గర్భనిరోదక మాత్రలు ఇచ్చి , 300 మంది అమ్మాయిలతో శ్రుంగారం నడిపిన వాడు కీచకుడు అవుతాడా !!!?

                                                                   

               
                                                    రెండు చేతులు కలిస్తే కాని చప్పట్లు కావు అనే సూత్రం మొన్న హైదరాబాద్ లో పట్టుపడిన "కలకండ మధు" అనే ' సెక్స్ మానియా'   కేసుకు వర్తిస్తుంది. ఒకరు ఇద్దరు కాదు సుమారు 300 మంది అమ్మాయిలను  రక రకాల ప్రలోభాలతో తన గదికి రప్పించుకుని , వారికి గర్భనిరోదక మాత్రలు ఇచ్చి, తను కండోమ్ లు వాడి , వారితో సురక్షిత సెక్స్ జరిపాడు అంటే , అది అతడికి వారికి మద్య ఇష్టపూర్వకంగానే నడచిన వ్యవహారమని యిట్టె అర్దమవుతుంది. అందుకే అతడు అంత దైర్యంగా "నా మీద ఏ నేరమూ రుజువు కాదు, రెండు మూడు రోజులలోనే నేను భయటకు వస్తాను " అని పోలీసులతో అంత దీమాగా చెప్ప్పాడు అంటె , తనకి వ్యతిరేకంగా , తనతో సంబందం ఉన్న ఏ అమ్మాయి ముందుకు వచ్చి చెప్పదనే  అతడి దీమా. అసలు ఈ  కేసు పూర్వ పారాలు చూస్తే , ఇందులో ఆ కామ పిశాచి అయిన "మధు" తప్పు ఎంత ఉందో , అమ్మాయిల తప్పూ అంతే ఉందని చెప్పవచ్చు. కేసు విషయాలు  పూర్తిగా తెలియాలంటే క్రింది చిత్రం లోని సమాచారం చూడండి. 
                                                                               


                                         
                                              పైన విషయాలు గమనిస్తే ఒక విషయం  స్పష్టమవుతుంది. అతనికి ఉంది అమ్మాయిల పిచ్చి. దాని కోసం అతడు  ఇతర పని పాటా మానేసి , సుమారు 5000 మంది  వివరాలు సేకరించి, వారికి వరుసగా పోన్ లు చేసి మాట్లాడితే , అతడిని కోపంగా మాట్లాడిన వారు ఉన్నారు, ఇప్పుడు కాదు , రేపు మాపు అని తప్పించుకున్న వారూ ఉన్నారు. అలాగే  , దురాశతో వచ్చి వాడి వలలో  చిక్కుకుని , పిచ్చి ముఖాలేసుకుని వెళ్లి పోయిన వారూ ఉన్నారు. వాడు ట్రై చేసిన అమ్మాయిలలో కేవలం ఒక 10% మంది మాత్రమే వాడి వలలో చిక్కుకున్నారని చెప్పవచ్చు. మరి అలా చిక్కుకున్న అమ్మాయిల నేపద్యం తెలిస్తే , ఎటువంటి అమ్మాయిలూ మోసగాళ్ళ మాటలకు త్వరగా ఆకర్షితులు అవుతారనేది  విస్లేశించవచ్చు. వాడు కామపిశాచి అయినప్పటికి ఆడపిల్లలను బలవంతం చేసాడు అనే ఆదారాలు లేవు. కాకపోతే మాయమాటలు చెప్పి తన తో గడపడానికి ఒప్పించాడు అనేది స్పష్టం అవుతుంది. 
       
     తనతో కోపంగా పోన్ లో మాట్లాడిన అమ్మాయిలను "డేంజర్ " అని రిజిస్టర్ లో మార్క్ చేసి, రెండవ సారి వారి జోలికి వెల్లే వాడు కాదు అంటా. అలాగే రేపు మాపు అనే వారిని కూడా "waste " అని వారి గురించి ఒకటి రెండు సార్లు మాత్రమే వాకబు చేసి వదిలేసే వాడు అంట. తన మాటలకు ఆకర్షితులైన వారిని , రూం కు రప్పించుకుని , అన్నీ అయ్యాక "ఓవర్ " అని మార్క్ చేసి ఇక వారి జోలికి వెళ్ళె వాడు కాదంట. ఇలా పకడ్బంది గా వ్యవహరించాడు కాబట్టే 300 మంది దాక పటాయించగలిగాడు. కాబట్టి మధు మాయమాటలు చెప్పి మోసం చేస్తే చేయవచ్చు కాని, అమ్మాయిల ఇష్టం లేకుండా వారితో శృంగారం నడిపాడు అనటం కరెక్టు కాదు.ఇందుకు అతడి గదిలో దొరికిన గర్భనిరోదక మాత్రలు, కండోమ్ లే సాక్ష్యం. అలాగే ఆడపిల్లలు కూడా అతనితో శృంగారం లో పాల్గొనడం  ఇష్టం లేని వారైతే ఇతర స్త్రీల వలెనె మొదట్లోనే తిరస్కరించి ఉండవచ్చు. అలాంటి వారి జోలికి ఆతను పోలేదు అని తెలుస్తుంది. 

             కాబట్టి షీ టీం వారు , కేసును కూలంకషంగా విచారణ జరిపి, మధు ను ప్రాసికూట్ చేయడం తో పాటు  ఆ యా అమ్మాయిల వివరాలు తెలుసుకున్బి వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం మంచిది. అలాగే అతనికి, అతడితో  సంబందం ఉన్న వారందరికి  వైద్య పరిక్షలు నిర్వహించడం మంచిది. ఎంత కండోమ్ లు వాడిన , 300 మందితో వ్యవహారం నడిపాడు కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాసం ఉంటుంది. ఈ  మద్య జేంస్ అనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు   ఒకడు కావాలనే చాలా మంది అమ్మాయిలకు ఎయిడ్స్ అంటగట్టాడు అట. అలాంటిదేమన్నా ఉందా అనే కోణం లోను ఆలోచించాలి. ఏది ఏమైనా ఇతడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి చాలా మంది ముందుకు రారనే ఉద్దేశ్యంతోనే ఇతగాడి మీద పి డి. యాక్ట్ క్రింద కేసు పెట్టడం మంచిదే.

                    పై కేసును పరిలిస్తే నగరాల్లో ఉండె ఆడపిల్లలు ఇంత అమాయకులా అనిపిస్తుంది. కేవలం మార్కుల కోసం, ఉద్యోగాల కోసం , ఇంత ఇజీగా లొంగిపోతారా? ఇలాంటి ఆడపిల్లలకు తగిన గైడెన్స్ ఇచ్చే వారు ఇండ్లలో ఉండరా? లేక వీరంతా "మై చాయిస్" అని ఎవరి మాట వినకుండా స్వీయ నిర్ణయాలు తీసుకుని బోల్తాపడుతుంటారా? ఒక వేల అదే నిజమయితే నగరాల్లో "కలకండ్ల మధు" లాంటి కాసినోవా లకు కొదువేమి ఉండదు. ఆడపిల్లలు గల తల్లి తండ్రులు , అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళు  బహుపరాక్!
                                    (Republished post.25/10/2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం