కత్తితో అత్తను బెదిరించి తన కోరికను నెరవేర్చుకున్న కోడలు !.
ఈ సంఘటణ గురించి మొదటసారి విన్నపుడు "కాలం మారింది" అనే సినిమా టైటిల్ గుర్తుకు వచ్చింది. కిరసనాయిల్లతో కోడళ్ళను కాల్చుకు తినే కాలం పోయి , కత్తులతో అత్తలను బెదిరించి తమ కోరికలు తీర్చుకునే కోడళ్ళ కాలం వచ్చింది అనిపించింది .
ఆవిడగారిది విజయవాడ. తనకు ఇద్దరు మగపిల్లలు. పిల్లలు చిన్నతనం లోనే ఉండగానే ఆక్సిదెంట్లో భర్త చని పోయాడు. అయన పోయిన తర్వాత అయన గారు చేస్తున్న సోడాల వ్యాపారం ని తానే నిర్వహిస్తూ, ఆ పిల్లలకు తల్లీ, తండ్రి తానే అయి వారిని పెంచి పోషించి, వారికి విద్యాబుద్దులు చెప్పించింది. పెద్ద పిల్లవాడు డిగ్రీ పూర్తీ కాగానే ఒక షాపింగ్ మాల్ లో ఉద్యోగం సంపాదించి, తల్లికి కుటుంబ నిర్వహణలో సహాయం చేసే స్తాయికి ఎదిగాడు. ఇక చిన్న పిల్ల వాడు చదువుతున్నాడు.
ఒక రోజు ఆవిడగారు , సోడాల షాప్ నుంచి ఇంటికి వచ్చే సరికి, తన ఇంట్లో పెద్దకొడుకు , ఎవరో అమ్మాయితో పెండ్లి బట్టల వస్త్రదారణతో కనిపించేసరికి విషయం అర్దం కాక, తెల్లబోయి అయోమయంగా చూసింది ఆ పిచ్చి తల్లి. ఆమె తేరుకున్నాక అసలు విషయం చెప్పాడు సుపుత్రుడు. ఆ అమ్మాయి తనతో షాపింగ్ మాల్ లో పని చేస్తుందట! వారి పరిచయం చిన్న చిన్నగా "లవ్ ఇన్ షాపింగ్ మాల్ " కి దారి తీసిందట. ఆ అమ్మాయి అగ్రవర్ణాల అమ్మాయి, ఈ కుర్రాడు కాస్త కులం లో వెనుకబడినా , ప్రేమ లో మాత్రంఆమెలోని "అగ్రవర్ణం" ని జయించగలిగాడు. అలా వారి ప్రేమ సాగుతూ ఆ షాప్ ఓనర్ కి తెలిసి చేసుకుంటే పెండ్లి చేసుకుని ఏడవండి, లేకుంటే ఇంకే షాప్లోనైనా ఏడవండి అనేసరికి, వారు ఇక తప్పని సరి అయి పెండ్లి చేసుకుని రావటం జరిగింది ,అని ఆ కొడుకు నమ్మ బలికితే, చేసేదేమీ లేక మనసులో బాదను దిగ మింగుకుని వారిద్దరిని ఆస్వీర్వదించి తన ఇంట్లోకి కొత్త కోడలను ఆహ్వానించింది.
అలా ఒక సంవత్సరం గడచింది.. ఆ అబ్బాయికి ఉద్యోగం లో ప్రమోషన్ ఇచ్చి, జీతం ముప్పై వేలు చేసారు. దానికి తల్లి ఎంతగానో సంతోషించింది. ఇంకొక రెండేళ్ళు చదివితే చిన్నకొడుకు డిగ్రీ పూర్తీ అవుతుంది. ఆ తర్వాత అతనూ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే అతనికి అయినా తన చేతుల మిద పెండ్లి చేసి తల్లిగా తన బాద్యతతీర్చ్కుందామనుకుంది. కానీ మనిషి తలచిందే జరిగితే "విది రాత" అనే దానికి అర్దం ఏముంటుంది. కొడుకుకు జీతం పెరిగిన దగ్గరనుండి కోడలు ప్రవర్తన లో మార్పు రావడం గమనించింది అత్తగారు. చీటికి మాటికి , చిన్న విషయానికి అయినా సరే తన తో , తన చిన్న కొడుకుతో గొడవపడుతున్న కోడలు ని చూసి ఆమెకు విషయం అర్దం కాక ఎంతో ఓపిక వహించినా రానూ రానూ ఇంట్లో గొడవలు ఎక్కువ అవసాగాయి. దీని కొడుకు కూడా అటు తల్లి మీద విసుక్కోవడం మొదలు పెట్టాడు. ఇది ఇలాగే సాగితే అది కుటుంబ సఖ్యతకు ప్రమాదం అని బావించిన ఆవిడ గారు ఒక రోజు కొడుకు ముందే కోడలని అసలు తన మనసులో ఏముందో చెప్పాలని నిలదీసింది. అంతే! ఒక్క సరిగా కోడలు బోరున ఏడుస్తూ , ఇంట్లో కత్తి ఒకటి తీసుకుని వచ్చి తను పొడుచుకుని చస్తానని బెదిరించేసరికి , అత్త, భర్త, మరిది ముగ్గురూ నిశ్చేష్టుల్లై పోయారు. వారు ఆమెను బ్రతిమాలి ఎలాగో ఆమెను శాంతింప చేసారు.
