ఫేస్ బుక్ కుర్రాడ్ని పెండ్లాడితే ఫేస్ అంతా బ్లేడ్ తో ముద్దులు పెట్టాడట!.
మన వివాహరీతులు మారిపోతున్నాయి. సాంప్రాదాయ పద్దతి ప్రకారం పెంద్లికి ముందే వదూ వరుల కుటుంభ పెద్దల్లు ఆటు ఏదు తరాలు, ఇటుఏడు తరాలు చూడాలనే పాత పద్దతిలో కాకపోయిన వ్యక్తిగతంగా పిల్ల లేక పిల్ల వాడు ఎటువంటి వారుఅనే వాటితో పాటు పిల్లా, పిల్లవాడి కుటుంభాలు ఎటువంటివి? వారికి సమాజంలో, బందువులలో ఎటువంటి పేరు ఉంది?సౌమ్యులా? తగాదాల మారి కుటుంబాలా? అనే వాటిని కూలం కషంగా ఎంక్వైరీ చేసిం తర్వాతే వివాహాలు కుదుర్చుకుంటారు. వ్యక్తిగత స్వేచ్చ పేరుతో విపరీత దోరణులు అవలంభిస్తున్న నేటి యువతరం నైజం చూస్తుంటే పూర్వ కాలం వారి కంటే , ఈ కాలం వారే పెండ్లి సంబందాలు విషయం లో ఎక్కువ జాగర్తలు తీసుకోవాలనిపిస్తుంది.
ఈ మద్య కుర్ర కారు సామాజిక వెబ్సైట్లైన ఫేస్ బుక్ లాంటి సైట్ లలో పరిచయాలు పెంచుకోవటానికి తహ తహ లాడుతున్నారు. కొంత మందయితే ఆ పరిచయాలనే ప్రణయంగా మార్చుకుని పరిణయం దాక వెళుతున్నారు. వదూవరుల సమాచారం కొరకు ఫేస్ బుక్ లను ఉపయొగిస్తే తప్పు లేదు, కాని అందులో ఉన్న సమాచారం నిజమో కాదో తెలుసుకోకుండా, ఇతరత్రా విచారణలు చేయ కుండా ఎర్రగా, బుర్రగా , ఉన్నాడని పెండ్లాడితే బ్లేడ్ పెట్టి కోయించుకోవటమే అవుతుందనదానికి రుజువు ముంబాయి లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ.
అబ్బాయి పేరు బజ్జూ అక్భర్ బాద్షా అట. ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ చేసాడు. అతనిది ముంబాయి. అదే ఫేస్ బుక్లో ఒక అందమయిన అమ్మాయి ఖాతా ఉంటే పరిచయం చేసుకున్నాడట!. తాను పెద్ద వ్యాపారస్తుడిని అని చెప్పాడట. అబ్బాయికి, అమ్మాయికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైన పరిచయం, మార్చికి ప్రేమ మొగ్గ తొడిగి,ఏప్రిల్ కి వికసించిదంట! ఇంకేముంది జాం జామ్ అని మే నెలలో ప్రేమ వివాహం ఆడారు. లైసెన్స్ వచ్చింది కాబట్టి అన్నింటిని అనుభవించేసారు. ఈ విదం గా నెల గడిచేసరికి అబ్బాయిలోని అసలు మగాడు భయట పడ్డాడు. అమ్మాయిని తన మతం తీసుకోమన్నాడట. ఆమె కుదరదు అందట.అంతే అప్పటి దాక ముద్దులు పెట్టిన మొగుడు గుద్దులు గుద్దటం మొదలెట్టాడట! దానితో దిమ్మ తిరిగి పోయిన అమ్మాయి పోలిస్ స్టేషన్లో కేసు పెట్టి తను వేరుగా వెళ్ళి పోయిందట.
దానితో చిర్రెత్తుకొచ్చిన బాద్షా ఆ ఆమ్మాయిని ఒంటరిగా ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి గదిలో పెట్టి భందించి ముఖం అంతా బ్లేడ్ తో కోసేసాడట!అలా ముఖం మీద ఒంటి మీద సుమారు వంద గాట్లు దాఖ పెట్టాడట! చివరకు పది రోజుల తర్వాత ఎలాగో తప్పించుకున్న అమ్మాయీ పోలిసులను ఆస్రయిస్తే, వారు అబ్బాయి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారట. అదీ కథ!చూసారా ఫేస్ బుక్ లో ఫేస్ చూసి వెనుకా ముందూ తెలుసుకోకుండా పెండ్లాడిటే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి. అందుకే వివాహానికి పూర్వం అన్ని ఎంక్వైరీ లూ చేసుకోవటం మంచిది. చేసుకున్నాక కూడ అనర్దాలు జరిగితే అది మన చేతులో లేనిది అనుకోవచ్చు. కానీ మన ప్రయత్న లోపం మాత్రం ఉండరాదు.
(Republished post OPD:15/7/2013).
Beautiful post
ReplyDeletethank you Ramananda Garu!
Delete
ReplyDeleteజూసెను జిలేబి నాతని
ఫేసును ! బుక్కయ్యెనోయి ప్రేమలు పండెన్ !
హాసిని మతమును మార్చన
కోసెను ముఖమును జులాయి కోరలు జాచెన్ !
ధన్యవాదాలు జిలేబీ గారు!.
Delete
ReplyDeleteBest blog
BEST TELUGU BLOG
ReplyDeleteThank you "r"
Delete