అక్కను చేసుకుందామంటే లేచి పోయింది! పొనీలే,అని చెల్లెల్ని చేసుకుంటే ఏకంగా లేపేసింది!

                                                                       

                                                                

                                ఆడదానికైనా, మగవాడి కైనా కట్టుబాట్లు లేకుంటే ఎంతకు తెగిస్తారో తెలియ చేసే ఉదంతం ఇది. సాక్షాత్తు తాళి కట్టిన మొగుడ్ని దైవదర్శనానికి అని చెప్పి తీసుకు వెల్లి, దైవ దర్శనం అనంతరం, తన ప్రియుడ్ని ఉసిగొల్పి ఏకంగా మొగుడ్ని ఆ దేవుడు దగ్గరకే పంపించిన  "సతీ సౌజన్య" గాదా! అధునికులకు,  పతి ప్రాణాల కోసం యముడితో పోరాడిన "సతీ సావిత్రీ" కదలు అంటే ఒళ్ళు మంట!ఎందుకంటే నేటి స్త్రీల బానిస దుస్తితికి సావిత్రీ లాంటి వారే కారణం  అని "స్త్రీ వాదుల" ద్రుడాభిప్రాయం. అయితే మితిమీరిన స్వేచ్చ స్త్రీలను సైతం ఎంత ఘోరానికి తలపడేలా చేస్తుందో "సతీ సౌజన్య" గాద ద్వారా మనం తెలిసికోవచ్చు.

  ఆ అబ్బాయి పేరు వెంకటేశ్వర రావు.అతను R.T.C.    లో డిసిల్ మెకానికి. అతను పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. అతని ఖర్మ కాలీ ఒక సంబందం కుదిరింది. అమ్మాయి పేరు శ్వేత. అయితే వెంకటేశ్వర రావుని పెండ్లి చేసుకోవటం శ్వేత కి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెకు అప్పటికే ఎవరితోనో లవ్ ఎఫైర్ ఉన్నట్లుంది. అది తల్లి తండ్రులకు తెలుసో తెలియదో ఆ దేవుడికి ఎరుక.కానీ  పెండ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలన్నా సాంప్రదాయ సూత్రాన్ని పట్టించుకో పోయినా కనీసం చేసుకో బోయే వారి గురించి అయినా ఎంక్వైరీ చేసినట్లు లేదు వెంకటేశ్వర రావు తరపువారు. అందుకే ఇంకా పెండ్లి రెండు రోజులు ఉందనగా శ్వేత " జంప్" అయింది. ఇది అవమానంగా బావించిన శ్వేత తల్లి తండ్రులు వెంకటేశ్వర రావు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలారట. తమ చిన్న కూతురు సౌజన్య B.Tech   చదవి బెంగళూర్లో ఉద్యోగం చేస్తుందని, ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తామని అంటే వెంకటేశ్వర రావు లోని డిసెల్ మెకానిక్ పొంగిపోయినట్లుంది, ఇంజనీర్ బార్య దొరుకుతున్నందుకు. సరే అన్నాడట. సొజన్యను పిలిచి అడిగితే ఆమే మొదట ఒప్పుకోక పోయినా తల్లి తండ్రుల కోసం ఒప్పుకుందట!

  ఇక్కడ సౌజన్య కూడా జైదీప్ అనే కుర్రాడ్ని చాలా యేండ్లుగా ప్రేమిస్తుందట. కానీ అక్క లో ఉన్న నిజాయితీ ఆ అమ్మాయిలో లేదనుకుంటా, తన ప్రేమను దాచిపెట్టి వెంకటేశ్వర రావు ని పెండ్లాడింది. ఆ అమ్మాయికి బెంగలూర్లో ఉద్యోగం కాబట్టి,ఆమె బెంగళూర్లో, వెంకటేశ్వర రావు హైద్రాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటూ వారం వారం సౌజన్య హైద్రాబాద్ వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే సౌజన్య ప్రేమించిన జైదీప్ కూడా సౌజన్యతో పాటే బెంగళూర్లో నే ఉద్యోగం చేస్తుండటం వలన సౌజన్య పెండ్లి ఆరి ప్రేమాయణానికి అడ్డు కాలేక పోయింది. కానీ అలా జీవితాంతం ప్రేమికులుగా ఉండటం కొంత కష్టం గా బావించి ఇద్దరూ లీగల్ గా ఒకటవాలనుకున్నారు. కానీ దీనికి వెంకటేశ్వర రావు అడ్డంకే కాక సౌజన్య తల్లితండ్రుల పరువు కూడా సమస్యే  కాబట్టి అతన్ని లేపేయ్యడం ఒకటే మార్గం అనుకున్నారు. అందుకు ముహుర్తం నిర్ణయించుకుని సౌజన్య, జైదీప్ బెంగళూర్ నుంచి హైద్రాబాద్ కి వచ్చారు.

