ముగ్గురూ అమ్మాయిలనే ఎందుకు చంపాడు ? ఆ పై తను ఎందుకు మాయం అయ్యాడు ?
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వింటున్నా నిజంగా వేలాది సంవత్సరాల మానవ ప్రస్తానం ఎటువైపు వెళుతుంది ? మానవత్వం వైపా ? దానవత్వం వైపా అనిపిస్తుంది . నిన్న నిజామాబాద్ నగర శివారులలొ జరిగిన ఈ ఘోరం చూస్తుంటే మనుషుల్లో దానవత్వం ఎంతగా ప్రభలి పోయిందో అర్ధమవుతుంది . అమాయకమైన , ముగ్ద మోహనంగా ఉండే ఆ చిన్నారులను , కర్కశంగా పెట్రోల్ పోసి కాల్చి చంపింది ఒక మనిషి అంటే నమ్మ బుద్ది కావటం లేదు . నిందితుడు ఆ పిల్లల్ని ఎప్పుడూ ఆడించే వాళ్ళ బాబాయ్ అంటే అసలు నమ్మబుద్ది కావటం లేదు . కాని జరిగిన ఘోరం వెనుక ఉన్న కారణాలు పరిసిలిస్తుoటే మీడియాలో వస్తున్న కధనాలు కూడా అనుమానం రేకెత్తిoచేవిగా ఉన్నాయి . అవేమిటో చూదాం . నిజామాబాద్ జిల్లా , రెంజల్ మండలం , భూపల్లి లోని రఘుపతి రెడ్డి గారికి 3 గురు కుమారులు. వారితో పాటు తన వదిన కుమారుడును తనే పెంచి పెద్ద చేసాడు . అత...