అతను ఎన్నో ఎత్తులు ఎక్కడానికి , మరెన్నో విజయాలు సాధించడానికి సహకరిస్తున్న "ఆమె" సాటి మహిళకు మాత్రం శత్రువు ఎందుకు అవుతుంది ?

మనిషి జన్మకు కారకురాలైన , మనుగడకు ఆధారమైన ,మనిషిలో సగమైన, మానవ సమాజాభివ్రుద్దికి తమ జీవితాలు త్యాగం చేస్తున్న ఎందరో మరెందరో మహిళా మణులకు "అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు. మొన్నీ మద్య ఒక పేరొందిన తెలుగు సినిమా నటుడు, ప్రస్తుతం అంద్రప్రదేశ్ లోని ఒక నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న వ్యక్తీ , "సావిత్రి " అనే సినిమా పంక్షన్ సందర్బంగా అన్న డైలాగ్ అనేక విమర్శలకు గురిఅవుతూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. అయన గారు అన్న డైలాగు ఏమిటంటె "నేను ఎన్నో ఎత్తులు ఎక్కాను, మరెన్నో లోతులు చూసాను" అని తన రొమాంటిక్ హిరో లైఫ్ గురించి చెప్పి తన అభిమానులను ఉత్తేజపరచాడు. అయ...