ఇంటర్నెట్లో ఆనందాలకు అలవాటు పడి, ఇంట్లో అనందాన్ని పట్టించుకోకుంటే పరిస్తితి ఇలాగే ఉంటుంది!!




                                                        మనిషి యొక్క ఆనందనమనేది అతని జీవన శైలి ని అనుసరించి ఉంటుంది. పెండ్లి కాక ముందు జులాయిగా తిరుగుతున్న కొడుకులను చూసి చాలా మంది పెద్దలు ఏమంటారు అంటే " వీడికి మంచి అమ్మాయిని చూసి ముడి పెట్టేస్తే , దారి కొచ్చి బుద్దిగా ఉంటాడు" అని. అంటే జులాయిగా తిరుగుతూ తన ఆనందం తానూ వెత్తుకునే వాడి వల్ల  అతని ఆరోగ్యానికే కాక, కుటుంబానికి తద్వారా సమాజానికి మంచిది కాదు అని పెద్దల బావన .

   ఉదాహరణకు ఈడోచ్చిన కుర్రాడు సావాసా ల రుచి మరిగి ఇంటి పట్టున ఉండకుండా , చెప్పిన పని చెయ్యకుండా బలాదూర్ తిరుగుతుంటే , ఎప్పుడు ఏ గొడవల్లో ఇరుక్కుంటారో అని తల్లి తండ్రులు బయపడుతూ ఉంటారు. అందుకే అతనిని ఇంటి పట్టున ఉంచటానికి పెండ్లి చెయ్యటం కూడా  ఒక మార్గం అనుకుని తగిన సంబందం చూసి పెండ్లి చేస్తుంటారు. సాదారణంగా కొత్త పెళ్ళాం మోజులో తన తిరుగుళ్ళకు స్వస్తి చెప్పి, ఇంట్ పట్టున ఉండి వేళకు తిండి తింటూ , నిద్ర పోతూ ఉండటం వలన చూడటానికి పెండ్లి కాక మునుపు కంటే బాగుండటం జరుగుతుంది. అటువంటి వారిని చూసి "వీడికి పెండ్లి నీళ్ళు పడ్డాయిరోయి" అని స్నేహితులు కూడా  ఆట పట్టించటం జరుగుతుంటుంది. అదే క్రమం లో పిల్లలు కలగడం ,సంసారం అభివృద్ధి కోసం ఆలోచించడం , రోజూ  పనికెళుతూ , సాయంత్రం వేళ టైం కి ఇంటికి రావడం , తన ఆనందం కుటుంబ సబ్యుల ఆనందం తో ముడి పడి ఉందని గ్రహించడం వలన, భర్తగా , తండ్రిగా , కొడుకుగా తన బాద్యతలు నెరవేరుస్తూ , కుటుంబ సబ్యుల ను సంతోషంగా ఉండేలా చూస్తూ , తనూ ఆనందం అనుభవిస్తుంటాడు.ఇవ్వన్నీ ఒక క్రమ జీవన పద్దతికి అలవాటు పడడం వలననే సాద్యమవుతుంది .చు

   అయితే ఇన్నీ అనందాల్లో లైంగిక  ఆనందం ని పంచుకోవలసింది తన జీవిత బాగస్వామీతో మాత్రమే. దైనందిన కార్యక్రమాలలో లైంగిక ఆనందం పొందడమనేది సంసారులకు అలవాటుగా మారి పోతుంది.కాబట్టి తమ జీవిత బాగ స్వాముల  పట్ల ఈ  విషయం లో నిర్లక్ష్యం చేయడం వారి సంసార హక్కులను కాల రాయడమే అవుతుంది. అలా నిర్లక్ష్యం చేసే జీవిత బాగ స్వామీ నుండి సమస్య తీవ్రతను బట్టి విడాకులు కోరుకునే హక్కు బాదితులకు ఉంటుంది. కానీ సాదారణంగా పిల్లలు ఉండి , లైంగిక ఆనందం లో తప్పా తనకు ఇతరత్రా ఏ విషయం లో అసంతృప్తి లేక పోతే స్త్రీ, పురుషులు  సాద్యమైనంత వరకు విడాకుల వరకు పోరు. అందుకే మన దేశం లో చాలా కుటుంబాలు ఒడిదుడుకులు లేకుండ సాగుతున్నాయి. 

