బ్రాయిలర్స్ కోళ్ళు ఉండాల్సిన చోట, బరితెగించిన" బూతు యూత్ " ఉంటే ?
నిజంగా తప్పుడు పనులు చేసేవారికి ఉన్నచావు తెలివి తేటలు మంచి పనులు చేసే వారికి ఉండవేమో!అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలిసుల కళ్ళు గప్పి రంజైన రేవ్ పార్టీలు ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్న ఒక జంటకు 'యమ ఐడియా' వచ్చింది. ఇంకేముంది వెంటనే అమలులో పెట్టేసారట . కాని దొంగ తనం ,రంకుతనమ్ అనేవి ఎక్కువ కాలం రహస్యంగా ఉండజాలవు అనే నానుడిని నిజం చేస్తూ , నిన్ననే హైదరాబాద్ పోలిసులు రైడ్ చేసి సదరు రేవు పార్టిల రహస్యాన్ని బట్ట బయలు చేసారు. వివరాలు లోకి వెళితే , హైదరాబాద్ కు చెందిన ఇరువురు షామీర పేట లోని ఒక కోళ్ల పారం ను అద్దెకు తీసుకుని, అందులో కోళ్ళను పెంచే బదులు ముంబాయి, కల కత్తా లాంటి నగరాల నుండి మోడల్స్ ను రప్పించి , హైదరాబాద్ యువత తో వారిని మిలాకత్ చేసే "రేవ్ పార్టీ " లను నిర్వహిస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నరట . కొంత కాలం గుట్టు చప్పుడు కాకుండా రంజుగా కోళ్ళ పామ్ లో సాగుతున్న ఈ రంకు కోళ్ల వ్యాపారం చివరకు పోలీసులకు తెలిసింది . వారు ఒక ప్ల...