అత్త మీద కోపం , జిల్లా జడ్జ్ మీద చూపించిన రాకాసి కోడలు !

                                                                     




                                        అత్తమీద కోపం దుత్త మిద చూపింద ని మనకొక సామెత ఉంది . పూర్వం ఇండ్లలో అన్నింటికీ మట్టి పాత్రలే వాడేవారు . వెనుకటి కుటుంబాలు అన్ని ఉమ్మడి కుటుంబాలే కాబట్టి , సాదారణంగా అత్తల పెత్తనమే ఇండ్లలో కొనసాగేది . కోడళ్ళు కాపురాలు చేయడం వరకే కొడుకులు తో పని. మిగతా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా అత్తల చేతిలో ఉంటుంది . అటువంటి కంట్రోల్ కోడలికి రావాలంటే ఆమె అత్త గా మారిన తర్వాతే అది సాద్యం . అలా మన కుటుంభ వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టి వ్యవస్థ లాగా ఒక క్రమ విదానం కలిగి ఉండేది . మరి అలాంటి కుటుంబాలలో అత్తల మిద కోడళ్ళకు కొన్ని సందర్బాలలో కోపం రావడం అనేది సహజంగానే జరుగుతుంటుంది . అలా వచ్చిన కోపాన్ని డైరెక్టుగా అత్తల మిద చూపించే స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోడళ్ళకు లేవు గనుక తమ చేతిలో ఉన్న' దుత్తలూ' అంటే మట్టి కడవ మిద చూపించే వారట ! అంటే అత్తగారు తిట్టగానే , కోడలు గారు చేతిలో మట్టి కడవని  విసిరి నేలకేసి కొట్టి పగుల గొట్టే వారు అట ! అప్కోర్స్ , ఆ పనికి కూడా అత్తలు చేత తిట్లు , తన్నులు తప్పవు అనుకోండి ! ఇదంతా ఎందుకు ప్రస్తావిo చాల్సి వచ్చిందంటే , మొన్న పాట్నా సివిల్ కోర్టులో ఒక కోడలు చేసిన పనిని గురించి పేపర్లో చదివాక , అత్తల పెత్తనం ని ఆధునిక చట్టాలు కంట్రోల్ చేయగలిగినా , కోడళ్ళ కోపాలను మాత్రం కంట్రోల్ చేయలేక పోతున్నాయి అని అనిపిస్తుంది కాబట్టి . వివరాలు లోకి వెళితే ,

      సోనే పూర్ కి చెందిన రీటా సింగ్ అనే కోడలు ఆస్తి గొడవల విషయం లో తన , అత్త మామలు మిద కేసు పెట్టిందట . గృహ హింస కేసుల్లో , వరకట్నం కేసుల్లో నూటికి 95% కేసులు తప్పుడు కేసులుగా తేలుతుండడం , మంది మాటలు విని ఆడపిల్లలు అవసరమైనా కాకున్నా , భర్తలతో పాటు అతని కుటుంభ సబ్యులను కేసులలో ఇరికించడం  లాంటి చట్ట వ్యతిరేక కార్య కలాపాలు ఎక్కువ కావడం గమనించిన సుప్రీం కోర్టు వారు భర్త తరపు బందువులకు బెయిల్ మంజూర్ విషయం లో ఉదారంగా వ్యవరిo చాలని  చెప్పిన తీర్పులు ఆదారంగా , దిగువ కోర్టులు భర్త తరపు వారికి బెయిల్లు మంజూరు చేస్తున్నాయి .అంతే కాకుండా ఆస్తి తగాదాలు పూర్తిగా సివిల్ స్వబావం కలవి కాబట్టి , అటువంటి కేసుల్లో సహితం బెయిల్ రావడం సులబతరం అవుతుంది . అలా రితాసింగ్ అత్తా మామలు బెయిల్ తీసుకుని  ఇంట్లో ఉండడం సహించలేని కోడలు , వారి బెయిల్ ను రద్దు చేయస్వలసినదిగా జిల్లా కోర్టుకు అప్పీల్ చేయగా ,ఆమె పెటిషన్ పై విచారణ జరపిన జిల్లా జడ్జ్ గారు అందులో పస లేదని కొట్టివేసారట ! అప్పట్టికే , ఎలాగైనా తన అత్తా మామలని లోపల వేయించాలని తహ తహ లాడుతూ , వారం  రోజులు వరుసగా కోర్టుకు వస్తున్న  రీటా సింగ్ కు జడ్జ్ గారి తీర్పు వినగానే అరికాలి మంట నేట్టికేక్కిందట ! అంతే ! చేతిలో ఉన్న సెల్ పోన్ ని కోపంగా జడ్జ్ గారి మీదకు విసిరిందట ! అది వెళ్లి జడ్జ్ గారి ముందు ఉన్న బల్ల మిద పడితే , జడ్జ్ గారు స్టన్ అయిపోయారట .

       అ తర్వాత పోలీసులు ఆమె మిద కేసు పెట్టి సంబదిత మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారట ! అది విషయం .

                                                    (11/5/2014 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!