గణేశ నిమజ్జనమా? సర్వ దేవతా నిమజ్జనమా?
ఈ రోజుతో గణపతి నవ రాత్రులు ముగిసి నిమజ్జనంతో వేడుకలు పూర్తి చేసారు. మన హీందు మతంలో పూజలు చెయ్యటానికి ఒక పద్దతి ఉంది. దేవుళ్లను నమ్మనివారు పూజలు చెయ్యడమనే ప్రసక్తి ఉండదు. కాని నమ్మేవారు ఖచ్చితంగా ఆ పద్దతులు పాటించి తీరాలి. లేదు మా ఇష్టం మాది అంటే దైవాగ్రహానికి గురి కాక తప్పదు. అసలు కొంతమంది చేస్తుంది గణేశ నిమ్మజ్జనమా? సర్వదేవతా నిమజ్జనమో అర్థం కావటం లేదు. ఒక సారి మీరు టి.వి.లలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం అవుతున్న ప్రతిమలను పర్సీలించండి. గణేశునితో పాటు, శివ పార్వతులు,కుమారస్వామి,సాయిబాబ,క్రిష్ణుడు, ఇంకా అనేక మంది దేవతలను నిమజ్జనం చెస్తుంటే ఈ మతాచార్యులు,పీటాదిపతులు,పెద్దలు ఏం చేస్తున్నారు? పిల్లలు తప్పులు చేస్తుంటే వారించాల్సిన బాద్యత వీరి మీద లేదా? అసలు గణెశ నవరాత్రులు వీదుల్లో జరిపేటప్పుడు గణపతిని తప్ప ఇతర దేవాత మూర్తులను ఉంచగూడదన...