Posts

Showing posts with the label గ్రుహ పరిరక్షణ

మనకు కావల్సింది "గ్రుహహింస" చట్టమా? "గ్రుహ పరిరక్షణ" చట్టమా?

Image
            మనకున్న చట్టాల్లో ఎక్కువుగా దుర్వినియోగమవుతున్నది "గ్రుహహింస" చట్టం. ఆ చట్టం యొక్క ఉద్దేశ్యం  ప్రధానంగా కుటుంబంలో బాగమైన స్త్రీల సమస్యను పరిష్కరించడం.ఒక వ్యక్తి రక్షణ కోసం మొత్తం కుటుంబం విచ్చిన్నమవుతున్నా ఈ చట్టం పట్టించుకోదు. బార్యాభర్తల మద్య ఏర్పడే సమస్యలను ముందు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలి అని ఉన్నప్పటికి ఆచరణలో అది విఫలమవుతుంది. ఈ చట్టం వలన స్త్రీ లను కుటుంబ హింస నుండి  రక్షించే పేరుతో కుటుంబ వ్యవస్తలోకి చొరబడిన చట్టం {పోలిస్} చివరకు కుటుంబాన్ని కూల్చివేస్తుంది. అటు కుటుంబం నుండి బయటపడిన స్త్రీ కూడ చివరకు పొందేది శూన్యమే.   దీనంతటికి మూల కారణం ఇంట్లొని  సమస్యలను,వీదిలొ  సమస్యలను ఒకే రీతిగా చట్టం నియంత్రణలోకి తేవడమే కాక, వీటి నియంత్రణకు పోలిస్ వారిని వినియోగించడం కుటుంబ వ్యవస్తను నాశనం చేస్తుంది. దీనివలన కుటుంబాలలోకి రాజకీయ నాయకుల జ్యొక్యం ఎక్కువైపోతుంది. చేతకాని ప్రబుత్వాల పనితీరు వల్ల కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్త ఏది లేక పోవడం వలన బార్యను తిట్టిన భర్త, వెలయాలిని తిట్టిన విటుడు ఒకే జైల్ లో ఉండాల్సిన పరిస్తితి.