మన సమాజం లో కొంత మంది మగవారు తమకు ఇంట్లో సరి అయిన  సుఖం  లేదనే వంకతో పరస్త్రీల సాంగత్యం తో ఇంటి ఇల్లాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి ఇల్లాలు వ్యక్తీ గతం గా బాదపడటమే కాక, చుట్టుప్రక్కల వారు  తనను జాలిగా చూడటం తట్టుకోలేక పోతుంది. పరస్త్రీ సాంగత్యం, మద్యపానం వ్యసనం , పేకాట వ్యసనం, చెడు సావాసాలు తో ఎప్పడూ బయట ఉండే   భర్తల వలన బార్యలు తమ సంసార హక్కుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇది అన్నీ విషయాలు లాగ అందరితో చెప్పుకునే అవకాశం లేని సమాజం మనది. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని తమ సంసార జీవితంలో ఇతరులు ప్రవేశించడం యావత్ కుటుంబానికే నష్టం కలిగిస్తుంది. ఈ  బాధలకు తోడు ఈ మద్య ఒక కొత్త రాక్షసి సంసార గ్రుహాల్లోకి జొరబడి సంసార జీవితాలను చిన్నా బిన్నం చేస్తుంది. పైన చెప్పిన దుర అలవాట్లు భర్త దూరంగా ఉండటం వలన సంసార ఆనందం పొందే బాగ్యం లేక పోతే ఈ   కొత్త రాక్షసి వలన భర్త  ప్రక్కనే ఉన్నా పట్టించుకోలేని దుస్తితి. ఆ కొత్త రాక్షసి పేరే "ఇంటర్నెట్ ఆనందం".

   ఇంటర్నెట్ వినియోగం లాప్ టాప్ లు, స్మార్ట్ పోన్ ల వలన ఎక్కువైంది. అపరచిత పరిచయాలు, పోర్న్ సైట్లు, చాటింగ్ లు వీటికి ఎక్కువుగా యువత ఆకర్షింపబడం వలన పొద్దస్తమానం అదే యావ లో పడి అటు  తమ ఆరోగ్యాలనే కాక , జీవిత బాగాస్వాములను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. స్త్రీ పురుషుల మద్య కేవలం మొక్కుబడి తంతులు కాకుండా , ఇద్దరి మద్య ఉండే ప్రేమ ఆకర్షణలు , ఇతర మాటా మంచి అన్నీ వారి సంసార బందం  పటిష్టతకు దోహదం చేస్తుంటాయి. కానీ చేతిలో స్మార్ట్ పోన్ తో ఎప్పుడూ కొత్త పరిచయాల కోసం వెంపర్లాడే మగాడికి ఇంటిలో తనకోసం ఆరాట పడుతున్న అర్దాంగి మనసు ఎలా తెలుస్తుంది? బయటకు చూసే వారికి ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారుగా , అని అనిపిస్తుంది. కానీ ఒకే ఇంటిలో  వేర్వేరు ఆలోచన లతో ఉండే దంపతుల మద్య సంసార బందం ఎలా సాద్యం? మారి పోయిన జీవన పరిస్తితుల వలన ఒత్తిడి కి గురి అయి నలబై యేండ్లు రాక మునుపే లైంగిక సమస్యలు రావడం మొదలెడుతున్నాయి. దానికి డాక్టర్లు , మందులు ఏవో తీసుకుంటూ అన్నీ ఆరోగ్య సమస్యల మాదిరి అవికూడా  మన జీవన శైలిలో బాగంగా బరిస్తూ వస్తున్నారు. కానీ , కావాలని కోరి ఈ  ఇంటర్నెట్ మాయా మోహినీ వలలో పడి చేజేతులారా సంసార జీవితాలను నాశనం చేసుకోవడం వివేక వంతుల లక్షణం కాదు. రెడ్ లైట్ ఏరియాలో తిరిగే వారి కంటే అద మాదములు ఇంటర్నెట్ ఆనందాలకు అలవాటు పడిన వారు.

   ఈ  మద్య కొన్ని సైట్లు "బోర్ కొడుతున్న హౌజ్ వైవ్స్"  అనే పేరుతో తమ ప్రేక్షకులు ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటికి ఆకర్షితమయ్యే మగవారు కానీ, లేక ఇంటర్నేట్లో పరిచయాల కోసం ఇంటి ఇల్లాళ్ళ ను నిర్లక్ష్యం చేసే వారు కానీ , ఏదో ఒక నాడు తమ వారు అటువంటి సైటులను చూడటానికి అలవాటు పడితే పరిస్తితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. భారతీయ కుటుంభ వ్యవస్తను బలహీన పరుస్తున్నా ఇటువంటి సైట్లను తక్షణం నిషేదించవలసిన అవసరం ఎంతైనా  ఉంది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన ఐ నీచ సైట్లను నిషేదీమ్చడానికి దమ్మున్న వారే  అధికార  పగ్గాలు చే పట్టాల్సి ఉంది. అంతే కానీ గే , లెస్బియన్ కల్చర్ ని ప్రోత్సాహించే దిక్కుమాలిన రాజకీయాలు వల్ల  ఇది సాద్యం కాక పోవచ్చు.

                                               (19/12/2013 Post Republished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం