మన రాష్ట్రంలో కారల్ మార్క్స్ చెప్పింది జరగకపోయినా, కాలజ్గానం లో చెప్పింది జరుగబోతుందా?
ప్రపంచంలో ఆర్థికవాద పరిణామ కాలజ్ణానం చెప్పినవారు మార్క్స్ పండితుడు. సరే దాని మీద బిన్నాభిప్రాయాలున్నా, ఆయన చెప్పింది జరగటానికి కొన్ని వందల(వేలు కూడ కావచ్చు) సంవత్సరాలు పట్టెట్టట్లుంది కాబట్టి, ఆయన చెప్పిన కమ్మునిజం మనకు చూసే బాగ్యం లేదు. కాని ఎప్పుడో మన రాష్ట్రంలో పుట్టిన మహాను బావుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ణానం లోని " కలికాలం లో జరగబోయే వింతలు" జరుగుతున్నాయి అనిపిస్తుంది. ఎలాగంటారా! బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో 2 వాక్యాలు ’"గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు"," బర్రెలను తినువారు వస్తారయా". దీనిని విశ్లేషించిన పండితులు " తక్కువుగా దోపిడి చేసే పాలకులు పోయి, ఎక్కువుగా దోపిడి చేసే వారు వస్తారు" అని అర్థం అన...