ఆ దెబ్బతో తన కత్తి ప్లాన్ బాగా వర్కువుట్ అయిందని బావించిన కోడలు మాట్లాడితే కత్తి చూపించి పొడుచుకు చస్తానని బెదిరించి , ఆ తర్వాత చట్ట రీత్యా జరిగే పరిణామాలను వారికి చెపుతూ వారెవ్వరికి మనశాంతి లేకుండా చేసింది. ఆ తర్వాత భర్తను కూడా రాచి రంపాన పెట్టి , వేరు కాపురం పెట్టక పొతే పొడుచుకు చస్తాను అని , ఆ కుటుంబంను దిక్కు లేని కుటుంబం లా చేసి, పెద్ద కొడుకును వేరు కాపురానికి తీసుకువెల్లింది కోడలు. కొడుకు తానూ సంపాదిస్తునాడు కదాని తల్లిని సోడా లు వ్యాపారం మాన్పించి అది అద్దెకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోడలు చేసిన పనికి ఆ కుటుంబ పరిస్తితి అగమ్య గోచరంగా మారింది. పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లి , రెండేళ్ళు ప్రేమించి పెండ్లి చేసుకున్న కోడలు ముందు ఎందుకు పనికి రానిదయింది. కారణం ఈ దేశం లో తల్లి డిపెండెంట్ అయితే కోడలు కమాండెంట్. భర్త సంపాదనలో బాగానికే తప్పా , అతని బాధ్యతలలో ఏ మాత్రం ఆవిడకు సంబందం ఉండదు. పాతికేళ్ళు కుటుంబ సంపాదన తో చదవి ఉద్యోగం సంపాదించి , స్వార్దంతో తన దారి తానూ చూసుకుంటే , మిగతా కుటుంభ సభ్యలకు అతని జవాబుదారి తనాన్ని ప్రశ్నించడనికి ఈ దేశ చట్ట బలం చాలదు. కానీ ఒక్క తాళి బొట్టు కడితే చాలు, అదే వాడి మెడకు ఉరి తాడు చేసి , తన చెప్పుచేతుల్లో పెట్టుకోవటానికి భార్యకు పుల్ పవర్స్ ఇచ్చింది చట్టం. అందుకే పై ఉదంతం లో కోడలు డ్రామాలు ఆడి మొగుణ్ణి వేరు కాపురం పెట్టించ గలిగింది.
కుటుంబం అంటే బార్య భర్తలే కాదు. పిల్లలు , వృద్దులు , అవివాహితలు,వికలాంగ సభ్యులు, బాద్యతలు, బందాలు ,వంశ పారం పర్యత ఇలా ఎన్నో ఉంటాయి. ఇవ్వన్నీ ప్రక్కన పెట్టి , కేవలం ఆ ఇంటికి పెండ్లి పేరుతొ వచ్చిన ఒక సబ్యురాలి సంక్షేమమే ముఖ్యం , తక్కిన కుటుంబం ఎటూ చస్తే ఎవరికేమీటి ? అనే చందాన ఉన్న గృహ హింస చట్టాలును మార్చి "సమగ్ర భారతీయ కుటుంబ పరిరక్షణ చట్టం" తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అతి త్వరలోనే కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవటం ఖాయం . రాజ్యం కంటే బలమైనది కుటుంబం. అందుకే వందలాది సంవత్సరాలు విదేశి పాలనలో మన రాజ్యం ఉన్నా , వారు ఎప్పుడూ మన కుటుంబ వ్యవస్తలో కలుగ చేసుకోలేదు కాబట్టి మన కుటుంబం ఇంకా జీవించి దాని విశిష్టతను కాపాడుకుని , జాతికి వీరులను అందించింది. కానీ స్వతంత్రం వచ్చాకే కుటుంబం స్వాతంత్ర్యం కోల్పోవటం ప్రారంబించింమ్ది. దీనికి కారణం వ్యక్తీ రక్షణ పేరుతో కుటుంబ విచ్చిన్నానికి దోహద పడే చట్ట రూపకల్పనలే అని చెప్పక తప్పదు. వాటి మీద పునసమీఖ్శ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
excellent andi. Yes we do agree family should be strong than the country.
ReplyDeleteThank you bhanumurty garu.
Delete