కత్తితో అత్తను బెదిరించి తన కోరికను నెరవేర్చుకున్న కోడలు !.
ఈ సంఘటణ గురించి మొదటసారి విన్నపుడు "కాలం మారింది" అనే సినిమా టైటిల్ గుర్తుకు వచ్చింది. కిరసనాయిల్లతో కోడళ్ళను కాల్చుకు తినే కాలం పోయి , కత్తులతో అత్తలను బెదిరించి తమ కోరికలు తీర్చుకునే కోడళ్ళ కాలం వచ్చింది అనిపించింది . ఆవిడగారిది విజయవాడ. తనకు ఇద్దరు మగపిల్లలు. పిల్లలు చిన్నతనం లోనే ఉండగానే ఆక్సిదెంట్లో భర్త చని పోయాడు. అయన పోయిన తర్వాత అయన గారు చేస్తున్న సోడాల వ్యాపారం ని తానే నిర్వహిస్తూ, ఆ పిల్లలకు తల్లీ, తండ్రి తానే అయి వారిని పెంచి పోషించి, వారికి విద్యాబుద్దులు చెప్పించింది. పెద్ద పిల్లవాడు డిగ్రీ పూర్తీ కాగానే ఒక షాపింగ్ మాల్ లో ఉద్యోగం సంపాదించి, తల్లికి కుటుంబ నిర్వహణలో సహాయం చేసే స్తాయికి ఎదిగాడు. ఇక చిన్న పిల్ల వాడు చదువుతున్నాడు. ...