  మొన్న అంటే సెప్టాంబర్ పద్నాలుగున, సౌజన్య భర్తను గుడి కని బయలు దేర దీసింది. ఇద్దరూ నాచారం లోని శ్రీ వేంకటేశ్వర స్వామీ వారిని దర్శించి, తిరుగు ప్రయాణమయ్యారు. కొంతదూరం వచ్చాక మూత్ర విసర్జన కోసమని బండి ఆపమంది. మర్మం తెలియని వెంకటేశ్వర రావు కొంచం రోడ్డు లోపలికి తీసుకు వెళ్ళి ఆపాడు.అప్పటికే సౌజన్య ద్వారా మెసేజ్ అందుకున్న జైదీప్, అతని స్నేహితుడు ముసుగులు దరించి వచ్చి వెంకటేశ్వర రావు మీద కత్తితో దాడి చెయ్యగా, సౌజన్య కూడా సహకరించిందట. ఆ తర్వాత పోలిసులు ను తప్పు  దారీ
పట్టించేందుకు సౌజన్య చేతీ మీద కూడ రెండు గాట్లు పెట్టాడు జైదీప్. తన గొలుసును జైదీప్ కి ఇచ్చి పంపించి, రోడ్డు మీదకు వచ్చి వగలాడి ఏడ్పులు ఏడుస్తుంటే బాటసారులు పోలిసులకు తెలియ చేస్తే వారు వచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

  ఈ కేసు గురించి మొదటి రోజు పేపర్లోవచ్చినప్పుడే నాకు ఎందుకో ఆ అమ్మాయి ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ కేసులో మాన బంగం లేదు, భర్తని క్రూరంగా చంపారు, బార్యకి రెండు గాట్లు మాత్రమే పెట్టబడినవి. కేవలం నగల కోసం భర్తని చంపాల్సిన అవసరం ఉందా?అని  అనిపించింది.నా అనుమానం నిజమే అన్నట్లు పోలిసు వారు వారం రోజుల్లో అమ్మాయి క్రూర చరిత్రను వెల్లడి చేసారు. ఈ విషయంలో సౌజన్యను పట్టించింది ఆ వేంకటేశ్వర స్వామియే!ఎలాగంటే స్వామీ వారి గుడి సి.సి కెమేరా పుటేజ్ లు పరిశిలించిన పోలిసులకు ఆమె ప్రవర్తన అనుమానస్పదం అనిపించి తీగ లాగితే దోంక కదిలింది. చివరకు నిందితులు పట్టుబడక తప్పలేదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనటానికి కూడా ఈ కేసు ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు!

 ఒక రిపోర్ట్ ప్రకారం వివాహేతర సంబంద హత్యలలో మన రాష్ట్రమే మొదటి రాంక్ సాదించిదట! దీనికి స్త్రీ పురుష బేదం లేకుండా ఇద్దరూ బాగస్వామూలే. తల్లితండ్రులు ఇస్తున్న స్వేచ్చ ను దుర్వినీయోగం చేస్తూ సమాజం లోని దుర్నడతల వైపు ఆకర్షితులవుతున్న నేటి యువత విదానాల వల్లా భారతీయ కుటుంభ వ్యవస్త చిన్నా బిన్నమవుతుంది. ఆంద్ర ప్రదేశ్ లో కూడా నూటికి పదహారు శాతం హత్య కేసులు వైవాహేతర సంబందాల మూలంగనే జరుగుతున్నాయి అంటే విషయం నిర్లక్ష్య పరచదగినది కాదు అని అర్దమవుతుంది.కట్టుకున్న భార్యలను అనుమానంతో కడతేర్చే భర్తలే కాదు,ప్రియుడి మోజులో కట్టుకున్న మొగుడ్ని కూడా చంపే సౌజన్యలూ ఎక్కువౌతున్నారని తెలిసికోవడం మంచిది. దీనికి ప్రదాన కారణం సమాజ కట్టుబాట్లను లెఖ్క చేయని మనస్తత్వం యువతలో అభివ్రుద్ది చెందడమే. "సతీ సావిత్రీ" "సతీ సుమతి" లాంటి గాదలు చదవకపోతే చదవక పోయారు, కనీసం ఈ "సతీ సౌజన్య" లాంటి ఉదంతాలు చదివి ఏమి చేయ్యాలో, ఏం చెయ్యకూడదో అటు తల్లితండ్రులు, ఇటు పెండ్లి చేసుకోవాలనే యువత ఆలోచించుకుంటే మంచిది.

  నిన్న కేంద్రం వారు జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం మర్డర్లు, మాన భంగాలు చేసే వారికి అసెంబ్లీ, పార్లమెంట్లో కూర్చునే అధికారముంటుందేమో కానీ సామాన్య భారతీయ ఇండ్లలో మాత్రం వారికి స్తానం ఉండరాదు అని మనం  ఒక తీర్మానం చేసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది. 

                                      (Republished Post. OPD 25/9/2013).             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!