల్సిందే అని ఎందుకు డిమాండ్ చేయలేక పోయాం? ఎందుకంటే మనదంతా బౌతిక వాదం కాబట్టి. కనిపించే నిందితుడే శిక్షార్హుడు తప్పా వాడు అలా తయారు కావడానికి కారణమయిన వారిని ఏమి అనం. ఇలా పెద్దలు బాద్యతలు మరువబట్టె పిల్లలు అలా పాడవుతున్నారు.
కాబట్టి పదేళ్ళు నిండిన పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి, తమ పిల్లలు చేసే పనులు మీద, ఆడుకునే ఆటల మీద ,ఆసక్తి చూపుతున్న విషయాల మీద ఒక కన్నేసి ఉండాలి. తమ పిల్లాడు మగపిల్లవాడు కాబట్టి వాడు ఎలా తిరిగిన తమకేమి కాదులే అని దీమాగా ఉంటే ఎప్పుడొ ఒకప్పుడు వాడు ఊచలు లెఖ్ఖపెట్ట వచ్చు. రేపు ఇలాగే మైనర్ పిల్లలు రేపిస్ట్ లుగా మారడం అధికమయితే తల్లితండ్రులను కూడా బాద్యులుగా చేసే చట్ట సవరణలు వస్తాయి. అప్పుడు చింతించి ప్రయోజనం ఉండదు. ఈ సమజానికి సత్పౌరులను అందించవలసిన బాద్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉంది. పిల్లల్ని పెంచడం చేత కాని వారు వారిని కనకపోవడమే మంచిది. దాని బదులు ఏ మంచి పిల్లవాడి చదువుకో సహాయం చేసి కీర్తి పొందండి. "తల్లికి వంగని వాడు దాతీకి(వద్యశిల) కూడ వంగడట! అలాంటి వారు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. తల్లితండ్రులకు కొర్వి పెట్టేవాడు కాదు కావాల్శింది. సమాజానికి కొరివి పెట్టని వాడు కావాలి. అందుకే పదేండ్లు నిండిన పిల్లలున్న తల్లితండ్రులారా, తస్మాత్ జాగర్త! వారు ఆడే ఆటల లిస్ట్ లో "ఆ" ఆట ఉందేమో చూడండి. మీ మగ పిల్లలు ఎదో ఒక నాడు పైన బొమ్మలో చూపిన మాదిరి హోర్డింగ్ ల మీదకు వచ్చే పరిస్తితిని వారికి కల్పించకండి .
(Republished Post. 19/9/2013)
Comments
Post a Comment